Friday, September 20, 2013

హైద్రాబాద్ को U.T. కరో! తెలంగాణా को లూటీ కరో


                                                        

  కేంద్ర సర్కార్ మనసులో ఏముందో ఇంకా తెలంగాణా బిడ్డలకు అర్దం కావటం లేదా? తెలంగాణా ఏకైక(ఆంద్రోళ్లకి కూడా) ఐ.టి. హబ్ దునియా హైద్రాబాద్ మీద ఐ.టి. కంపెనీల కన్ను పడింది.రెండు సంవత్సారాల క్రితం  యాబై వేల ఎకరాలలో ఐ.టి  పెట్టుబడుల జోన్  కోసం, కేంద్ర అనుమతి కోసం రాష్ట్ర సర్కార్ అబ్యర్దిస్తే దానిని ఈ రోజు కేంద్ర కాబినెట్ అనుమతి ఇచ్చిందంట! దీని వలన డేబ్బై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయట! ముప్పై ఏండ్లలో దీనిని పూర్తి చెయ్యాలని ప్లాన్ అట!ఇది తప్పకుండా తెలంగాణ వారికి సంతోషం కలిగించే విషయం లా పైకి కనిపిస్తున్న కేంద్ర సర్కర్  అసలు మతలబ్ బయటపడుతుంది.

  ఇప్పుడు, అంటే  సీమాంద్రా వారు హైద్రాబాద్ గురించి లొల్లి చేస్తున్న ఈ సంక్లిష్ట సమయం లో ఎందుకు అనుమతి ఇచ్చి, సీమాంద్రా వారిని రెచ్చగొట్టెలా చేసారు. అంటే హైద్రాబాద్ ని అందరికి చేందేలా   చేయ్యాలంటే సీమాంద్రా వారి ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తే, దానిని బూచిగా చూపి హైద్రాబాద్ ని  చేస్తారన్న మాట. అందుకేనా మాట మాటాడితే తెలంగాణా నోట్ రెడీ అయింది,తెలంగాణా నోట్ చేతికి వచ్చింది అని సీమాంద్రా వారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తూ వారి ఉద్యమ తీవ్రత తగ్గకుండా చేస్తున్నారు?

  మొన్న ఒక నాయకుడు చెప్పిన లెఖ్ఖల ప్రకారం, ఇప్పుడు సైబరాబాద్ ప్రాంతం లోని ఐ.టి. కంపెనీలలో ఉద్యోగాలలో డెబ్బై శాతం మంది రాష్ట్రేతరులే పని చేస్తున్నారట. ఎందుకంటే ఉద్యోగ రిజర్వేషన్లు అనేవి ప్రభుత్వ ఉద్యోగాలకే తప్పా, ప్రైవేట్ ఉద్యోగాలకు వర్తించవు మరి. మరి అటువంటపుడు "చూసి ముర్వ, చెప్పుకుని ఏడ్వ" అని ఈ ఐ.టి ఇండస్ట్రీ వల్ల తెలంగాణా బిడ్డలకు ఒరిగేది ఎంత? కనీసం ప్రైవేట్ ఉద్యోగాలలో లోకల్ రిజర్వేషన్ ఉంటుందా? అలా పెడితే ప్రైవేట్ కంపెనీలు ముందుకు వస్తాయా? అలా అవకాశం లేక పోతే కె.సి.ఆర్ గారు ఆంద్రోలకి చెప్పిన "టిపిన్ సెంటర్" లు పెట్టుకుంటానికి తప్పా తెలంగాణ బిడ్డలకి ఎం ఫాయిదా? ఇదే తరహాలో మరి కర్ణాటక వారి ఐ.టి జోన్ కి కూడా  అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది  మరి బెంగళూర్  ని కూడా u.T  చేస్తారా ? చేస్తే కన్నడిగులు ఊరుకుంటారా ? ఇక్కడ మెగా ఐ.టి జోన్ కి అవకాశం  ఉండబట్టి కన్ను కుట్టిన రాష్ట్రేతరులు కేంద్ర ప్రబుత్వం చేతిలోకి హైదరాబాద్ ని తెచ్చే కుట్రలో పలితమే నేడు తెలుగు బిడ్డల మద్య గొడవలు . అని అనుకోవాల్సి వస్తుంది

  ఒక వేళా తెలంగాణ వారు  U.T  వద్దంటే హైద్రాబాద్ లో ఉన్న సెటిలర్సే కాదు తెలంగాణా వారు కూడా ఒప్పుకోరు. వారుండే నగరం డెవలప్ అవుతుంటె కాదంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? అందుకే టి.ఆర్.యస్ పప్పులు హైద్రాబాద్ లో చచ్చినా ఉడకవు. మరి హైద్రాబాద్ U.T.  అయితే తెలంగాణా కి మరో రాజదాని చూసుకోవలసిందేనా? మరి ఆమ్ దాని ఉన్న రాజదాని వదులుకుంటే తెలంగాణా పరిస్తితి ఏంది? ఒక లెఖ్ఖ ప్రకారాం U.T.   దగ్గర్లో ఉన్న ఏ పట్టణాలు అభిరుద్ది చెందవట. అంటే మర్రి మాను క్రింద మొక్క లెఖ్ఖ అన్న మాట. మరి ఇంత ఉద్యమం చేసింది హైద్రాబాద్ ని వదులుకుంటానికా? మొత్తానికి కేంద్ర సర్కర్ అటు చేసి, ఇటు చేసి తెలంగానా వారికి తల లేని మొండెం ని అప్ప చెప్పి, ఇక ఏలుకోండి బిడ్డా అనబోతుందన్న మాట! అందుకే నేను మొదగాల్నే చెప్పినా, ఇది కేంద్ర సర్కార్ కుట్ర అని! తెలుగోడికి, తెలుగోడికి తంపు పెట్టి హైద్రాబాద్ ని తన ఖాతాలో జమ చేసుకుంటుంది. అలా అయితే తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు మీద పునరాలోచీంచాల్సీంది కేంద్రం కాదు, తెలంగాణా బిడ్డలే!        
 

No comments:

Post a Comment