Monday, September 23, 2013

ఎవరు? గాందీ గారికి, జగన్ గారికి పోలికే లేదన్నది? ఇవిగో పోలికలు!

                                                                 


 ఆ మద్య గుంటూరులో అనుకుంటా,ఒక అభిమాని  గాందీ గారిని, జగన్ గారిని పోలుస్తూ, ఒక ప్లెక్సీ పెడితే అప్పొజిషన్ వారు నానా యాగీ చేసారు. మరి అలా యాగీ చేసిన వారు నేడు జగన్ రాకకై ఎదురుచూస్తున్న ఆ ప్రజల కళ్ళలోని పట్టలేని ఆత్రుతతో కూడిన ఆనందాన్ని చూసి ఏమంటారు? ఎమన్నా అనే దమ్మూ ,దైర్యం భారత ప్రజాస్వామ్యం లో ఎవరికుంది?

 అయినా జగన్ గారికి గాందీ గారికి అసలు పోలికే లేదనటం ఏమిటి? ఆ నాడు స్వాతంత్ర్య పోరాటం లో బాగంగా గాందీ గారు జెయిల్ కి వెళ్ళి బయటకు వస్తున్నప్పటి ద్రుశ్యానికి, ఈ రోజు జగన్ గారు జెయిల్ నుండి బయటకు వస్తున్న ద్రుశ్యానికి ఎంతో పోలిక ఉంది.

  అప్పటి ప్రజల కళ్ళలో తమ అభిమాన నాయకుడు ఎప్పుడు బయటకు వస్తాడా అన్న ఆత్రం.

  ఇప్పటి ప్రజల కళ్ళలోను తమ ప్రియతమ నాయకుడు కోసం సేం ఎక్స్ప్రెషన్!

  అప్పటి జన నాయకునికి జే జే ద్వానాలతో స్వాగత సన్నాహాలు.

  ఇప్పటి జగన్నాయకునికి అంతకు మించిన రీతీలో అపూర్వ స్వాగత సన్నాహాలు.

  భారత దేశానికి గాందీ గారే దిక్శూచి అని నమ్మిన జనం అప్పుడు.

  దిక్కులేని తెలుగువారికి దిక్కు నువ్వే అన్నా అని అంటున్న జనం ఇప్పుడు.

    ఇరువురూ ప్రజా నాయకులే! ప్రజలకు ప్రియ నేతలే! అభిమాన నాయకులే! మరి ఇంత పోలిక పెట్టుకుని, పోలికలు ఉన్నాయని ఎవరైనా అంటే వారి మీద విరుచుకు పడడం సమంజసమా? చెప్పండి?

  అయితే ఇక్కడ క్రూసియల్ పాయింట్ ఏమిటంటే ,పోలిక లేనిది ప్రజా నాయకుల్లో కాదు, ప్రజల్లోనే! వారి ఆలోచనా విదానాలలోనే!

 ఆ నాడు తమ కోసం నీతి నిజాయితీలతో పనిచేసిన వాడు తమ నాయకుడు అన్నారు. మరి ఇప్పుడో! నీతి నిజాయితీలు అనేవి హంబగ్ ,మాకు లబ్ది చేకూర్చే వాడే మా  నాయకుడు అంటున్నారు.కాబట్టి పోలిక లేనిది ప్రజల మనస్తత్వంలో తప్పా, ప్రజా నాయకులలో కాదు.అందుకే ఆయన ఏమి చేసినా ప్రజల కోసమే.అందుకే పద్నాలుగు నెల్లలు అష్ట కష్టాల కోర్చి, జైల్ జీవితం గడిపి బయటకు వస్తున్న ఆ జగన్నాయకుడికి  జనం జే జే ద్వానాల తో స్వాగతం చెపుతుంది . ! యదా ప్రజా! తదా నాయకా!
                  ఒక వేళ ఎవరికైనా ఈ సమాజం ఇలా అయిందేమిటీ? అనే బాద ఉంటే ఇంట్లో తలుపులు అన్నీ మూసుకుని ఈ పాటని పాడుకుని మీ అవేశాన్ని చల్లార్చుకోండి. జాగర్త! బయటకు పాడేరు, జనం వింటే గొడవలు అవుతాయి!

  నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి?
గొర్రెదాటు మందకి విజ్ఞాన బోధ దేనికి?
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం?
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం?
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాతరాతి గుహలు పాలరాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

4 comments: