Wednesday, August 28, 2013

ఏమిటీ ! హైదరాబాద్లో మీకు రక్షణ లేదా ? ఇదిగో నా పోన్ నంబర్ తీసుకోండి .ఎనీటైం .... ఎనీవేర్ .... మీకు రక్షణ ఇవ్వడానికి నేను రెడీ !

                                                             

 తెలంగాణా ఏర్పడితే , నూతన రాష్ట్రం లో త్రెలంగానా నిరుద్యోగులకు   ఏటువంటి ఉద్యోగాలు వస్తాయో  తెలియదు కానీ రాజకీయ నాయకులకు మాత్రం సెక్యూరిటి గార్డులు , బాడి గార్డుల ఉద్యోగాలు మాత్రం బోల్డన్నీ వచ్చేటట్ట్లున్నాయి . ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు , లాండ్ మాఫియా  డాన్ లు తమ ఆసక్తులు ,ఆస్తులు రక్షణకు  బీహారీ  గాంగ్ లను నియమించుకున్నారంట . అలాగే రేపు తెలంగాణ ఏర్పడితే హైద్రాబాద్లో ఉన్న సీమాంద్రా సెటిలర్స్ తమకు రక్షణ ఎలా అని ఆందోళన పడుతున్న నేపద్యమ్ లో తెలంగాణా రాజకీయ నాయకులు పోటీలు పడీ మరీ మీడియా ప్రకటణ లు ఇచ్చేస్తున్నారు  మరి !

 తెలంగానా  రాష్ట్రం ఏర్పడితే సీమాంద్రుల సెటిలర్స  ఆస్తులు, వ్యక్తిగత రక్షణ,    సమస్యగా మారుతుందని సీమాంద్రులు బయపడడానికి   కారణం తెలంగానా ప్రాంత నాయకుల రెచ్చగొట్టే మాటలు..  దానికి సెటిలర్స్ రక్షణ గురించి, వారు అడుగుతుంది ప్రత్యేక  చట్ట రక్షణ, ప్రభుత్వ రక్షణ. అంతే కానీ తెలంగాణా రాజకీయ నాయకుల ఇచ్చే వ్యక్తిగత లేక సామూహిక హామీలు కావు. ఒక వేళా తెలంగాణ నాయకులు బాడీ గార్డులు గా రూపాంతరం చెంది, సెటిలర్స్ కి రక్షణ ఇస్తామన్నా, వారి సేవలు పొందడానికి ఏ సెటిలర్ సిద్దంగ లేడు. ఆసలు సెటిలర్లు బయపడేది తెలంగాణ రాజకీయ నాయకులకే తప్పా, తెలంగాణ లోని సామాన్య  ప్రజలకు కాదు. తెలంగాణా ప్రజలు, ఆంద్రా ప్రజల మద్య ఉన్నది సోదరబావమే తప్పా వేరే అనుమానలు ఏమి లేవు. వచ్చిన సమస్యల్లా రాజకీయ నాయకులతోనే.  N.T.R  వచ్చే దాక హైద్రాబాద్ లో మత ఘర్షణలు ఆపిన  వాడే లేడు . అసలు వాటిని పెంచి పోషించింది రాజకీయా నాయకులే అనేది జగమెరిగిన సత్యం.మరి అటువంటి నాయకులు "మా పోన్ నంబర్ తీసుకోండి. మీకెవరైన ఆపద కలిగిస్తే మాకు పోన్ చెయ్యండి. మీ ప్రాణాలకు మా ప్రాణాలు  అడ్డం" అని సినిమా డైలాగులు కొడుతూంటే తెలంగాణ వారికే అనుమానం వస్తుందట! ఇదేంట్రా బాబూ, వీరేదో తెలంగాణా  రాష్ట్రం తెచ్చి, మనకు ఉద్యోగాలు ఇప్పిస్తారు అనుకుంటే, సీమాంద్రులకు బాడీ గార్డులుగ పని చెయ్యడానికి ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇలా ప్రకటణలు ఇస్తున్నారేమిటా? అని.

 కానీ సదరు రాజకీయ నాయకుల ఇంట్లోని ఆడవాళ్ళు మాత్రం తమ మగవారి మాటలను మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదట! ఆ.. ఈళ్ళ బొంద! మా మెళ్ళల్లో గొలుసులని పట్టపగలే దోచుకు వెళుతున్న  వారి నుండి ఇంటి వస్తువులు కాపాడ లేరు కానీ, ఇక సేటిలర్స్ ఆస్తులును కాపాడతారా? అని. కానీ పాపం ఇదేమి తెలియని సదరు నాయకులు మత్రం బాడిగార్డ్ గిరి  చెయ్యడానికి యమ హూషార్  అవుతునారంట !     

No comments:

Post a Comment