Tuesday, February 4, 2014

రాష్ట్ర విభజన ఆపడానికి ముఖ్య మంత్రి గారికి మరొక టెక్నికల్ అవకాశమిస్తున్నకేంద్ర మంత్రి మండలి !.

                                                        

నేను ఇదే బ్లాగులో తెలంగాణా రాష్ట్ర విభజన విషయం గురించిన టపాలలో తెలంగాణా బిల్ విషయంలో గొప్ప డ్రామా అడిస్తుoదని చెప్పటం జరిగింది . అటు  చేసి చేసి చివరకు తెలంగాణా ప్రజల చెవిలో పూవులు పెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయిందని అర్ధమవుతుంది . దీనికోసం పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలు అందరిని వంచించే రీతిలో ఒక హై డ్రామా  నడపటానికి రంగం సిద్దమయింది . ఒక వైపు పార్లమెంటులో బిల్ పాస్ కావడానికి చిత్త శుద్దితో ఉన్నామని ప్రజలను నమించదానికి తెగ ఆరాట పడుతున్న కాంగ్రెస్ నాయకత్వం ఇంకొక వైపు సమైక్యామ్ద్రా చాంపియన్ గా తాము ప్రమోట్ చేస్తున్న ముఖ్య మంత్రి గారికి సుప్రీం కోర్టు ద్వారా రాష్ట్ర విభజన ఆపే విదంగా టెక్నికల్ అవకాశాలు ఇస్తున్నారు . అవేమిటో చూదాం . 

  రాజ్యాంగం ప్రకారం అసెo బ్లికి ఒరిజినల్ బిల్ పంపాల్సి ఉంది కాని అలా పంపలేదు . డ్రాప్ట్ బిల్ పంపారు . ఇది బలమైన టెక్నికల్ పాయింట్ . దిని సాకుగా చూపి ఆంద్ర ప్రదెస్ అసెంబ్లీ అ బిల్ ని తిరస్కరించింది . అంటే రాష్ట్ర విబజనను కాకుండా టెక్నికల్ పాయింట్ మిద రాష్ట్ర విభజన బిల్ ని తిరస్కరించి వెనుకకు పంపింది . దినిని సరిచేసి తిరిగి అసెoబ్లికి  పంపాలి కాని అలా చెయ్యకుండా డైరెక్టుగా అదే బిల్ ని ఈ నెల 10 వ తారికున రాజ్య సభలో ప్రవేశ పెడుతున్నట్లు హొమ్ మంత్రి ప్రకటించారు . ఇది మరో ఘోర తప్పిదం . రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పతి మాత్రమె పార్లమెంటుకు బిల్ ని రికమెండ్ చెయ్యాలి. ఈ  విషయంలో కేంద్ర మంత్రి మండలి కలుగ చేసుకోవడం అంటే రాష్ట్ర పతి గారి అధికారాలను బంగపరచినట్లే . రాష్ట్రపతి గారు చెప్పాల్సిన మాటను పబ్లిక్ గా కేంద్ర మంత్రి చెప్పడం వలన మొత్తం ప్రొసిజర్ పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది . ఇది చాలు సుప్రీం కోర్టు వారు కలుగ చేసుకోవడానికి . మరి ఇలా చెయ్యటం వలన లాబపదెది ఎవరు ? నష్టపోయేది ఎవరు? తరవాతి టపాలో చూదాం . ఎందుకంటే డ్రామా ఈ రోజే మొదలయింది ,ఇంకా కొన్నాళ్ళు నడుస్తుంది కాబట్టి . మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి .
                  

4 comments:

 1. కాంగ్రేసుగీత:
  తప్పులు చేయుట మావంతు
  తిప్పలు పడటం మీ‌వంతు

  దుష్టపాలన మావంతు
  కష్టాలోర్చుట మీవంతు

  పరిపాలన అంటే మా హక్కు
  పరివేదన మాత్రం మీ హక్కు

  దేశసంపదలు మాహక్కు
  దాసజీవనం మీ‌ హక్కు

  అయ్యా, , సామాన్య ప్రజలకు కాంగ్రెస్సు వారు ఏంచేసినా భళీ అనే హక్కే గాని ఇదేమిటీ అనే హక్కు లేదు. అదీ కాంగ్రెసు గీతాసారం మరి,

  ReplyDelete
  Replies
  1. కాంగ్రెసును కాస్సేపు పక్కనపెడితే, మిగిలిన పార్టీలు కూడా అంతే కదండీ.

   Delete
 2. "రాజ్యాంగం ప్రకారం అసెo బ్లికి ఒరిజినల్ బిల్ పంపాల్సి ఉంది కాని అలా పంపలేదు . డ్రాప్ట్ బిల్ పంపారు. ఇది బలమైన టెక్నికల్ పాయింట్"

  What does "draft" mean? Any document that is yet to be authorized is a draft.

  BTW article 3 only refers to "bill" without any prefix. The only condition is that the bill should be referred by the president.

  "దిని సాకుగా చూపి ఆంద్ర ప్రదెస్ అసెంబ్లీ అ బిల్ ని తిరస్కరించింది"

  Kiran Kumar Reddy's resolution suffers from severe procedural defects.

  "ఈ విషయంలో కేంద్ర మంత్రి మండలి కలుగ చేసుకోవడం అంటే రాష్ట్ర పతి గారి అధికారాలను బంగపరచినట్లే"

  The president has no such powers as per article 74.

  డ్రామాలు బాగానే ఆడుతున్నారు లెండి. ఒకప్పుడు 371-డీ గురించి పొలోమని గంతులేసిన వాళ్ళంతా అది చెల్లదని తెలిసాక ఇప్పుడు సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆంద్ర ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇప్పటికయినా ఈ పగటి వేషగాళ్ళను నమ్మడం మానేస్తే మంచిది.

  ReplyDelete
  Replies
  1. పగటి వేష గాళ్ళను నమ్మొదన్న మీ మాట కరెక్టు . మీరు చెప్పిన దాన్త్లో ఆర్తికిల్ 3 ప్రకారం రాష్త్రపతి గారికి ఉన్న అధికారాలు ఇతర అర్టికిల్స్ క్రింద ఉన్న అధికారాలు లాంటివి కావు. అర్టికిల్ 3 రాష్త్ర పతి గారికి ప్రత్యెక అధికారాలు కలిగించింది అని రాజ్యాంగ నిపుణుల బావన. ఏది ఏమైనా వీటి మీద సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది . దానికొసమైనా బిల్ ప్రాసెస్ మిద స్టే వస్తుందని సీమాంద్రుల ఆశ . అంతే అంతకు మించి ఏమి లేదు.

   Delete