Tuesday, August 27, 2013

వ్యక్తుల్ని బౌతిక వాద పద్దత్తుల్లోనే కాదు , బావోద్వేగ పద్దత్తుల్లో కూడా చంపవచ్చు, జన విజ్ఞానుల వారూ

                                                                  
ప్రముఖ హేతువాది శ్రీ నరేంద్ర దబోల్కర్


  మొన్న నేను ఫేస్ బుక్ లో ఒక మిత్రుడు పెట్టిన టపా చూసాను . ఆయనగారి వ్యాఖ్యానం నాకు కొంచం ఆశ్చర్యాన్ని తెప్పించింది . పూర్తీ వ్యాఖ్యానం ఇది

 "ఇది భౌతిక వాద శక్తులు సాధించిన విజయం. మతోన్మాదులార భౌతిక వాదులను చంపాలంటే భౌతిక పద్దతుల్లోనే హత్య చేయాలి తప్ప ఏ భావ వాద పద్దతుల్లో చంపడం సాధ్యం కాదు అని నిరుపించిన గొప్ప వ్యక్తి నరేంద్ర ధబోల్కర్. బాణామతి, చేతబడులతో కాని, మంత్రాలు, మాయలతో కాని మమ్మల్ని చంపలేరనేది నిజం అనే బౌతిక సత్యాని నిరుపించినది ధబోల్కర్ గారి మరణం.

ఇప్పుడే నరేంద్ర ధబోల్కర్ గారి సంస్మరణ సభలో మాట్లాడి వస్తున్న. నిజంగ 8సం. క్రిత
ం ఫొన్ లో పరిచయమై అప్పుడప్పుడు ఆప్యాంగా మట్లాడి సలహాలు ఇచ్చే వ్యక్తి, నేను అభిమానించే వ్యక్తి చని పోవడం ఆ సభలో మాట్లాడాల్సి రావడం చాలా కష్ట సాధ్యమైన పనే. ప్రస్తుత ఐ.జి. ఆనాటి నల్గొండ ఎస్.పి. మహేష్ భగవత్ గారు నాకు నరేంద్ర గారిని పరిచయం చేశారు. అంధ శ్రద్ద ఈర్మూలన సమితి మూఢ నమ్మకాలకు వ్యతిరెకంగ, మోసాలు చేసే స్వాములు, బాబాలను అరెస్ట్ చేసె చట్టం ఒకటి చేయాలని పోరాడుతున్న ఆ మహానుభవుడి నుండి ఆ చట్టం కాపిని తెప్పించుకుని దానిని ఇక్కడ కూడా అమలు చేయాలని కోరాలని అనుకోవడం జరిగింది. అప్పటి నుండి అప్పుడప్పుడు నరేంద్ర గారితో మాట్లాడుతునే ఉన్నాను. మతోన్మాద శక్తులు ఎంతకైన తెగిస్తాయని చెప్పడానికి ఇది నిదర్శనం.    "J.V.V. Ramesh". 


 కొంతమంది దుండుగలు ప్రముఖ హేతువాది దబోల్కర్ గారిని హత్య చేసారు . ఇది  పిరికి పందల  చర్య . ఇటువంటి దుర్మార్గపు చర్యలను బౌతిక వాదులే కాదు బావ వాదులు కూడా  ఖండించారు, ఖండించాలి కూడా  . కానీ అయన హత్య చేయబడటం బౌతికవాదుల విజయం అంటే కొంచం ఆశ్చర్యంతో కూడిన అనుమానం వస్తుంది . కొంపదీసి తమ వాదాన్ని గెలిపించుకోవటం కోసం బౌతిక వాదులే ఆయన్ని హత్య చేయించారా అని ! లేకపోతే హత్యలో కూడా  బౌతికవాద  గెలుపు చూడటం ఏమిటీ ? 
  ఒక వేళా జన విజ్ఞాన వేదిక వాదన ప్రకారం హత్యలన్నీ బౌతిక వాదుల విజయాలు అయితే ఆత్మ హత్యలన్నీ బావవాదుల విజయాలు అవుతాయి . ఎందుకంటే  బావోద్వేగాలే ప్రదాన పాత్ర వహిస్తాయి కాబట్టి . మొన్నట్టివరకు జరిగిన తెలంగాణా ఉద్యమంలో వేయిమందికి  పైగా ఆత్మ హత్యలు చేసుకున్నారు . ఇప్పుడు సమైక్యతా ఉద్యమంలో నాలుగువందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారట ! మరి ఇవ్వన్నీ బావవాదుల విజయమని వారు చంకలు ఎగురవేస్తే ఎలా ఉంటుంది ? కాబట్టి మిత్రులు హత్యను హత్యగానే చూడాలి తప్పా , అందులో గెలుపు ఉందని బావించడం శవయాత్రలో చిల్లర పైసలు ఏరుకునే నైజం లాంటిది . 

  దేశమంటే మట్టి కాదోయి మనుషులోయి అన్నట్లు , మనిషి అంటే  శరీరం మాత్రమే కాదూ ., బావోద్వేగాల సమ్మేళనం కూడా   అని తెలిసికుంటే మంచిది . .మెదడులో ఎడమ బాగం తప్పా , కుడిబాగం పనిచెయ్యని వారికి ఎంత చెప్పినా బుర్రకెక్కదు కాబట్టి వారిని చూసి జాలిపడటం తప్పా మనం చేయగలిగింది ఏముండదు ..

  .

 
 

No comments:

Post a Comment