Wednesday, November 20, 2013

ఇన్నాళ్ళు మా దేవాలయం "గార్లఒడ్డులో" లో ఉందనుకుంటే , గూగుల్ మాప్ తో అది "ఏన్కూర్" లో ఉన్నట్లు తెలుస్తుంది!

                                                           


సాదారణంగా ఊళ్లు , ఊరి సరిహద్దులు రెవెన్యూ సర్వే మాప్ లలో ఉంటాయి . కొన్ని ఊళ్ళ పరిస్తితి ఎలా ఉంటుందంటే  ఒక వీది ఒక ఊరికి చెందినది అయితే , రెండవ వీది వేరొక ఊరి పరిదిలో ఉంటుంది. పెద్ద గ్రామాలు అయితే వాటి మీద వచ్చే రెవెన్యూ, పంచాయతీలకు ఆసరా కాబట్టి సరిహద్దులు విషయం లో సంబదిత గ్రామ పంచాయితీలు ఖచ్చితమైన సరిహద్దులు తో గ్రామ పరిపాలన వ్యవహారాలు సాగిస్తుంటయి.

   కానీ శ్రీ శైలం ప్రాజెక్టు లాంటి ప్రాంతం కూడా  ఇన్నాళ్ళు ఏ ప్రాంత పరిదిలో ఉందో రాష్త్ర సర్కార్కి కానీ , సంబదిత జిల్లా పరిపాలానా విబాగం వారికి గానీ తెలియక పోవడం విచిత్రం లో బహు విచిత్రం. ఇన్నాళ్ళు శ్రీ శైలం డాం కుడి గట్టు కర్నూల్ ప్రాంతమం లో ఉంటే , ఎడమగట్టు మహబూబ్ నగర్ ప్రాంతం లో ఉందని ఘన మైన సర్కారీ అధికారులు సెలవిస్తూ వచ్చారు. దానిని బేస్ చేసుకునే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య మంత్రి గారు, డిల్లీ పెద్దల ముందు ఒక డాం పరిది ఒక వైపు ఆంద్రాలో , మరొక వైపు తెలంగాణ లో ఉన్న పరిస్తితుల్లో , రాష్ట్ర విభజన జరిగితే ,ప్రాజెక్టు నిర్వహణ ఎలా సాద్యం అని బల్ల గుద్ది  వాదించారు. కానీ హత్టాతుగా కర్నూల్ అటవీ శాఖ వారు ఒక పురాతన మాప్ ఒకటి వెలుగులోకి తెచ్చి, దాని ప్రకారం ఎడమగట్టు కూడా  "కర్నూల్ జిల్లాలోనే ఉందని, కాబట్టి శ్రీ శైలం ప్రాజెక్టు మొత్తం సీమాంద్ర పరిదిలోనే ఉందనే సంచలనాత్మక విషయం ప్రకటించారు.సంబదిత మ్యాపును "ఈ నాడు" పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. ఆ మాప్ ను పరిశిలిస్తే ఎడమవైపు గట్టు ప్రాంతం లో కేవలం ప్రాజెక్టు , దాని సంబఅందిత కాలనీలు ఆపీసులు, జలవిద్యుత్ కేంద్రం ఉన్న ప్రాతం మాత్రమే నంది కొట్కోర్ రిజర్వ్ పారెస్ట్ ఏరియాలో ఉన్నట్లు చూపబడుతుంది. ఇది కొంచం అనుమానాలకు తావిచ్చే పటం లాగుంది. అయినా దీని మీద ఇంకా సమగ్ర పరిశీలన చెయ్యాలి అంటున్నారు కా బట్టి ఆ విషయం మీద తెలంగాణా వారు అప్పుడే స్పందించరేమో !ఇలా ఇంకా ఎన్ని ప్రాంతాలు తెలంగాణావి అనబడేవి , సీమాంద్రాలో చేరి పోనున్నాయో!
