Friday, August 16, 2013

ఐదేళ్ళ పాటు కే .సి.ఆర్ గారి అద్వర్యంలో "ట్రయిల్ తెలంగాణా " నడపితే తెలుస్తుంది !

                                                                
                                                                 

 తెలంగాణా యువతలో, ఉద్యోగులలో , విద్యార్దులలో చాలా ఆశలు ,అపోహలు ఉన్నాయి  వాటిని క్లియర్ చెయ్యకుండా ఒక వేళా సమైక్య వాదులు అడుగుతున్నట్లు , రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచినా , అది ఆందోళనా ప్రదేశ్ లాగే ఉంటుంది తప్పా , ఆంద్ర ప్రదేశ్ లాగా ఉండదు . ఎవరెన్ని చెప్పినా తెలంగాణా ప్రజల మనసులలోఆంద్రా వారి పట్ల ఉన్న బావాలు మారిపోవడం కష్టం . అటు సీమాంద్రులలో కూడా  విబజన గురించి ఉన్న బావోద్వేగాలు తొలగించడం కష్టం . ఎలాగూ  పదేండ్లు ఉమ్మడి రాజ్యదాని అంటున్నారు కాబట్టి ఒక పని చేస్తే ఎలా ఉంటుంది .?

  తెలంగాణా ఏర్పడితే నిర్యుద్యోగం ఉండదని ,ఉపాది అవకాశాలు మెరుగవుతాయి అని తెలంగాణా వారు ఆశ పడుతున్నారు . తెలంగాణా నీటి వనరులతో సస్య శ్యామలం అవుతుందని రైతన్నల నమ్మక్కం . లేదూ  రెండు ప్రాంతాలకు నష్టమే అని ఆంద్రా వారి వాదన . తెలంగాణా ఏర్పడినాక రెండేళ్ళలో యువత ఆశలు తీర్చక పోతే ,మరొక  సామాజిక తెలంగాణా ఏర్పాటు కొరకు లడాయి తప్పదు . అంతా గందర గోళం అవుతుంది . కాబట్టి ఒక అయిదేళ్ళ పాటు "ట్రయిల్ తెలంగాణా " ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది ?

    k.c.r  గారి ఆద్వర్యంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మండలి ఏర్పాటు   చేయ్య్యాలి సీమాంద్రులకు చోటు ఉండరాదు . ఆ  మండలికి అన్ని విషయాలలో శాసన సబ కు ఉండే అధికారాలు ఇవ్వాలి . అలా ఐదేండ్లు పాలన కోన సాగించాక ఆ మండలి అద్వర్యంలో నే తెలంగాణా లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి . 2/3 వంతు ప్రజలు అనుకూలంగా ఉంటే "ట్రయిల్  తెలంగాణా " ను "రియల్ తెలంగాణా " గా ప్రకటిస్తూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చెయ్యాలి . అక్కడనుండి 5 యేండ్ల లోపు ఆంద్రా వారు రాజదాని ఏర్పాటు చేసు కోవాలి . మొత్తానికి అలా చేస్తే మనం ఊహించేది  అరచేతిలో స్వర్గమా , అసలు స్వర్గమా అనేది తేలిపోతుంది .

1 comment:

  1. Already 60 endlu trial unna kooda meeru , telangana prajalni integrate chesukoleka poyaru. ippude peekedendi..

    Mee bhadha entante..ekkada Neellu rakunda pothayoo ai...innallu free ga ichinam ika paina iyaama..Tribunals unny kada,,,maku nammakam ledu ante...maaku nammakam ledu mari :-)

    ReplyDelete