Tuesday, November 12, 2013

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న K.C.R గారు విష్ణు మూర్తి అవతారమా !?

                                                    

నేను ఈ   మద్య  మన్వంతరాలు గురించి ఒక పురాణ బాగం చదివాను.హిందూ పురాణం  లోనివి అని అందులో చేప్పబడిన అంశాలు "దశవాతార" సిద్దాంతానికి కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఉదాహరణకు దశావతారాలలో వామన అవతారం 5 వది. అది నరసింహా స్వామీ అవతారం తర్వాత వస్తుంది. అయన తర్వాత వచ్చేది పరశురామావతారం . కానీ "మన్వంతర " సిద్దాంతం ప్రకారం ఏడవ మనువైన వైవస్వత మనువు పేరుతో ప్రారంభమైన ప్రస్తుత "వైవస్వత మన్వంతరం " లో అవతరించిన విష్ణుదేవుని అవతార స్వరూపమే వామనుడు .
 ఈ  వామన అవతారమే "బలి చక్రవర్తిని " పాతాళానికి త్రొక్కి  వేసి , అతని వద్దనుండి "ఇంద్ర " పదవిని "పురంద్రుడికి అప్ప చెపుతూంది. అయితే ఎంతో ధర్మ నిష్టుడైన "బలి చక్రవరి" దాన గుణానికి సంతసించి అతనికి రాబోయే మన్వంతరం లో అంటే "సూర్య సావర్ణిక మన్వంతరం " కాలం లో తిరిగి ఇంద్ర సింహాసనం అధిష్టింప చేస్తానని వరమిస్తాడు. అలా బలి చక్రవర్తికి  భగవాన్ విష్ణు మూర్తి  వరం ఓకటి  పెండింగ్ లో ఉంది .

ప్రస్తుతం రాజరికాలు పోయి ప్రజాస్వామ్యాలు వచ్చాయి .దళిత బావజాల వాదులు హిందూ సాంప్రాదాయక దేవుళ్ళును పూజించవద్దని, రాక్షస వంశజులైన రావణుడు, బలి చక్రవర్తి , నరకాసురుడు వంటి వారిని పూజించాలని నూతన బావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ , కొన్ని విశ్వ విద్యాలయాలలో వారి పేరు  మీదనే "ఉత్సవాలు" చేస్తున్నారు. అయితే బలి చక్రవర్తికి స్వయంగా విష్ణు మూర్తే వరం ఇచ్చాడు కాబట్టి , అటు సాంప్రదాయక హిందూ సిద్దాంతం ప్రకారం కూడా  రాక్షస వంశజుడైన "బలి చక్రవర్తి" ఇంద్రుడు కావల్సిందే. ఇది దళిత నాయకులకు ప్లస్ పాఇంట్. కానీ మహా బలి ని ఇంద్రుడు చేయాలంటే భగవాన్ విష్ణు మూర్తి కూడా  తిరిగి అవతారం ఎత్తాలి. అయన అవతారం ఎత్తాలి అంటే మన్వంతరం మారాలి . కానీ సాంప్రదాయక హిందూ లెక్కల ప్రకారం ఇప్పట్లో మన్వంతరం మారదు.

   కానీ కోంత మంది సిద్దాంత కారుల ప్రకారం "వైవస్వత మన్వంతరం "  వెళ్లి  మనం "సూర్య సావర్ణిక మన్వంతరం " లోకి అడుగు పెట్టామట! అందుకే  బలి లాంటి రాక్షస వంశీయులకు పూజలు మొదలయ్యాయి అట. త్వరలో రాక్షస వంశీ యులే   ప్రజా నాయకులై అధికారాన్ని చేపడతారట! మరి దళిత నాయకులు కు ఇంత అనుకూలంగా ఉన్న హిందూ మతగ్రందాలలోని అంశాలు నమ్ముతారో , నమ్మరో ! అయితే మనకు త్వరలో ఏర్పడబోయే "తెలంగాణ రాష్ట్రం " కి ముఖ్యమంత్రిగా "దళిత వర్గం " నాకు చెందిన వారినే నియమిస్తాను అని  తె. రా . స అదినేత గతం లో దళితులకు వరం ఇచ్చారు . మరి ఆ వాగ్దానాన్ని అయినా దళిత నాయకులు నమ్మితే , రేపు వారి వర్గం వారే తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా K.C.R.  గారిని తమ కోసం అవతరించిన బగవంతుడు అనుకుంటే , పురాణాలలో చెప్పిన విష్ణు మూర్తి అవతారం K.C.R గారే అని అనుకోవచ్చా ?

  మొత్తానికి దళిత బావజాలికులు హిందూ పురాణాలను నమ్మక పోయినా , పురాణాలలో వారికే బవిష్యత్ ఇంద్ర పీఠం అని బగవంతుడు వరమిచ్చినట్లు ఉండడం ఆశ్చర్యకరమైన విషయమే! నేను చదవిన ఆ పురాణం తాలుకూ పేజి ని క్రింద చూడగలరు.(viii chap, 3rd para).

No comments:

Post a Comment