Monday, March 31, 2014

పవన్ "ఇజం" లోని ప్రక్రుతి సమతుల్యత బావనకు, "పావురాల గుట్ట " ఉదంతానికి ఏమైనా సంబందం ఉందా ?

                                                                         


నేను ఇదే బ్లాగులో 18 నవంబర్ 2012 న బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!" అనే టపాను పెట్టడం జరిగింది . అందులో మనిషి అనేకం అనుకున్నా , చివరకు భగవంతుడి డెసిషన్ యే పైనల్ అని "పావురాల గుట్ట ఉదంతం " ఉదాహరణ గా చెప్పాను.
  మొన్న వైజాగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గారు , తన "ఇజం " పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తూ అందులోని ఆరు అంశాలు గురించి టూకీగా చెప్పాడు . మొదటి 5 అంశాలు కామన్ గా అందరూ చెప్పేవే అనిపించింది . కాని అరవ అంశ మైన "ప్రక్రుతి సమతుల్యత " గురించి చెపుతూ ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అని అన్నాడు కాని దాన్ని గురించి సరిగ్గా వివరించ లేదు . బహుశా రాజు రవితేజ అయితే బాగా వివరించి ఉండే వాడేమో . అయన రాసిన పుస్తకం ఇంకా మార్కెట్ లో కి రాలేదు కాబట్టి మనకు ఇజం లోని "ప్రక్రుతి సమతుల్యత" గురించి తెలుసు కోవటానికి కొంత సమయం పడుతుంది . ఇక్కడ ప్రక్రుతి అనేది దేవుడు అనే బావనలో ఉపయోగించి ఉండవచ్చు .
                                           తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు !
                                        బుద్ది బూములేలదాం అంటే రాత గాడుదులు కాద్దాం అందట
                                  
అనే సామెతలు మానవ సంకల్పాలు అనుకున్నవి అనుకున్నట్లు జరుగక ఊహించిన దానికి పూర్తీ వ్యతిరేక దోరణిలో జరిగే సంఘటనల అనుభవం లో నుండి పుట్టినవి . అదే భారతీయులను  సమాజంలో జరుగుతున్నా దుష్కృత్యాలను తాము నిరోదిoచ లేమని నైరాశ్యానికి గురి అయినప్పుడు , అందులోనుoఛి  తీవ్ర వాదం జనిo చకుండా కాపాడుతున్నది , దైవిక పరమైన ఈ బావనలే అనేది నిజం . అందుకే సమాజం లోని ప్రజలలో   వేచి చూచే దోరణి , సహనం ఇవ్వన్ని అలవడి కొంత శాంతి సామరస్యాలతో జీవించడానికి అలవాటు పడ్డారు .
               
           నూరు గొడ్లను తిన్న రాబందు , ఒక్క గాలి వానకే ఖతం! అనే బావన కచ్చితంగా ప్రక్రుతి సమతుల్యత బావం లో నుంచి అవిర్బవిమ్చిందే . "ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో , అధర్మం దే పై చేయి అవుతుందో అప్పుడు నేను అవతరించి అధర్మాన్ని అంతం చేస్తాను " అన్న గితాచార్యుని వాక్యాలు ప్రక్రుతి సమతుల్యత బావానికి అడ్డం పట్టేవి . సమాజంలో సంస్కరించ లేనంతగా అరాచకం ప్రబలితే వాటిని దునుమాడె వారే అవతార పురుషులు . వారెవరూ అనేది బవిష్య  చరిత్ర మాత్రమె చెప్పగలదు . ఎందుకంటే వర్తమానం లో ఎవరికీ వారే దేవుళ్ళు . వారు చేసేదే కరెక్టు అనిపిస్తుంది . తాము పుట్టినది  ప్రజా ఉద్దరనకే అని అందరికి అనిపిస్తుంది . అలాగే  "ఆయనోస్తున్నాడు " అని అయనను  అనుసరించే వారు కోరుకుంటూoటారు.   అందుకే దేవుడు ఎవరూ , సైతాన్ ఎవరు అనేది బవిశ్యత్ లో చరిత్ర ను అద్యయనం చేసేవారు తెలుసుకుంటారు .
   మొన్నటి ఎన్నికల్లో ఒక్కొక ఓటరుకు 1000రూపాయలు , వెండి కుంకుమ బరినే లు , వస్త్రాలు ఇలా ఎవరికీ చేతనైన రీతిలో వారు పంచి పెట్టి తమ నాయకత్వ అర్హతను పరిక్షిమ్చుకుంటూ న్నారట . కోటి నిబందనలు పెట్టినా భారత ప్రజాస్వామ్యంలో  నితి  నిజాయితిలు నేతి  బీరకాయలో నేయి లాంటిదే ! మరి ఇలాంటి వాటిని చూస్తూ ఇంకా ఓపిక పట్టడానికి కారణం "ఆయనోస్తాడు " అనే . కాకపొతే అ అయన ఎవరు అంటే ఎవరి దేవుడు వారికి లాగా ఎవరి అయన వారికే అయన!

బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!కొసం లింక్ మిద క్లిక్ చేయండి "http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_18.html

No comments:

Post a Comment