Saturday, August 24, 2013

"సందట్లో సడే మియా" ప్రతి పాదన ఎందుకోసం?


                                                                     


   ఒక వ్యక్తి కాని, కుటుంబం కాని బలంగా ఉన్నంత కాలం ఎవడూ మాట్లాడడానికి కాని, వారితో విబేదించడానికి కాని సాహాసం చేయరు.కాని అదే వ్యక్తి కాని, కుటుంబంకాని ఏ కారణాలచేతనైన బలహీనమ పడుతున్నపుడు ప్రతి ఒక్కరూ దాని నుండి ఫాయిదా పొందాలని చూస్తారు. ఇదే పద్దతి ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో జరుగుతుంది.

   ఇప్పటి దాక రెండే వాదాలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో వినిపిస్తుండేవి. ఒకటి ప్రత్యేక తెలంగాణా, రెండు సమైఖ్యతాంద్రప్రదేశ్. తెలంగాణా కోసం మొన్నట్టిదాక తెలంగాణా ప్రజలు పెద్దఎత్తున ఉద్యమిస్తే, రాష్ట్ర ఏర్పాటుకు అధికార పార్టీ అంగికరించగానే ,జై సమైక్యాంద్రా అంటూ సీమాంద్ర ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమం నడుస్తున్న తీరు చూస్తే, సీమాంద్ర ప్రజలలో బావోద్వేగాలతో కూడిన మమకారం మన రాజదాని నగరం మీద చాలా ఎక్కువుగానే ఉందనిపిస్తుంది. కానీ సోనీయా గాంది గారు విబజన తప్పదు అని కరాఖండిగా చెపుతుంటే సీమాంద్ర కాంగ్రెస్ నాయకులకు ఎటూ పాలుపోక కొంతమంది  నష్ట నివారణ కోసం ఆలోచించడం మొదలు పెట్టారు. దానిలో బాగమే "హైద్రాబాద్" ని కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యడం. ఈ గొడవలు ఇలా ఉంటే ఇంకొక ప్రతిపాదన తెచ్చాడు "సందట్లో సడేమియా".

    సందట్లో సడే మియా అని ఎవరిని అంటారో తెలుసా? ఎవరి గొడవలో వారు టెన్షన్ పడుతుంటే  గప్ చుప్ గా  తన పని కానిచ్చుకునే వాడిని అంటారు. ఇదిగో అలాంటి సడే మియా ఒకరు తయ్యారయ్యారు. ఆయనకి అధిష్టాన దేవత దగ్గర పలుకు బడి ఎక్కువట. అధిష్టాన దేవతకు బి.జె.పి. అంటే ఎలాగు పడదు.  అందుకని నూతనంగా ఏర్పడబోయే తెలంగాణా రాష్ట్రం లో బి.జె.పి. బలపడకుండ, మరియు ముస్లిం ల సీట్లు గణనీయంగా పెంచుకునేందుకు, "రాయల తెలంగాణా" ప్రతి పాదన మొదలుపెట్టి అమ్మ కు విన్నవించాడు.దీనికి కొంతమంది సీమ నాయకుల మద్దతు ఉందని చెపుతున్నారు. ఈ విదంగా  అటు  సీమాంద్రలోను విభజన తేవడానికి ఈ "సడే మియా" ప్రయత్నిస్తున్నాడు. రాయసీమ ప్రాంతం లో ముస్లిం ల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. మొన్న శుక్రవారం సమైఖ్యతాంద్ర ప్రదేశ్ కోసం సీమ ముస్లిమ్లు ప్రత్యేకంగా ముస్లిం J.A.C   పేరుతో ఆందోళన చేస్తే లక్షలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. అందుకే సీమ ముస్లిం లు, తెలంగాణా ముస్లింలు కలిస్తే తెలంగాణాను  మరొక సారి నవాబుల రాజ్యం చేయవచ్చని వారి ఆశ కాబోలు. మైనార్టిలుగా ఉండబట్టి వారిలోని కాంక్ష బయటపడటం లేదు కానీ, లేకుంటే హైద్రాబాద్ నిజాం లది కాబట్టి దానిని ఏలే హక్కు మాదే అనే కొంత మంది  చెంగీఝ్ ఖాన్ లు బయటపడే వారే.

  ఒక వేళ సడేమియా గారు ఆశించినట్లు రాయల తెలంగాణ వస్తే ఖచ్చితంగ అది మత పరమైన  రాష్ట్ర విభజన  అని చెప్పక తప్పదు. అధికారం కోసం ఎంతటి నీచానికైన తెగించే చరిత్ర అధికార రాజకియ పక్షాలది.ఎవరు ఎమన్నా  రామారావు గారు అధికారానికి రాక ముందు ఉన్న హైద్రాబాద్ ని ఒక్క సారి ఊహించుకుంటే కనపడేవన్నీ మత కలహలే. దానిని రూపుమాపి నగరాన్ని ఒక హై.టెక్ నగరంగా అంతర్జాతీయ స్తాయికి తీసుకు వెల్లిన ఘనత  తెలుగు దేశం  పార్టీదే అని ఒప్పుకోక తప్పదు. కాలం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండదు.రాజకీయ కారణాల వల్ల విబజన అనివార్యం కావచ్చు. కాని దాని కోసం మత పరంగా బలపడాలనే ఉద్దేశ్యం  తో "సందట్లో సడే మియ"లు చేసే ప్రతిపాదనలు కార్య రూపం దాలిస్తే నాడు హైద్రాబాద్ లో ఉన్న మతకల్లోలాలు యవత్ తెలంగాణా రాష్ట్రం  అంతా ఉంటాయి అని గ్రహిస్తే మంచిది.            

No comments:

Post a Comment