Saturday, November 23, 2013

హిందూ సమాజ సంస్కరణలకు పరాయి మతాలూ , కిరాయి మతాలు అవసరం లేదు.

                                                           



 నిరంతరం సాగీపొయే పవిత్ర నదిలో అయినా సరే కల్మషం కూడుతూనే ఉంటుంది. దానిని తీసివేసి ఎప్పుడూ స్వచ్చమైన నీరు ప్రవహించేలా చెయ్యడం ఆ నది మీద ఆదారపడి బ్రతికే బిడ్డల  విది. అంతే  కానీ చెత్త పేరుకు పోయిందని వారి  నదిని బాగుచేసుకోవడం మానీ , వేరే దేశం లోని నదిని గూర్చి ఆలోచిస్తే లేక పూజిస్తే ఒరిగేదేముంది.అలాగే మనం గంగా నది కలుషితమైందని "ఓల్గా " నది నీరు తాగాలనుకుంటామా ? ఒక వేళా అవే తాగి జీవించాలనుకుంటే "ఆ నది ఉన్న ప్రాంతానికి వెళ్ళి పోవడం ఒకటే మార్గం. తాగేది గంగ నీరు పొగిడేది "ఓల్గా" ని అంటే అమ్మ పాలు తాగుతూ , పిన్నమ్మను పొగిడినట్లుంది. గంగా నదిని ఎలా ప్రక్షాలనం చేయవచ్చో "ఓల్గా " నది తీరం వారు వచ్చి  చెప్పవలసిన పనిలేదు.               
                   
                 హిందూ మతంలో ఉన్నదంతా హింస యేనని, మనుషులలో మానవత్వాన్నీ చూడగలిగేది ఒక బౌద్దమతమేనని భ్రమపడి "బొద్ద మతం స్వీకరించిన వారు ఇప్పుడు బౌద్దులను చూసి నవరంద్రాలు మూసుకోవలసిన పరిస్తితి.   ఈ దేశం లోని హిందూ మతానికి ప్రత్యామ్నాయం గా "బౌద్దం" అనుకున్నారు, "అభినవ మనువు" అంబేద్కర్ గారు. అందుకే ఆయన ఆ మతం స్వీకరించారు . కానీ ఆయనే బ్రతికి ఉంటే తన అభిప్రాయం తప్పు అని చెప్పే వారే . ఏందుకంటే , ఛీమకు కూడా హాని తల పెట్టవద్దన్న బౌద్దమతం లో నుంచి తుపాకులతో కాల్చి చంపుకుంటున్న్న "టెర్రర్ మాంక్" లు తయారయ్యారు. కాబట్టి ఆచరణకు అనువు కానీ దానిని అవలంభించి తద్వారా హిందూ సమాజం లోని  తప్పులను  సంస్కరిద్దాం అనుకోవటం   "మూర్కిసిజం " అవుతుంది తప్పా ," రేషనలిజం " అవదు అని విజ్ణానులు ఎంత తొందరగ గ్రహిస్తే అంత మంచిది. హిందువులలో తప్పులుంటే వాటిని సంస్కరించుకునే శక్తి హిందువులకే ఉంది. దాని కోసం పరాయి మతాలు,కిరాయి మతాలను ఆశ్రయించే వారు అజ్ణానులు.హిందూ సమాజం సంస్కరణలును అంగీకరిస్తుంది ఆ  సంస్కరణల   కోసమే 14 మంది మనువులు పుడతారు అని హీందూ గ్రందాలు చెప్పాయి. ఏ మతానికైనా ఒకడే ప్రవక్త.అవి మార్పులేనివి.  కానీ హిందువులకు అట్టి దుర్దశ లేదు. ఏందుకంటే ఒక కాలం లో జరిగిన లేక అభివ్రుద్ది చెందిన తప్పుడు బావాలను ఇంకొకరి కాలంలో సరి చేయబడతాయి. అదే హిందూ రుషుల ముందు చూపుకు తార్ఖానం. అందుకే కాలాన్ని లెఖ్ఖించి 14 మంది మనువుల జన్మ ఘడియలు, ఆ యా కాలాలలో వచ్చే అవతార పురుషుల జన్మములు , వారి నామములు ఇత్యాదీ వివరం లు అన్నీ తెలిపారు. అవి నిజమ కాదా  అనేది కాదు ప్రదానం . మన రుషులు అందరికి వలెనె ఒక్కడే "మనువు" ఉంటాడు అని చెప్పవచ్చు కదా? ఇంత మంది మనువులు , ఇంతమంది అవతారాలు ఉంటాయని ఎందుకు చెప్పారు? అదే హిందూ ఋషుల వాస్తవిక ద్రుష్టి. 

  ప్రతి సమాజం లో కాలగమనం లో ఎన్నో మార్పులు కలుగుతాయి. అన్నీ మంచి అని చెప్పలేము. చెడు అని తీసివేయలేము. మంచిని స్వీకరిస్తూ , చెడును తొలగిస్తూ ముందుకు సాగాలి . ఒకా నొక దశలో సమాజానికి ఉపయోగ పడినది , మరొక దశలో ఉపయోగపడక పోవచ్చు. అందుకే ఉపయోగపడని దానిని తొలగించి , నూతన విదానాలు స్వీకరించాలి. అయితే ఇది మంచి, చెడు అని ఎవరు చెప్పాలి. మన ఇంటికి పనికి వచ్చేది ఏదో  మన పెద్దలే చెప్పాలి , తప్పా పక్కింటి వారు కాదు. అలా చెప్పగలిగిన వారే "మనువులు" అని మన ఋషుల నమ్మక్కం. వారు మాత్రమే అవసరం అయిన వేళ , మన ధర్మానికి హాని కలుగుతున్న వేళ , జన్మింఛి , హిందూ ధర్మానికి సంస్కరణలు చేసి , సమాజ గతిని నిర్దారిస్తారు. ఆ ఉద్దేశ్యంతోనే అంబేద్కర్ గారిని "అభినవ మనువు" అని గౌరవించారే తప్పా , వేరుగా చూడలేదు. కానీ ఇప్పట్టి కొంతమంది  "స్వయంప్రకటిత విజ్ఞానులు".  ఆయన  ప్రవచనాలను పదే పదే వల్లే వేస్తూ , ఆయనని ఒక మత  ప్రవక్తను చేసారు. అప్పుడు అయన ఎం చెప్పాడు అన్నది కాదు , ఇప్పుడుంటే ఏమి చేప్పే వాడూ అన్నదే ప్రదానం. అయన బౌద్ద దర్మం గురించి తీసుకున్న నిర్ణయమే పేయిల్ అయినపుడు , ఇంకా అయన అప్పుటి వ్యాఖ్యలను పదే పదే వల్లే వేస్తే అదో "మత  ప్రవచనాలు" అవుతాయి తప్పా, మార్పు కు సహకరించవు. కాబట్టి హిందూ సమాజ సంస్కరణలకు పరాయి మతాలూ , కిరాయి మతాలు వాటి ప్రవచనాలు   అవసరం లేదు.

  ఇదే విషయం మీద నేను ఇదివరకు ప్రచురించిన టపాను కూడా  చూడండి బుద్దుడు గయా!తీవ్రవాది ఆయా! http://kalkiavataar.blogspot.in/2013/07/blog-post_10.html

No comments:

Post a Comment