Monday, September 19, 2016

'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? అని నేను ఊహించింది నిజమే అని రుజువు చేస్తున్న సైన్స్ ఆర్టికిల్ !

                                                           


నేను గత నవంబర్ 6 న క టపాని "'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? " అనే టైటిల్ తో ప్రచురించటం జరిగింది. ఆ రోజు ఎందుకో నాకు మనిషి అనేవాడు కోతి నుండి కాక మార్క్స్ గ్రహం మీద అభివృద్ధి చెందిన మానవుడిగా ఉండి అక్కడ పరిస్తితులు జీవించడానికి వీలు లేనంతగా మారి పోయాక అంటే అతి శీతలం   వలన కానీ ఇతరత్రా కారణాల వలన కానీ , స్పేస్ షిప్ ల ద్వారా సూర్యకుటుంబం లో తర్వాతి గ్రహం మరియు జీవరాసి మనుగడకు అనుగుణంగా ఉన్న భూమి మీదకు వచ్చి ఉంటాడని ఒక ఆలోచన వచ్చింది.

      ఒక వేళ అదే నిజమయితే భూమికి  కూడా కొన్నేళ్ళకి అదే పరిస్తితి కలిగితే  తిరిగి మానవుడు వెళ్ళవలసింది శుక్ర గ్రహానికే కానీ తిరిగి అంగారక గ్రహానికి కాదు కదా అని కూడా అనిపించింది. నా ఆలోచనకు ఆదారం ఏమిటంటే ఏ గ్రహం అయినా సరే సూర్యుడు లేక నక్షత్రానికి , ప్రస్తుతం భూమి ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో ఉండి ఉంటే అక్కడ జీవరాసి కి అనువైన వాతా వరణం ఉండి ఉండాలి. మరి విశ్వం వ్యాపిస్తుంది నిజమే అయితే తప్పకుండా గ్రహాలు సూర్యుడికి రాను రాను దూరంగా వెళుతుండాలి కదా. అలాంటప్పుడు ఏ గ్రహం కూడా  స్తిరంగా ఒకే కక్ష్యలో తిరగటానికి వీలు లేదు. అలాంటి పరిస్తితుల్లో ప్రస్తుతం ఉన్న పొజిషన్ కి  భూమి ఏ మాత్రం సూర్యుడుకి  దూరంగా వెళ్ళిన వాతావణం మార్పులు చెంది భూమి మానవ  నివాసయోగ్యానికి పనికి రాకుండా పోతుంది. అప్పుడు అభివృద్ధి చెందిన మానవుడు తప్పకుండా వేరే గ్రహానికి వలస పోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ఒకప్పుడు ప్రయత్నించి ,ఆ ప్రయత్నంలో బాగంగానే అంగారక గ్రహం మీద నుండి భూ గ్రహం మీదకు మానవుడు అడుగు పెట్టి ఉంటాడని నాకు కలిగిన ఊహ.దానిని తర్వాతి టపాలో రాద్దామనుకున్నాను. కానీ కొన్ని అనుమానాలు నివృత్తి కాక టపా రాయడం వాయిదా వేసాను.

  అయితే  ఈ  మద్య ఒక చోట ఒక విషయం చదివాను.ఎవరో స్పేస్ ట్రావల్  కంపనీ వారు 2023 నాటికి అంగారక గ్రహం మీద నివాస గృహాలు ఏర్పరచి, అక్కడికి మానవులను తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారని, దానికి ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలు మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని , అందులో మన హైదరాబాద్ వారు కూడా  ఉన్నారని చదివి ఆశ్చర్య పోయాను. ఇది నా ఊహకు విరుద్దం.ఒక సారి నివాస అర్హత కోల్పోయిన గ్రహంని అంటే సూర్యుని నుండి నియమిత దూరంలో ఉండాల్సినదానికంటే కొంచం దూరంగా జరిగి అక్కడి వాతావరణం శీతలంగా మారిపోయి, వాయువులు సైతం ఘనీబవించే స్తితిలో ఉన్న గ్రహాన్ని తిరిగి నివాసయోగ్యం చేయడం ఎలా సాద్యం.అక్కడి వాతావరణం ని మార్చడం అసాద్యం.  అదంతా సైన్స్ కు పేరున ప్రజల్ని మోసం  చేసి తమ స్పేస్ వ్యాపారం సంబందించి అసత్యాలు ప్రకటిస్తున్నారు అనిపిస్తుంది. లేదా . బహూశా ఇది మార్స్ గ్రహం పట్ల ప్రజలలో ఆసక్తి కలిగించేందుకు కొంతమంది పని కట్టుకుని ఇలా చేస్తుండవచ్చుఅని కూడా   అనిపిస్తుంది. కాబట్టి వీటి గురించి ఇంకా ఏమన్నా కొత్త సాక్ష్యాలు బయల్పడతయా అని ఎదురు చూ స్తున్నాను.

  నిన్న ఒక ఆర్టికిల్ చదవి చాలా ఆశ్చర్యం వేసింది. ఆ ఆర్టికిల్ ఏమిటంటే   Evidence suggests life on Earth could have started on Mars.  దానిలో మొదటి లోనే ఎమున్నదంటే "There is a theory that’s gaining a bit of traction in the scientific community, a theory which suggests that life on Earth could have come from Mars. Evidence in favor of this theory has been building over the last couple of decades, and it indicates that we all (could be) Martians." అని.

