Wednesday, August 7, 2013

"బాంచన్ నీ కాల్మొక్తా" అంటేనే రాష్ట్ర విభజన ప్రకటించారట !

                                                                     
                                                          

   "బాంచన్ నీ కాల్మొక్తా" అనే బానిస బావజాలం తెలంగాణా లో నిజామ్ ప్రభువులు కాలంలో ఉండేది. అప్పటి తెలంగాణా భూస్వామ్య వ్యవస్తలో సామాన్య ప్రజలు ఎవరైనా సరే, దొరల ముందు మాట్లాడేటప్పుడు ప్రతి మాటకు బాంచన్ నీ కాల్మొక్త అని మాత్రమే తమ గోడుని చెప్పుకునే వారట! అలాంటి పద్దతి ఇప్పటికి తెలంగాణాలో కొన్ని ఏరియాలలో ముసలి వారు పాటిస్తూ ఉండవచ్చు. అంటే తమ ఊరి దొరల క్రింద తాము ఎప్పటికీ బానిసలమేనని, దొరని కాదని తాము ఏమి చెయ్యలేమని, తాము దొరల మోచేతి నీరు త్రాగుతూ బ్రతుకుతున్నామని సవినయంగా మనవి చేసే అలవాటైన ఊత పదం "బాంచన్ నీ కాల్మొక్త".

  అయితే దొరల రూపం మారింది. అలాగే బానిసత్వ రూపం మారింది. కాని బానిస మనస్తత్వం పోలేదు. తెలంగాణాలో కమ్మూనిస్టుల పుణ్యమా అని బాంచన్ నీ కాల్మొక్త అనే వారు విప్లవ వీరులు అయ్యారు. ఎవరినైతే దొరా అని సాగిల పడ్డారో వారినే నరికి వేశారు. అక్కడ ప్రజలు తెలంగాణా ఏర్పాటు కోసం కూడా ఎవరినీ "బాంచన్ నీ కాల్మొక్త" అని ప్రాదేయపడ్డ దాఖాలాలు లేవు. కాని ఆ సంస్క్రుతిని సీమాంద్ర మంత్రులు పాటించినట్లు తెలుస్తుంది.

 N.T.V     వారి కదనం ప్రకారం సీమాంద్ర మంత్రులకు, రాష్ట్ర విబజన గురించి కొన్ని నెలల ముందే తెలుసట! వారికి అన్ని తాయిలాలు ఇచ్చాకే సోనియా గారు రాష్ట్ర విబజనకు తెర తీసారట! ఆంద్రా ప్రజలు తెలంగాణా ప్రజలు లాగా ఉద్యమాలు చేయలేరని, ఒక వేలా చేస్తే గీస్తే మంత్రులైన తామే ఆ ఉద్యమాలను లీడ్ చేయాలి అని, తాము ఒప్పుకుంటే ఆంద్రా ప్రజలంతా రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్లేనని సీమాంద్ర మంత్రులు నమ్మకంగా చెప్పిన మీదటే ఇద్దరికి మంత్రి పదవులు, మరికొంత మందికి ప్రమోషన్లు ఇచ్చి, రాష్ట్ర విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధిష్టానం వారు. ఇప్పుడు ప్రజలు ఒక్కసారిగా వీదుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే, ఎక్కడ అదిష్టాన దేవత ఆగ్రహిస్తూందో అని, రోజు ప్రజల మనో బావాలు చెప్పే వంకతో వెళ్ళి ,"అమ్మా ఇవన్నీ ప్రతిపక్షాలు ఆదిస్తున్న డ్రామాలు. ప్రజలకు హైద్రబాద్ లో వాటా ఇస్తే చాలు అన్నీ అవే సర్దుమనుగుతాయి "అని సర్ది చెప్పి వస్తున్నారు. అందుకే ఎంత సేపు "విభజన అయిపోయింది, దాని గురించి కాకుండా ఇంకా ఇతర సమస్యలు ఉంటే కమిటీకి చెప్పుకోండి" అని సోనియా గాందీ గారు అంటుంటే అవే చిలక పలుకులు మంత్రులు ప్రజలకు చెపుతూ తమ బానిస నైజాన్ని చాటుకుంటున్నారు.

 కాబట్టి సీమాంద్రులారా! మీకు తెలంగాణా ప్రజలు శత్రువులు కారు. అలాగే, ముక్కు సూటిగా మాట్లాడే ఏ నాయకుడు శత్రువు కాడు. తెలుగు జాతి ఐఖ్యతను బలిపెట్టి, తుచ్చమైన పదవులు పొంది మిమ్మలను మబ్య పెడుతున్న శీమాంద్ర మంత్రులే తెలుగు జాతికి ప్రదమ శత్రువులు. వారి కల్ల బొల్లి మాటలను కాదు నమ్మాల్శింది. వారి చేతలను మాత్రమే విశ్వసించండి. అవసరమయితే మరొక నూతన రాజకీయ పార్టి క్రింద ఏకం కండి.ఆ నాడు అన్న నందమూరి విషయంలో ఎలాగైతే డీల్లీ పాలకులకు బుద్ది చెప్పారో,ఆ తరహాఅ లోనే తెలుగు జాతి ఐఖ్యతను చాటండి. అంతవరకు విశ్రమించకండి. ఇది తెలంగాణా వారికి వ్యతిరేఖంగానో, ఆంద్రా వారిక్ అనుకూలంగానో చెపుతున్నది కాదు. తెలుగు జాతి పరువును దీల్లీ పాలకుల పాదాల ముందు పెట్టి పదవులు పొందిన నాయకుల నీచ మనస్తత్వానికి వ్యతిరేకమ్ గా మాత్రమే ఒక తెలుగు వాడిగా నా  స్పందన. రాష్ట్ర విభజన అయినా సరే అది అన్నదమ్ముల పంపకం లా ఉండాలి తప్పా,డిల్లీ పాలకుల కోసం  జాతి  పరువు బజారుకీడ్చేలా ఉండరాదన్నది నా నిశ్చితాభిప్రాయం.        
        

4 comments: