Tuesday, November 19, 2013

Face Book లో లైక్ ల కోసం వేగంగా వస్తున్నా రైల్ క్రింద పడుకున్న పిల్లలు! సామాజిక సైట్ అయిన ఫేస్ బుక్ పిచ్చి పిల్లలను ఎంత ప్రమాదకరమైన పనులు చేయిస్తుందో ఐ క్రింది విడియో లింక్ ను చూస్తె తెలుస్తుంది. ఆడపిల్లలు ఏమో "నేను బాగున్నానా " అని కామెంట్ల కోసం పోటోలు పెడుతూ, అపరాచితులకు తమ అందాలు ప్రదర్శిస్తుంటే , మగ పిల్లలు ఏమో తమ వీరత్వాన్నీ ప్రదర్శిస్తూ, ప్రమాదకరమైన ఫీట్లు సెల్ పోన్ ద్వారా చిత్రీకరించి మరీ ఫేస్ బుక్ లో పెడుతున్నారు. ఇటువంటి చేష్టలను నియంత్రించడానికి తగిన నియమ నిబందనలు త్వరగా ఏర్పాటు చేయకపోతే ఈ  పిచ్చి ముదిరి పాకాన పడేటట్లుంది.

  మైనర్ లు సెల్ పోన్ లు ఉపయోగించకుండ చట్టం చేస్తే ఎలా ఉంటుంది? ఒక వేళ సెల్ ఇచ్చిన కేవలం ఒక నంబర్ కు మాత్రమే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఉండే సెల్ లు మాత్రమే ఉపయోగించలి. అంతే కాక ఎట్టి పరిస్తితిలో మైనర్ ల సెల్ లకు నెట్ కనెక్షన్ ఉండ కూడదు.  అటువంటి సెల్ లను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పే అధికారం పబ్లిక్ కి ఉండాలి . అంటే మైనర్ లు నిషేదిత సెల్ లను ఉపయోగించడాన్ని "కాగ్నిజబుల్  అపెన్స్ " గా గుర్తించాలి. ఇలా చేస్తే కొంత నియంత్రణా భయం ఉంటుంది అనుకుంటా!

ఫేస్బుక్ లో లైకుల కోసం పిల్లలు చేసిన ఆ ప్రమాదకర ఫీటు కోసం క్రింది విడియో లింక్ ను చూడండి
                       


                                         

2 comments:

 1. ఘోరం! మొదట ఈ సెల్ ఫోన్లల్లో వీడియో/స్టిల్ కెమెరాలను లేకుండా నిషేధించాలి. అప్పుదు ఇలాంటి చెత్త పనులు పిల్లలు చెయ్యరు. సెల్ వీడియో వల్ల ఎన్నెన్ని అనర్ధాలు జరుగుతున్నాయి! ఆడపిల్లలను ఫొటోలు తీసి, వీడియోలు తీసి ఇబ్బంది పెడుతున్నారు. వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్నదాన్ని గుడ్డిగా అనుసరించకుండా, మనదేశాని సరిపడ్డ సాంకేతికతను మాత్రమే దేశంలోకి రానివ్వాలి. ఉన్నది కదా అని సకల వెర్రి వేషాలు దేశంలోకి రానిస్తే రాను రాను దేశంలో ఇలాంటి వెర్రి చేష్టలు ముదిరిపోయి, సమాజం ఎలా తయారవుతుందో తలుచుకోవటానికే కష్టంగా ఉన్నది.

  I hope good sense prevails upon the Government Authorities, if any.

  ReplyDelete
  Replies
  1. చాన్నాళ్ళకు వచ్చారు శివరామ ప్రసాదు గారు మా బ్లాగు దర్శనానికి . మీ రాక మాకు సంతోషం. మీ స్పందనకు దన్యవాదములు.

   Delete