   కాకపోతే సైంటిస్టుల ఊహ ఏమిటంటే అంగారక గ్రహం మీద జీవం  పరిణామ దశలో ఉండగా అక్కడి  శిలలు కొన్ని అంగారక కక్ష్యలో నుండి తప్పి భూమి మీదకు వచ్చి పడ్డాయని,అట్టి శిలలు మీద ఉన్న జీవరాశి భూ గ్రహం మీద అభివృద్ధి చెంది ఇప్పటి జంతుజాలంగా ఆవిర్భవించిందని సూత్రీకరిస్తున్నారు. దిని ప్రకారం డార్విన్ సిద్దాంతం కూడా కరక్టే అని వారి ఊహా కావచ్చు. . ఇది నా ఊహకు విరుద్దం. ఖచ్చితంగ మానవుడు అంగారక గ్రహం మీద అభివృద్ధి చెందాకే ఈ  గ్రహం మీదకు అంతరిక్ష  నౌకల ద్వారా వచ్చి ఉండాలి. మన పురాణాలలో చెపుతున్న కదలకు అంగారక గ్రహం కు ఏదో సంబందం ఉండి ఉండాలి అనిపిస్తుంది. నా ఊహ నిజమే అయితే విశ్వంలో భూమి ని పోలిన  జీవ సహిత గ్రహాలు ఇంకా చాలా  ఉండి ఉండాలి. వాటి మీద జీవులు కూడా ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్లు ఆలోచిస్తూ ఉండాలి. వారి మద్య, మన మద్య ఏదో రకమైన కమునీకేషన్ సిస్టం ఉండి ఉండాలి. అవే మనకు ఆలోచనలు గ ఫ్లాష్ అవుతూ ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సైన్స్ పిక్షన్ సినిమా కద అవుతుంది .

  కానీ నాకు తెలిసినంత వరకు ఒకటి మాత్రం నిజం . సైంటిస్ట్ కంటే అద్యాత్మికంగా ఆలోచించే వారికే విశ్వ రహస్యాలు ముందుగా తెలుస్తుంటయి. వాటిని నిరూపించడమే సైంటిస్టులు చేసే క్రుషి .అంతే! మన పూర్వికులు కుజ గ్రహాన్ని బూమి పుత్రుడు గా బావించారు.ఏ పరిశోదనలు చెయ్యకుండా , సైన్స్ అనేది తెలియని రోజుల్లో వారికి ఆ ఆలోచన ఎలా వచ్చింది? భూమికి అంగారకుడుకి సంబందం ఉంటుందని ఎలా ఊహించారు? అదే విశ్వ రహస్యం. మనిషికి, ప్రక్రుతి కాలానుగుణంగా  అట్టి జ్ఞానాన్ని ఎరుక పరుస్తుంది అని నా దృడ అభిప్రాయం. అందుకే చాలా మందికి ఆపిల్ పండ్లు చెట్టునుండి క్రింద పడడం అనుభవమే అయినా , ఒక న్యూటన్ మాత్రమే దానిలోని రహస్యాన్ని కనుగోగలిగాడు. అయిన్స్టీన్ సైతం ఏ రోజు లేబరిటరిలోకి అడుగు పెట్టకుండానే విశ్వం యొక్క  రహస్యాలు కనిపెట్టగలిగాడు. ఇవ్వన్నీ సాద్యమవటానికి దృష్టిని సంబదిత విషయం మీద లగ్నం చేసి ఆలోచన చెయ్యడం లేదా ద్యానం  చెయ్యడం. . దానినే సమాది స్తితి అంటారు. అదే మన పూర్వికులు చేసింది! 

    పై ఆర్టికిల్ కోసం ఈ  లింక్ మీద క్లిక్ చెయ్యండి. http://www.fromquarkstoquasars.com/evidence-suggests-life-on-earth-could-have-started-on-mars/

 నేను ఇదివరకు పెట్టిన'మానవుడు' వచ్చింది 'మంకీ ' నుండా ? ,' మార్స్ ' గ్రహం నుండా ? టపా  కోసం ఈ  లింక్ మీద క్లిక్ చెయ్యండి. http://kalkiavataar.blogspot.in/2013/11/blog-post_6.html

                                                   (2/1/2014 Post Republished).

3 comments:

 1. http://www.newindianexpress.com/nation/Channel-ordered-to-apologise-to-Ranjitha/2013/09/03/article1765099.ece

  In a significant ruling that is likely to set a precedent in cases involving privacy of an individual, the self regulatory body of entertainment channels has asked a private channel to apologise to actress Ranjitha Menon for showing a “morphed” video featuring her in a compromising position with Swami Nithyananda.


  ReplyDelete
 2. To know more details

  http://nithyananda.org/news/nithyananda-ranjitha-video-morphed-mr-saxena-ex-coo-sun-tv-confessesTo know more details.

  ReplyDelete
 3. http://www.daijiworld.com/news/news_disp.asp?n_id=186872

  ReplyDelete