Friday, September 23, 2016

."కల్లూరి గుట్టల" మీద బ్రతుకుతూ , "కల్ల కొండలకు " మొక్కడమేందిరా?

                                                          

                                              మా వూరి ప్రక్కనే నరసింహ రావు పేట అనే ఊరు ఉంది . అ ఊరిలో తెలగ వారి కుటుంబాలు ఎక్కువుగా ఉన్నాయి . మా పొలం ప్రక్కనే వారి పొలాలు ఉండేవి కాబట్టి వారితో మాకు పరిచయాలు ఉన్నాయి . అప్పుడప్పుడు  వారు పిలిస్తే వాళ్ళ ఇండ్లకు కూడా  వెళ్ళటం జరిగేది. ఒక రోజు అప్పయ్య  అనే స్నేహితుడు పిలిస్తే వారింటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో కల్లూరు గుట్ట దేవతకు సంబందించిన కొలువు కొలిచారట , దాని సందర్బంగా జరుపుఇతున్న పంక్షన్ అది. దానికే నాతో పాటు మరి కొంత మంది ప్రెండ్స్ ని పిలిస్తే వెళ్ళటం జరిగింది.

ఇక్కడ "కల్లూరు గుట్టలు " గురించి కొంత తెలుసుకోవాలి. మా ఊరికి తూర్పున పది కిలో మీటర్లు దూరంలో వ్యాపించి ఉన్న గుట్టల శ్రేణిని "కల్లూర్ గుట్టలు" అని పిలుస్తారు. ఈ  గుట్టలను అనుకుని అనేక గ్రామాలు ఉన్నా , పెద్ద గ్రామం , ఇప్పట్టి మండలం అయిన కల్లూరు కు దగ్గరలో ఉన్నందు వలన వీటికి ఆ పేరే వచ్చింది. ఈ  గుట్టలు మీద "టేకు" జాతి తప్ప , మిగతా అన్ని వృక్ష జాతులు లభిస్తాయి. మా ఊరుకు దగ్గరలో చిన్న చిన్న గుట్టలమీద సహితం టేకు చెట్లు ఉంటాయి కానీ, అంత పెద్ద గుట్టలమీద టేకు చెట్లు కనపడక పోవటం విశేషం. మా చుట్టు ప్రక్కల ఊర్లు అయిన అన్నారు గూడెం, నరసింహా రావు పేట, ఏనుకూరు గ్రామ రైతులకు కావలసిన కలప , వెదురు, చిల్లమండ, బడితెలుకు ఎక్కువుగా ఈ  గుట్టల మీదే ఆదారపడే వారు. ఇక పోతే అన్నారుగోడేం, నరసింహా రావు పేట గ్రామానికి చెందిన చాలా కుటుంబాల వారు ఈ గుట్టల మీదే ఆదారపడి బ్రతికే వారు. వారు ఉదయం కోడి కూయగానే లేచి , గొడ్డళ్ళు బుజాన వేసుకుని , కల్లూరు గుట్టలకు వెళ్లి , అక్కడ రైతులకు కావాల్సిన కలపను తీసుకుని వచ్చి, గ్రామాలలో రైతులకు ఇస్తూ తమ జీవనోపాది సంపాదించుకునే వారు. కాబట్టి ఆ కుటుంబాల వారందరికి "కల్లూరు గుట్టలు" తమకు బ్రతుకు తెరువు చూపుతున్న దేవతలు . అందుకే వాటిని దేవత రూపం లో కొలుపులు కొలుస్తూ పూజించడం వారికి ఆచారం. వారి ఇండ్లలో ఎవరైనా మగ పిల్లలు పుడితే ముందుగా ఆ పిల్ల వాడిని కల్లూరు గుట్టల వైపు పెట్టి నమస్కరించి, తమ పిల్లవాడికి ఏ లోటు లేకుండా చూడాలని మొక్కే వారట. అంత సెంటిమెంట్ వారికి!

