Thursday, January 30, 2014

సురభి కళాకారులను మించి పోయిన తెలుగు M.L.A లు మంత్రులు !

                                                         


అనుకున్నది అయింది ! ముక్య మంత్రి గారు లాస్ట్ బాల్ ప్రయోగించారు .  దెబ్బతో ఆట  పూర్తీ కాకుండానే  మాచ్ డిక్లేర్ అయింది . అసెంబ్లీలో తాము గెలిచామని సిమాoద్రా నాయకులు సంబరపడుతుంటే , ఇక్కడి పలితం నామ మాత్రం కాబట్టి , పార్లమెంటులో అసలైన విజయం తమదే నని తెలంగాణా వాదులు అంటున్నారు . కాబట్టి తెలంగాణా ప్రజలు అవేశా లకు లోను కాకుండా సంయమనం పాటించాలని హితవు చెపుతున్నారు . కాని అసలు మాచ్  కు ముందే మాచ్  పిక్స్ అయిందన్న సంగతిని ఎవరూ చెప్పరు . ఎందుకంటే రానున్న ఎన్నికల్లో వారెవరూ ప్రజలు ముందు జిరోలుగా నిలబడటానికి సిద్దంగా లేరు .

  ఇక అసలు మాచ్ పిక్సింగ్  సూత్రదారులైన  కేంద్రo  లోని పెద్దలు రాష్ట్ర విభజన విషయంలో తాము ఎంతో తొందరతో ఉన్నట్లు తెలంగాణా ప్రజలు అనుకోవాలని , అనుకూల మీడియా వర్గాలతో పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు షెడ్యూల్ ప్రకటించారు . ఎట్టి  పరిస్తితుల్లో పిబ్రవరి 21 కి రెండు రాష్ట్రాలు గ్యారంటి అంటున్నారు . కాని కిరణ్ కుమార్ గారికి  సుప్రీం కోర్టు కు వెళ్ళే బంగారం లాంటి చాన్స్ ను తామే కావాలని ఇచ్చినట్లు ప్రజలకు చెప్పరు  గాక చెప్పరు ! ఎo దుకంటే రేపు సిమాంద్రాలో  తమ కు దిక్కు కిరణ్ గారే కాబట్టి .

  మొన్నట్టి  దాక ఒరిజినల్  బిల్ అన్న కేంద్ర హొమ్ మంత్రిత్వ శాఖ వారు చివరి దశలో తాము రాష్ట్ర పతికి పంపింది ముసాయిదా బిల్ మాత్రమె అని చెప్పడంలో ఉన్న పరమార్దం ఏమిటి ? అది మాచ్  పిక్సింగ్ లో బాగం కాదా ?

సాంప్రాదాయం  ప్రకారం అయితే ముసాయిదా బిల్ , రాజ్యంగ ప్రకారం అయితే ఒరిజినల్ బిల్ పంపాలని కేంద్ర ప్రబుత్వ పెద్దలకు తెలియదా? తెలియదని ప్రజల్ని నమ్మ మంటారా? రాజ్యాంగం ప్రకారం ఒరిజినల్ బిల్ ని సమగ్రం గా  తయారు చేసి రాష్ట్ర అసెంబ్లీకి  పంపించాలి . అదే ఇతర రాష్ట్రాల విబజన విషయాలలో మాదిరి సాంప్రాదాయ  విదానం అయితే ముసాయిదా బిల్ పంపితే సరిపోతుంది . ఎందుకంటే సంప్రాదాయ విదానంలో రాష్ట్ర అసెంబ్లీ విబజన చేయమని తీర్మానించాకే  విబజన ప్రాసెస్ మొదలు అవుతుంది . అలానే చేద్దామని కేంద్రం వారు మొదట్లో అనుకున్నారు . అప్పుడు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి కాబట్టి అసెంబ్లీ నుండే ప్రాసెస్ మొదలు పెట్టొచ్చు అనుకున్నారు.అలా చేస్తే తెలంగాణలో T.R.S తోనూ , సిమామ్ద్రాలొ లో జగన్ తోను పొత్తుపెట్టుకుని ప్రతి పక్షాలను దుంప నాశనం చెయొచు అనుకున్నారు కాని సిమాన్ద్రా ప్రజలు కాంగ్రెస్ వారి మిద తీవ్రంగా ఎదురు తిరగడంతో ఏమి చెయ్యాలో అర్ధం కాక , చివరకు సిమాంద్రా  వారితో మాచ్ పిక్సింగ్ చేసుకుని కిరణ్ గారిని కెప్టైన్ గా బరిలోకి దించే కండిషన్ మిద గేమ్ మొదలు పెట్టారు . అందులో బాగమే ముక్య మంత్రి గారు ఈ  రోజు అసెంబ్లీలో బిల్ ని తిరస్కరించి "జై సమైక్యామ్ద్రా " అంటూ అసెంబ్లీలో నినాదాలు చేస్తూ బయటకు రావడం .

  ఇక ఈ  డ్రామా లోని రెండవ అంకం డిల్లీలో జరగ బోతుంది . అక్కడా అంతే ! సిమంద్రా ..M.P లు సబను సాగ బోనివ్వమంటూ విర పద్యాలు పాడుతుంటే ప్రబుత్వం  తమ కర్తవ్యంలో బాగంగా , ఎన్ని అడ్డంకులు  ఎదురయినా పార్లమెంటులో బిల్ పాసవ్వడానికి నానా ప్రయాస పడుతున్నట్లు యాక్షన్ చేస్తుంది . ఈ  లోపు సుప్రీం కోర్టు వారు  జ్యొక్యమ్ చేసుకుంటారు . తాము ఎంత చిత్త  శుద్దితో ఉన్నప్పటికీ కిరణ్ గారి వాళ్ళ అది సాద్యం కాలేదని చెపితే తెలంగాణా ప్రజలు నిజమే అని నమ్మి కనీసం 5 సీట్లు అయినా గెలిపిస్తారని , అలాగే తాము హిరోను చేసిన కిరణ్ గారు సిమామ్ద్రాలొ స్వీప్  చేసినా లేక అత్యదిక సీట్లు సాదిమ్చినా అవి తమకు మాత్రమే ఉపయోగ పడతాయని అధికార పార్టి వారి బావన . అందుకే కిరణ్ గారికి కోర్టు తలుపు లు తట్టే టెక్నికల్ అవకాసం కల్పించారు అనేది స్పష్టం అవుతుంది .

  కాబట్టి తెలుగు ప్రజలారా ఇంకా 4 నెలలు దాకా మనందరికీ ఉచిత డ్రామా ప్రదర్సనలు ఉండబోతున్నాయి అన్న మాట . మొత్తానికి తెలుగు  M.L.A లు మంత్రులు సురభి కళాకారులను మించి పోయారని పిస్తుంది . ,

2 comments:

  1. సురభి కళాకారులు అద్భుతమైన కళాకారులు. ఎంతో ప్రతిష్ట కల ఆ సురభి సంస్థ పేరును ఎందుకు ఈ నాటి రాజకీయ నాయకులను కలిపి పోల్చి, సురభి వారిని అవమానిస్తున్నారు! సురభి వారు ఇది "నాటకం" అని చెప్పి మరీ స్టేజీ కట్టి వేస్తారు. అలాంటి నిజాయితీ గల కళాకారులతోనా ఈ నాటి రాజకీయాలను పోల్చటం! ఆడుతున్నది నాటకం అని చెప్పకుండా అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్న వారితో సురభి వారిని కలిపి పోల్చటం తగదు.

    ReplyDelete