Thursday, August 29, 2013

తెలుగోడి రాష్ట్రంలో ఎవడి గోడు వాడిదే !

                                                     


                                                            
ఏమంటూ ప్రకటించారో కానీ, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు, ఆ రోజు నుంచి రాష్ట్రంలో  రాజకీయ నాయకులకు హడావుడి ఎక్కువైపోయి పాపం కంటి మీద కునుకు లేకుండా పోయినట్లుంది. మొన్నట్టిదాక రాయల సీమ నేతలు, ముస్లిం నేతలు "రాయల తెలంగాణా" ప్రతిపాదనతో, రాయలసీమ జిల్లలను తెలంగాణ లో కలిపి రాష్ట్ర ఏర్పాటు చెయ్యాలని ముందుకు వస్తే,ఇప్పుడు కొంతమంది నాయకులు ఉత్తరాంద్ర జిల్లాలతో కలిపిన తెలంగాణా కావాలని ప్రతి పాదిస్తున్నారు. దీనికి ముఖ్యంగ రేణుకా చౌదరి గారు, ప్రభుత్వ విప్ బట్టీ విక్రమార్క, కోండ్రు మురలి గారు ప్రతిపాదన చేసి ఉత్తరాంద్రా నాయకులను కల్పుకుని డిల్లీలో తమ ప్రతిపాదనను సోనియా గాంది గారికి వివరించలనుకున్నట్లు తెలుస్తుంది. రేణుకా చౌదరి గారికిమేడం గారితో ఉన్న సన్నిహితం ఆమెను ప్రబావపరచడనికి ఉపయోగ పడినా , ఈ ప్రతిపాదనకు నాయకులలో పెద్దగా స్పందన కనిపించడం లేదు .

 ఆసలు ఈ ప్రతి పాదన వెనుక ఉత్తరాంద్రాలోని కొన్ని మైనింగ్ ఆదారిత కంపెనీల యాజమాన్యాలు హస్తం ఉన్నట్లు కనపడుతుంది .ఖమ్మం జిల్లాలోని ఇనుపరాయి,ఇతర ఖనిజాలు విశాఖ పట్టణం, విజయనగరం లోని ప్లాంట్లకు సరపరా చేస్తుంటారు. అలాగే మన్యసీమలో ఎంతో విలువైన ఖనిజ సంపద ఉత్తరంద్రా జిల్లలోని కంపెనీలకు అవసరం. రేపు తెలంగాణా విడిపోతే ముడి ఖనిజం లబ్యత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే బయ్యారం ఇనుపరాయి విశాఖా స్టిల్ ప్లాంట్ కి కేటాయించడాన్ని తెలంగాణ వాదులు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా  ముందు చూపుతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలు రాజకీయ నా యకులతో ఈ ప్రతిపాదన చేయిస్తూ ఉండవచ్చు.

  ఇంకా సీమాంద్ర ప్రజలలో తెలంగాణా రాష్ట్ర ఏర్ప్పాటు ఎట్టి పరిస్తితిలో జరగదని నమ్మకం. అందుకే సమైక్యత మీదే వారి ద్రుష్టి నిలిపారు. ఒకవేళా ఆరు నూరైనా రాష్ట్రం విడిపోవడం ఖాయమని వారు కూడా అనుకుంటే అప్పుడు చూడాలి ఎన్ని ప్రతిపాదనలు వస్తాయో.  రాష్ట్రం లో రాజకీయాలు,ఎవడి గోల వాడిదే అన్న ట్లు ఉంటాయి.  

No comments:

Post a Comment