Thursday, November 14, 2013

చచ్చాడు అనుకున్న మొగుడు కాసేపు బ్రతికి , బార్యని ఆమె ప్రియున్ని కటకటాల లోకి నెట్టి చనిపోయాడు

                                                     

 కొన్ని కొన్ని సంఘటనలు "దేవుడు అనే వాడు  ఉన్నాడు అనిపిస్తుంటాయి".పాపులను శిక్షించటానికి దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు అని తెలియ   పరచటానికి ప్రత్యేకించి కదలు చెప్పనవసరం లేదు. నిత్య జీవితంలో జరిగేవి కూడా  అందుకు సాక్ష్యంగా ఉంటాయి. అలంటి ఒక సంఘటణ మొన్న 8 వ తరీకున బెంగుళూర్ లో జరిగింది.

  అయన పేరు దయానంద స్వామి . చాలా ఏండ్ల క్రిందట బెంగలోర్ వచ్చి అక్కడక్కడ హోటల్లో పని చేస్తూ , అలా కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఒక బేకరీ పెట్టుకున్నాదు. ఆయనకి బార్య రత్నమ్మ , ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యకి ఆయనకి 20 ఏండ్ల అంతరం ఉంది. అందుకే ఆమెకి అతనితో అసంతృప్తి ఉండేది కాబోలు. అయన గారేమో తన బేకరీ చూడటానికి తన మేనల్లుని తెచ్చి పెట్టాడు. రత్నమ్మ కన్ను తనకంటే చిన్నొడైన ఆ కుర్రాడి మీద పడింది. మెల్లగా వాడిని ముగ్గులోకి దించింది. ఇది కనిపెట్టిన దయానంద స్వామీ ఆమెను, ఆ కుర్రాడ్ని మందలించి ,బేకరీ నుండి వెళ్ళ గొట్టి , బార్యను ఇక నుండి జాగర్తగా ఉండమన్నాడు అంట.

    రుచి మరిగిన కుక్క అలవాటు మానుకోవటం కష్టం కాబట్టి, వారు వారి సంబందానికి పుల్స్టాప్ పెట్టుకోవటం ఇష్టం లేక , దయనందా స్వామీ జీవితానికే పుల్స్టాప్ పెడదామని డిసైడ్ అయి పోయారు.అతని మేనల్లుడు వేరే బేకరిలో పని చేస్తున్నప్పటికీ , రత్నమ్మ తో అక్రమ సంబందం చాటు మాటుగా కోన సాగిస్తున్నాడు. ఒక రోజు ఆతను తిరిగి వారిద్దరిని రెఢాండెడ్ గా పట్టుకుని , పెద్ద గొడవ చేస్తే , ఆ రోజు అతను నిద్రలో ఉండగా బార్య , మేనల్లుడు కలిసి అతని గొంతు పిసికి చంపారు. అతను చని పోయాడు అని నిర్దారించుకున్నాక , అతని బందువులకు , చుట్టు ప్రక్కల వారికీ ఆతను నిద్రలో గుండె పోటు చని పోయాడు అని కదలల్లారు. అతని దహన సంస్కారాలకు ఏర్పాట్లు మొదలు పెట్టారు.

   ఇంతలో ఆ వచ్చిన బందువులలో ఒకరికి దయానంద స్వామీ లో ఎక్కడో చిన్న కదలిక కనపడి , అనుమానంగా  పరిక్షించి చూస్తె ఎక్కడో ఊపిరి ఉన్నట్లు కనిపెట్టి హాస్పిటల్లో చేర్చారు. అక్కడ హాస్పిటలో డాక్టర్లు సపర్యలతో కొంత సేపు బ్రతికిన దయానంద స్వామి తన బార్యా మేనల్ళుల బాగోతం గురించి "మరణ వాంగ్మూలం " ఇచ్చి మరీ చని పోయాడు. ఆ దెబ్బతో పోలిసులు అక్రమ ప్రియుడు , ప్రియురాలిని కటకటాల లోకి నెట్టి , విచారణ చేస్తున్నారు. అదీ కద!

 అందుకే అంటారు "తలచినదే జరగినదా , దైవం ఎందులకు? అని

No comments:

Post a Comment