                         అయితే ఇక్కడ మేము వెళ్ళిన మా మిత్రుడి ఇంట్లో ఒక చిన్న పాటి గొడవ మా మిత్రుడు తండ్రికి , తమ్ముడికి జరుగుతుంది. మా మిత్రుడు తమ్ముడు డు కొంత కాలం క్రితం వేరే మతం లోకి వెళ్ళాడట. ఆ మత  పద్దతుల ప్రకారం వేరే దేవతను కానీ, దేవుళ్ళను కాని పూజించకూడదు అంట. కనీసం బొట్ట కూడా  పెట్టుకోకూడదు అంట! అటువంటి వాటికి చాలా దూరంగా ఉండాలట . లేకుంటే సైతాన్ పట్టి పీడీస్తాడట! అందుకే ఇంటి పక్కన  ఉన్న ఆతను ఈ  పంక్షన్ కి రాలెదు. కానీ మా మిత్రుడు ఇంటికి వచ్చిన బందుమిత్రులను చూసి వారి పిల్లలు పెదనాన్న  ఇంటికి వెళతామని గొడవ చేస్తుంటే , వారు ఇక్కడకు  రాకుండా చెయ్యటానికి వారి మత ఆచారాల ప్రకారం పూజించే "విదేశి  కొండలు " పోటో ఒకటి పెట్టుకుని పూజలు చెయ్యడం మొదలుపెట్టాడు. అది చూసిన మా మిత్రుడు తండ్రికి కోపం నసాళానికి అంటి చిన్న కొడుకుతో గొడవ పెట్టుకుంటున్నాడు. " ఒరే వెదవా , పొద్దున్న లేచింది మొదలు సాయం కాలం వరకు నువ్వు గడిపేది కల్లూరు గుట్టల మీద. నీకు, నీ పెళ్ళాం బిడ్డలకు ఇంత  కూడు  పెట్టేది ఆ కల్లూరు గుట్ట దేవత అయితే నువ్వేదో ఆ "కల్ల  గుట్టలు " కు మొకుతావేందిరా అని తిడుతూ నానా హంగామా చేస్తుంటే మేము సర్ది చెప్పి, ఎవరి విశ్వాసాలు వారివి అని నచ్చ చెప్పటానికి ప్రయత్నించిన ఆ పెద్దాయన శాంతించలేదు. " మీకు తెలియదయ్యా, నవాబుల కాలం నుండి మాకు కల్లూరు గుట్టలే దేవతలు. వారు కూడ మా నమ్మక్కాన్ని గౌరవించారు కానీ ఇదేమి మాయదారి కాలమో , ఆ గుట్ట ల మీద ఆదారపడి బ్రతుకుతూ , వేరే దేశంలో  ఉన్న గుట్ట దేవతను కొలవడమేమ్ది? అలా అంత నమ్మక్క్జం ఉంటే ఆడికే పోయి బ్రతకాల , ఈడేందుకు ? అలా చేసి అలా చేసి , ఏదో ఒక నాడు మా ఆచారం అంత మాయం చ్జేస్తారు,   . అని ఆ ఆ పెద్దాయన అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పెద్దాయనకున్న ఆలోచనలో పదవ వంతు కూడా  మనలో చాలా మందికి లేదనిపించింది.

                                     ఇది జరిగి చానాళ్లు అయింది. మన ఆచారాలు సంప్రదాయాలు మాత్రమే దాడికి గురవుతూ , అన్య మతాలూ మరింతగా విస్తృత మవడానికి అవి కారణమవుతున్నాయి. ఈ  దేశ వనరుల మీద బ్రతుకుతూ, అన్య దేశాలను , అక్కడి ప్రాంతాలను ఆరాద్య ప్రాంతాలుగా కొలవడం అంటే అది కచ్చితంగా ఈ  ఇంటి తిండి  తిని ఎదురింటోడికి ఉపయోగపడటం లాంటిది . ఎప్పటికైనా ఇటువంటి విదానలతో మన దేశ సమగ్రతకు ముప్పే అని గ్రహించటం విజ్ఞుల లక్షణం. స్తానిక పరిసరాలను, నదులు, కొండలును ఆరాదించడం అనేది మనలోని దేశ భక్తికి కూడా నిదర్శనం.

                           మా ఊరు ప్రక్కనే ఉన్న గుట్ట ని నరసింహ స్వామి గుట్ట అంటారు. కారణం ఆ గుట్ట మీదే మా ఇల వేల్పు శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వెలిసాడు కాబట్టి. అందుకే ఆ గుట్ట ని ఎంతో పవిత్రంగా చూస్తారు భక్తులు. ఆ గుట్ట మరియు నరసింహా స్వామీ దేవాలయ విశేషాల కోసం ఈ  క్రింది వీడియో లింక్ ని క్లిక్ చెయ్యండి
                                                   


                   

                                           (8/12/2013 Post Republished).

No comments:

Post a Comment