   ఈ  విషయం నిన్న పేపర్లలో చదివాకా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఇన్నాళ్ళు ఒక ముఖ్యమైన జలవిద్యుత్ ఉన్న ప్రాంతం ఏ జిల్లా పరిదిలో ఉందో తెలియ కుండానే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా అని. కానీ నిన్న మా ఊరి గూగుల్ మ్యాప్ చూసిన నాకు దిమ్మ తిరిగి పోయింది. గూగుల్ మాప్ ల లో చూపబడే గ్రామాల సరి హద్దులు సంబదిత రెవెన్యూ సర్వే మాపల ఆదారంగా తయారు చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ మా గ్రామం అయిన గార్లఒడ్డు , మా మండల కేంద్ర మైన ఏనుకూరు కి శివారు గ్రామమ్. అంటే  ఏనుకూరు కి మాకు ఒకటే గ్రామ పంచయతి.ఇన్నాళ్ళు  మా దేవాలయం అయిన శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయం గార్లవొడ్డు గ్రామం లోనే ఉందని అనుకుంటున్నాం. ఎండోమెంట్ రికార్డులలో సైతం అలాగే ఉండి సుమారు 30 సంవత్సరాలు నుంది అలాగే వ్యవరించబడుతుంది. మేము గ్రామ పంచాయతీ పర్మిషన్ సైతం గార్లఒడ్డు దేవాలయం నిర్మాణం కోసమే 1963 లో తీసుకుని గుడి నిర్మించడం జరిగింది.కానీ నిన్న గూగుల్ మాప్ చూస్తె మా దేవాలయం గార్లఒడ్డు పరిదిలో లేదు. దానిని ఎడిట్ చేదామన్నా గూగుల్ మాప్ మేకర్ ఒప్పుకోవడం లేదు. బహూశా గ్రామ సరిహద్దులు ప్రైవేట్ వ్యక్తులు కానీ, సంస్తలు కానీ సరి చేయజాలవు అనుకుంటా .
                             అయితే మా గ్రామం కూడా  ఏనుకూరు  గ్రామ పంచాయతీలోదే కాబట్టి పరి పాలన ఇబ్బందులు ఏమి లేవు. కానీ రేపు రాష్ట్ర విబజన మాదిరి గ్రామ విభజన జరిగితే , వైరా నియోజక వర్గం లోనే ప్రముఖ పుణ్య క్షేత్ర మైన మా దేవాలయం ఎవరి పరిదిలో ఉండాలి అనే ప్రశ్న ఉదయించవచ్చు కదా! అప్పుడు భద్రాచలం మాదిరి మా దేవాలయం ఉన్న ప్రాంతం సమస్యాత్మకం గా మారవచ్చు కదా! మరి ఇలా ముక్యమైన స్తలములు ఏ గ్రామ ప్రాంత పరిదిలో ఉన్నాయో సరి అయిన పరిశిలన చెయ్యకుండా గూగుల్ మాప్ లు ఆవిష్కరిస్తే ఎలా? కాబట్టి మా దేవాలయం ఏ గ్రామ పరిదిలో ఉందో ఆ దేవాలయ వ్యవస్తాపక దర్మకర్త నైన నాకు తెలియదు. శ్రీ శైలం ఎడమ గట్టు ఏ జిల్లా పరిదిలో ఉందో సంబదిత జిల్లా యంత్రాంగానికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి గానీ తెలియదు. ఆర్టికిల్ 371-D  సవరించకుండా రాష్ట్ర విభజన చేయవచ్చో లేదో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియదు. ఇన్నీ తెలియక పోవటం వెనుక ఉన్న కారణాలు ఏమిటంటే మన ప్రభుత్వాల పాలానా విదానాలు . పాలన అంతా అమ్మగారి దయలు, అయ్యగారి హుకుంలుగా నడుస్తున్నంత కాలం ఐ అమాయకత్వం కొనసాగుతోనే ఉంటుంది.

   మా ఊరి దేవాలయ వివరాల కోసం ఈ  క్రింది లింక్ ను క్లిక్ చేసి చోడండి.http://ssmasramam.blogspot.in/2013/11/the-history-and-miracles-of-of-sri.html

     

No comments:

Post a Comment