Wednesday, September 25, 2013

జగన్ గారి కి బెయిల్ ఇవ్వడం రైట్! కానీ ట్రైల్ స్టార్ట్ చెయ్యక పోవడం రాంగ్!


                                                             

 అందరి కేసులు మాదిరే జగన్ గారి తీవ్ర అర్దిక నేరారోపణలు కలిగిన కేసులను చూడడం ప్రజా నమ్మకాన్ని వమ్ము చెయ్యడమే. జగన్ మామూలు వ్యక్తి కాదు .లక్షలాది మంది గుండెల్లో కొలువైన నాయకుడు. మరి అటువంటి నాయకుడిని పదహారు నెలలు జైల్లో విచారణ పేరుతో ఉంచటమే కాక, కేవళం బెయిల్ ఇచ్చి వదులుతారా! ఆయన మీద పెట్టిన కేసులు అన్నీ తప్పుడు కేసులు అని ఆయనని నమ్ముతున్న లక్షలాది మంది అనుకుంటుంటే , ఆ సంగతేంటో నిగ్గు తేల్చకుండా, కేవలం బ్లాక్ మెయిల్ చేయ్యడానికే బెయిల్ ఇప్పించి బయటకు పంపుతుందా ఈ అధికార కాంగ్రెస్. జగన్ కడిగిన ముత్యం లా బయటకు రావాలని  జనం కోరుకుంటుంటే ఏది తేల్చకుండా వదిలేస్తారా?

   ఒక జన నాయకున్ని  ఆర్దిక దోపిడి దారు అని ముద్ర వేసి దానిని ఏటూ తేల్చ కుండా ఉంటే ఆయన్ని ఎలా  తాము ఎన్నుకునేది?  ఆయన మీద పెట్టిన కేసులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వాలకు లేదా? అవునులే శిక్ష పడిన వారినే చట్టసభలలో కూర్చో పెట్టే ఒదార్యం రాజకీయ పార్టిలకు ఉన్నా, దొంగా అని ముద్ర పడిన వారిని నిగ్గు తేల్చకుండా ఎన్నుకునే సత్తా ప్రజలకు ఉండొద్దూ. ఇది భారత పౌరుల ప్రాదమిక హక్కులకు భంగం కాదా? తాము ఎన్నుకోబోయే నాయకుడు దొంగో దొరో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?

 అందుకే  J.P. గారన్నట్లు, నేను ఇంతకుముందు టపాలలో చెప్పినట్లు, తక్షణం  ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి జగన్ గారి మీద పెట్టిన కేసులు విచారణ చేయిస్తే  స్వచ్చమైన కడిగిన ముత్యం లా జన నాయకుడు బయటపడతడని లక్షలది మంది నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయరాదు.

2 comments:

  1. తక్షణం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి జగన్ గారి మీద పెట్టిన కేసులు విచారణ చేయిస్తే స్వచ్చమైన కడిగిన ముత్యం లా జన నాయకుడు బయటపడతడని లక్షలది మంది నమ్మకం. NIJAMGAA?

    ReplyDelete
    Replies
    1. మన దేశం లో ఆరాధన బావం ఎక్కువ. తమ ఆరాద్య నాయకుడు ఏ తప్పు చేయడని వారి నమ్మకం. జగన్ గారు తప్పు చేసారా లేదా అనేది ఎమైనప్పటికి ఆయన కడిగిన ముత్యం లా బయటపడతారని ఆయన్ని అభిమానించే వారి నమ్మకం .

      Delete