Sunday, February 23, 2014

రాజకీయపార్టీల కోసమైనా రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయక తప్పేట్టు లేదు !.

                                                        
                                                           

ఆంద్ర ప్రదేశ్ లోని   రాజకీయ పార్టీల కోసమైనా రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేస్తే బాగుంటుంది కదా అని ఆ లోచిస్తున్నారట కొంతమంది ప్రాంతీయ పార్టీల నాయకులు!. ఇన్నాళ్ళు అంటే తెలుగు జాతికి ఒకే రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నే ప్రాంతీయ పపార్టీలుగా  ఉంటూ తెలుగు ప్రజలు అందరికి సేవ చేసే బాగ్యం దక్కినందుకు పొంగిపోతూ  ఉండేవారు . ఇప్పుడు హఠాతుగా  రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించే సరికి వీరికి ఒక టెక్నికల్ ప్రాబ్లం ఎదురయింది . అదేమిటంటే

   ఏదైనా ఒక ప్రాంతీయ  రాజకీయ పార్టి ఒకటి మించి వేరే రాష్ట్రాల్లో అదే గుర్తుతో పోటి చేయాలంటే దానికి జాతీయ స్తాయి గుర్తింపు కావాలి . మరి అలా ఉండాలంటే కనీసం 4 రాష్ట్రాలలో సదరు పార్టికి చట్ట ప్రకారం ప్రాతినిద్యం ఉండాలి . కాని ఇప్పుడు తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం వలన కంపల్సేరిగా  ప్రాంతియ పార్టీలు రెండు రాష్ట్రాలలోను పార్టీని నడపాల్సిన పరిస్తితి. మరి అటువంటప్పుడు రెండు రాష్ట్రాలలోను ఒకే గుర్తు మిద పోటి చేయాలంటే అ దానికి జాతీయ పార్టి గుర్తింపు కావాలి . అందువల్ల మరో రెండు రాష్ట్రాలు వాటికి కావాలి . ప్రాంతీయ పేరులు పెట్టుకుని ఇతర రాష్ట్రాలలో పార్టి ని విస్తరించలెరు . కాబట్టి ఉన్న ప్రత్యామ్నాయం , సెంట్రల్  చట్టానికి సవరణలు చెయ్యడం లేదా ఉన్న రెండు రాష్ట్రాలను మరో రెండు ముక్కలు చేయడం . కాబట్టి రానున్న 10 సంవత్సరాలలో మరో 2 రాష్ట్రాలు తెలుగు నాట అవతరిoచ వచ్చు .

   మంచి కైనా చేడుకైనా నలుగురు ఉండాలి అంటారు . తెలుగువారి రాష్ట్రాలు కూడా నాలుగు ఉంటె మనకి జాతి య హోదా రాకపోయినా , పార్టీలకు ఒక జాతీయ గుర్తింపు  వస్తుంది కదా !

2 comments:


  1. కం. ఒకసారి కత్తి నిచ్చిన
    నొక వే టొనరించి నఱకి యూరకునేనో
    శకలశతంబుగ సేయునొ
    ప్రకటంబుగ కత్తి గలుగు వాడే యెఱుగున్

    ReplyDelete
  2. అవును రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చెయ్యటమే సబబు. ప్రస్తుతం తెలంగాణా (మహరాష్ట్రా/కర్నాటకాల్లో ఉన్న పూర్వపు నిజాం రాజ్యం కలపకుండానే) ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ విషయాన్ని కె సి ఆర్ ఎందుకు విస్మరించాడో తెలియదు. ఏది ఏమైనా తెలంగాణా మొత్తానికి ఒక నాయకుడు ఉన్నాడు. ఈ కోస్తా ఆంధ్ర/రాయలసీమలకు నాయకుడు ఎక్కడ? ఒక్కడంటే ఒక్కడు లేడు కదా. ఉన్నారంటారా! ఆ ఉన్నారు లెండి నెత్తి మీద వంద రూపాయలు పెట్టినా కూడా పావలాకి అమ్ముడుపోని బాచ్ నాయకులుగా చెలామణి అవుతున్నారు అంతే.

    తెలంగాణా పోగా ఇక మిగిలిన ప్రాంతానికి పేరు ఏమి పెడతారో మరి. ఆంధ్ర ప్రదేశ్ గానే ఉంచుతారో లేక సీమాంధ్ర అంటారో మరి! సీమాంధ్ర అంటే ఆ పేరు సవ్యంగా లేదు. ఇంతకు ముందు తెలంగాణా ఆంద్ర, సీమాంధ్రా కలిపి ఆంధ్ర ప్రదేశ్ అయ్యి ఉంటె, తెలంగాణా పోయిన తరువాత మిగిలినది సీమాంధ్ర అనవచ్చు. ఆ పైన అటు ఉన్న మన్య/కళింగ ప్రాంతానికి ప్రాతినిధ్యం ఏది!! ఈ మిగిలి ఉన్న రాష్ట్రాన్ని కళింగ ఆంధ్ర (చత్తీస్‌ఘడ్ ఒరిస్సాల్లో ఉన్న తెలుగు ప్రాంతాలు కలిపి), రాయల సీమ (తమిళనాడు కర్నాటకల్లో ఉన్న తెలుగు ప్రాంతాలు కలిపి) ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పరచాలి. ఇక మిగిలినది అంటే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి కలిపి కోస్తా ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిస్తే ఇక ముందు ముందు నిరుద్యోగులు కాబొయ్యే ఏ రాజకీయ నాయకుడికీ ఉద్యమాలు లేవదీసే అవకాశం ఉండదు. ఇక జిల్లాల వారిగా ప్రత్యేక రాష్ట్రాలు అన్న డిమాండ్లు, నిరుద్యోగులైన పంచాయితీ మెంబర్లు మొదలెడితే తప్ప.

    ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మైనస్ తెలంగాణా కి రాజధాని ఏది అని తేలేప్పటికి తెలిసిపోతుంది, ఈ సమైక్య నినాదాల్లో ఉన్న పసేమిటో. అల్లరి ఇప్పటికే మొదలయ్యింది. ఆ కమిటీలు ఏవో వేస్తారు కదా అందులో ఫలనా వాడు లేడు, ఫలానా ప్రాంతానికి ప్రాతినిధ్యం లేదు, ఫలాన కులానికి ప్రాతినిధ్యం లేదు (కులమత రహిత లౌకిక సమాజమట మరి మనది!) అని మొదలు పెట్టి, కడప అని ఒకడు, విజయవాడ, రామవరప్పాడు, నంబూరు అని మరొకడు, విశాఖపట్టణం అని మరొకడు, రాజమండ్రి అని మరొకడు, అమలాపురం అని కొందరు, విజయనగరం అని మరి కొందరు నానా యాగీ మొదలవుతుంది. దీనికి తోడు బాధ్యత లేని గొట్టాల యాడ్ మాఫియా మీడియా ఉండనే ఉన్నది ఆ అల్లరిని పెంచి పోషించటానికి. జరగబొయ్యే అల్లరి తలుచుకుంటూ ఉంటే, ఈ టాటా స్కైలు, కేబుల్ కనెక్షన్లు తీసేసి, ఎక్కడో అటకమీద పారేసిన దూరదర్శన్ అంటిన్నా పెట్టుకుని, అదొక్కటే చూడాలని అనిపిస్తున్నది. రాబొయ్యే రాజకీయ తుఫాను, ఈ సమైక్య ఆంధ్రా తట్టుకోగలదా అని నా అనుమానమే కాదు, భయం కూడా!

    ReplyDelete