Tuesday, September 3, 2013

మద్యలో ఉన్న తాడుని ఊపడం తప్పా, వీరు చేస్తున్న ఉద్యమoఏమిటి ?

                                                                
                                                              
  వెనుకటి తెలుగు సినిమాలో చూసేవారం, హీరోలు విలన్లతో వారి గాంగ్ లతో చేసే ఫైట్లు. ఎంతో కామెడిగా అనిపించేవి ఆలొచించే వారికి. వంద మందిని నొంటి చేత్తో విసిరేసిన హీరో గారు వేసుకున్న డ్రెస్ నలిగేది కాదు, క్రాప్ చెదిరేది కాదు.బహూశా తమ అభిమాన హీరోని అలా చూసి తట్టుకునే శక్తి అభిమానులకు కానీ, అలా చూపించే దైర్యం ఆ నాటి కొంతమంది  దర్శకులకు ఉండేది కాదేమో!లేక పోతే హీరోల ఇమేజ్ తగ్గుతుందని బయమో కాని అలా సూపర్మేన్ ఫైట్ సీన్లు పెట్టేవారు. ఆ తర్వాత ట్రెండ్ మారి ఇప్పుడు బురదల్లో కూడా పొర్లి పొర్లి కొట్టుకుంటునారు అనుకోండి!

  మల్లీ ఇన్నాళ్ళకి అలనాటి తెలుగు సినిమా ఫైట్లను చూసే భాగ్యం సచివాలయ ఉద్యోగుల ఘర్షణల్లో  కనిపిస్తుంది. టి.వి.ఆన్ చేస్తే చాలు! "బ్రేకింగ్ న్యూస్"   "సచివాలయంలో  సిమాంద్రా, తెలంగాణా ఉద్యోగుల మద్య ఘర్షణ"! జల సౌదలో వుద్యోగుల మద్య ఉద్రిక్తత! తోపులాటా"! అనే హెడ్డింగులతో ఊదరగొడుతుంటాయి. తీరా చూస్తే అటొక గ్రూపు, ఇటొక గ్రూపు. పోలిస్ లను చూశాక ఒకరి మీదకు ఒకరు వెళుతున్నట్లు వీరావేశంతో కూడిన అరుపులు, నినాదాలు. వీరిని కట్టడి చేయడానికి అన్నట్లు పోలిస్ వారు వారి మద్య ఒక పెద్ద తాడు పట్టుకుని నిలబడ్డాకా, ఇక ఎట్టి పరిస్తితిలో తమ బట్టలు నలగడం కాని, క్రాప్లు చెదరడం కాని జరగవు అని డిసైడ్ అయ్యకా, గొంతున్న వారిని ముందు పెట్టి, తక్కిన వారు వెనుక చేరి ఒక గంటా,గంటన్నర ఎదుటివారి బట్టలు  టచ్ కాకూండా జాగర్తపడుతూ,  మద్యనున్న తాడును ఊపేస్తూ,నానా హంగామా చేస్తుంటే పాపం వీరెంత పోరాటం చేస్తారో ఫ్రీగా ఫైటింగ్ చూదాం అని టి.వి.ల ముందు కూర్చున్న ప్రేక్షకులకు, నోటి ఆరుపులు, మద్యలో ఉన్న తాడు ఊగడం తప్పా, ఏమి కనిపించక నిరాశ పడుతున్నారట!

 ఇంతకీ కొస మెరుపు ఏమిటంటే ఇలా రోజూ పోలిస్ వారి తాడు మాత్రమే ఊగడాన్ని చూసి బరించలేని వారు హైద్రాబాద్ కమీషనర్ గారికి పిర్యాదు చేస్తే, ఆయన గారు ఇరు వర్గాలను పిలిచి,"చూడండి వీరులారా! మీ ఊపుడికి మా తాడు తెగేటట్లుంది, కాబట్టి మీరు రేపట్నుంచి ఒకే చోట ఉద్రెకపడకండి. నల్ల పోచమ్మ గుడివద్ద ఒకరు, మరొక చోట మరొక వర్గంవారు పోరాటం చెయ్యండి, కాని ఒక కండీషన్ ఏమిటంటే ఎవరి తాడులు వారే తెచ్చుకుని ఊపుకోవాలి తప్పా, మా పోలిస్ వారి తాడు ఎట్టి పరిస్తితిలో ఉపయోగించడానికి వీల్లేదు" అనేసరికి అలాగే సార్ అని కాం గ బయటకు వచ్చారట! అమ్మయ్యా!రేపటనుండి వారి బట్టలు, జుట్టులే కావు, పోలిస్ వారి తాడు కూడా నలగకుండా ఉద్రేకంగా ఉద్యమాలు చేస్తారన్న మాట! పని ఎగ్గొడతానికి చేసే పనులు ఇలాగే ఉంటాయి కామోసు! 


No comments:

Post a Comment