Thursday, August 8, 2013

తలా తోకా లేని వీరబోగ వసంత రాయలుకు పోటిగా అవి మాత్రమే ఉన్న "వీర బ్లాగుడు" రయిటర్ ప్రత్యక్షం.



                                                       



  నేను బ్లాగు ప్రారంభ డశలో " డిసెంబర్ 21,2012 యుగాంతం" అనే దానికి కొన్ని ఆంశాలు తీసుకుని ఈ బ్లాగులో టపాలుగా ప్రచురించాను. ప్రపంచ వ్యాప్తంగా యుగాంతం మీద ప్రజకు ఉన్నట్లే మన వారికి ఉన్న ఆసక్తి తో కావచ్చు, లేక కొంత హ్యుమరస్ టచ్ ఉండటం చేత, నా పోశ్టులను ఆసక్తిగా వీక్షీంచారు. వారికి నా దన్య వాదాలు. నేను వీరబోగ వసంత రాయలు గురించి కాని, కల్కి అవతారం గురించి కాని ఏ గ్రందాలు సీరియస్ గా చదివి చెప్పలేదు. కేవళం గూగుల్ సెర్చ్ ఆదారంగా ఏ రోజు టపా కోసం ఆ రోజే పరిశిలించి రాసిన టపాలు అవి.నిజంగా కల్కి అవతారం కాని , వీరబోగ వసంతరాయలు అవతారం కాని హిందూ మత విశ్వాసాలు నుండి పుట్టినవి. కాని హిందూ మతం కి వ్యతిరేకంగా ప్రవచనాలు చేస్తూ, తమ మతమే గొప్పదని ప్రచారాలు చేస్తున్న వారు సైతం ఎంతవరకూ వెళ్ళారంటే హిందూ మత గ్రందాలలో చెప్పిన ఆ అవతార పురుషులు కూడా తమ వారేనని, వారి గురించే హిందూ మత గ్రందాలు ఘోషించాయి అని ఆకుకు అందని పోకకు పొందని ఉపమానాలతో బాష్యాలు చెపుతూ అనేక వెబ్ సైట్లలో తమ స్వీయ  పరిశోదనలు వెళ్ళక్రక్కారు. అవ్వన్నీ చదవి నాకు నవ్వు వచ్చింది. ఒక పక్కేమో హిందూ  అవతర సిద్దాంతం హంబగ్ అంటారు. ఇంకొక ప్రక్క హిందూ గ్రందాలలో చెప్పింది అన్య మత ప్రవక్తలు గురించే అంటారు. ఈ విదంగా సాద్యమైనంత వరకు తమ మతాలను స్వికరించిన హిందువులను సంత్రుప్తిపరచడానికి, లేక మరింత మంది హిందువులను మత మార్పిడి చెయ్యడానికి విశ్లేషణలు, పరిశోదనలు పేరుతో  ఈ వంకర సంకర రాతలు మొదలు పెట్టి ఉంటారని నా నిచ్చితాభి ప్రాయం.


  ఈ మద్య ఒక బ్లాగ్ మిత్రుడు కల్కి అవతారం గురించి వాస్తవాలు చెపుతానంటూ ఒక సీరియల్ టపా రచన మొదలు పెత్టాడు. అందులో నా టపాలు గురించి ఎవరో అడగగా, నావి తలా తోక లేని టపాలు అని తనవి ఆ రెండూ మాత్రమే ఉన్న వాస్తవ విషయాలు అన్నాడు. సరే ఆయన గారిది ఆయనకి గొప్ప కావచ్చు. కాని నాది తలా తోక లెనిది అనడం ఎందుకు? నేను రాసింది సీరియస్ మేటర్ ఏమి కాదు. వాస్తవం అంటూ ఎవరికి చెప్పలేదు.ఇప్పుడు వాస్తవాలు చెప్పే వారు వచ్చారు కాబట్టి ఇక వీక్షకులు హాపీసూ.కాకపోతే చిన్న డౌట్ ఏమిటంటే ఆయన గారి బ్లాగులో బికినీ బామలు అడ్వర్టైస్మెంట్లు సైతం దర్శనం ఇస్తున్నాయి. కాబట్టి నా టపాలు కంటే ఆయనవి కొంచం రంజుగా కూడా ఉండొచ్చు. సీ అండ్ ఎన్జాయి.     

No comments:

Post a Comment