Friday, November 1, 2013

తెలంగాణా ఇవ్వం! అని కేంద్రం హామీ ఇస్తేనే సీమాంద్ర ఉద్యోగులు "సమ్మె " విరమించి కాం గా ఉన్నారా?

                                                                


 ఈ  మద్య ముఖ్య మంత్రి గారి మాటల్లో, సీమాంద్రా నాయకుల మాటల్లో కొంత దైర్యం కనపడుతుంది. ఎట్టి పరిస్తుతుల్ల్కో రాష్ట్ర ఏర్పాటు ఎన్నికల లోపు జరగదు అంటున్నారు. ముఖ్యమంత్రి గారి కి కేంద్రం నుండి దీనికి సంబందించిన అనుకూల సంకేతాలు వచ్చినట్లు కనపడుతుంది. అందుకే అయన సీమాంద్రా ఉద్యోగుల సమ్మెను విరమింప చేసారా? అనే సందేహమూ కలుగుతుంది. అయన గారు రాష్ట్రపతి గారికి లేఖ రాయడం , ఆ లేఖ మీద రాష్ట్ర పాటి గారు హోం శాఖకు తగు సూచనలు ఇవ్వడం, ఆ తర్వాత మరొక్క సారీ తెలంగాణా పై అఖిల పక్ష పార్టీ మీటింగ్ కు అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించడం చక చక జరిగిపోతున్నాయి.

    ఇక పోతే ఇంకొక ప్రక్క కేంద్ర  హోం శాఖ వారు గ్రూప్ అప్ మినిస్టర్స్ కి పంపిన 85 పేజీల రహస్య బాక్ గ్రౌండ్ నోట్ కావాలనే మీడియాకు లీక్ చేసినట్లు తెలుస్తుంది. అందులో హైదరాబాద్ విషయం, నీటి వనరుల విషయంతో పాటు ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. అది ఏమిటంటే ఆర్టికిల్ 371-D సవరణ అనివార్యం కావచ్చు అనే సంకేతాలు ఇవ్వడం. దీని అర్దం అది సవరించాలంటే కావలసిన 2/3 మెజార్టీ , కాంగ్రెస్ వారికి ప్రస్తుత పార్లమెంటులో లేదు కాబట్టి, వచ్చే ఎన్నికలలో కష్టపడి ఆ మెజార్టీ సాదించాకా తెలంగాణ ఇస్తాం అని చెప్పకనే చెపుతున్నారు అన్న మాట. అందుకే కాబోలు ఎన్నికల లోపు తెలంగాణా రాదు అని సీమాంద్రా ఉద్యోగులు, నాయకులు డంకా బజాయించి చెప్పడం.

   ముఖ్యమంత్రి గారు కూడా  మొన్న్ననే "దుమ్ముగూడెం టేయిల్ పాండ్" కి అనుమతులు ఇచ్చేసినట్లు చెప్పడం వెనుకాల ఉన్న మతలబ్ అదే. ఒక ప్రక్క తెలంగాణ ఇస్తాం అని చెపుతూనే, హైదరాబాద్ లో వాటా , గోదావరి నదీ జలాల్లో  వాటా సీమాంద్రులకు ఇస్తే, ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం ఏమిటి? "ఒరే బాబూ ,'తెలంగాణ ఆవు'నీకే , కానీ దానిలో సగం పాడి నీ  సీమాంద్రా అన్నకు ఇవ్వు " అన్నట్లుంటుంది. దాని వలన తెలంగాణా ప్రజలు నిరాశకు గురి అయి ,అసలు రాష్ట్ర ఏర్పాటు మీదే ఆసక్తి చూపక పోవచ్చు. అధికార పార్టికి కావాల్సింది అదే . అందుకే అటు చేసి, ఇటు చేసి తెలంగాణా వారికి టోపి పెట్టె దిశగా కేంద్రం అడుగులు మార్చుకుందని బావించవచ్చు! చూదాం ఎం చేస్తుందో?

No comments:

Post a Comment