Friday, September 30, 2016

బ్రహ్మం గారు తన దివ్యదృష్టితో ఈ దృశ్యం చూడటం వలన ఆ మాట అన్నారా !!?

                                                                   


                           బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో అనేక వింతలు విశేషాలు గురించి చెప్పారు .16 వ శతాబ్దానికి చెందిన  అయన గారు చెప్పిన వింతలు విశేషాలు అన్ని అయన స్వయంగా తన దివ్యదృష్టితో చూసి చెప్పినవే . కాకపొతే అయన చూస్తున్న భవిష్య దృశ్యాన్ని ఆయనకు అర్ధమైన రీతిలో చెప్పడం జరిగింది కాబట్టి , ఇప్పటి మనకు అయన చెప్పేవి  అర్ధం కాక అయోమయంగా ఉండవచ్చు. ఉదాహరణకు :

   అయన గారి కాలజ్ఞానం లో  ఒక చోట "రెక్కల కోడి వచ్చును, దాని రెక్క విసురుకు వేల  మంది చచ్చును అని చెప్పినట్లు ఉంది. కోడి రెక్క విసురుకు వేలమంది చావడమేమిటి? ఇదేదో అభూత కల్పన కాకపొతే అనుకోవచ్చు ఎవరైనా . కానీ ఆధునిక కాలం లో  యుద్దాలు జరిగే సమయం లో ఉపయోగించే బాంబర్ విమానాలు చూడటానికి ఎలా ఉంటాయి ? రెక్కలు విప్పి ఎగురుతున్న కోడి లేక పక్షి లాగా  ఉంటుంది కదా! మరి ఆ బాంబర్ విమానాలు నుండి ప్రయోగించే బాంబులు వలన భూమి మీద ఉన్న జనం హతం అవుతుంటే , అదేదో రెక్క విసురు వలననే చేస్తున్నట్లు అనిపించడం వలననే బ్రహ్మం గారు ఆ విధంగా చెప్పి ఉండాలి. 

                                                                             

 అలాగే బ్రహ్మము గారు చెప్పిన ఇంకొక వింత . "ఆవు కడుపున పంది పుట్టును" అనేది . ఇదెలా చెప్పి ఉంటారో ఊహిస్తే,  అయన  గారి దివ్య దృష్టిలో ఆవు పందికి జన్మ ఇస్తున్న దృశ్యం కానీ , లేక పై చిత్రం లో చూపిన విధంగా ఆవు పాలు తాగుతున్న పంది   దృశ్యం కానీ కనిపించి ఉండాలి. అందుకే అయన ఆ విధంగా తన కాల జ్ఞానం  లో చెప్పి ఉంటారు. మరి ఆ విధంగా చుస్తే బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమయినట్లే కదా ! కరీం నగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణం లో జరిగిన పై వింతను  గమనిస్తే "ఆవు కడుపున పంది పుట్టిందా " అని అనిపించక మానదు కదా?!!

No comments:

Post a Comment