Monday, July 8, 2013

విదేశి "గన్నయ్య"ల ద్రుష్టిలో ఆయన ఎవరైనా, స్తీ మాన రక్షణకు చీరలు ఇచ్చిన అన్నయ్యే మా కన్నయ్యా!..



                                                                  


  మొన్న నేనొక ఆర్టికిల్ చదివాను. "మానవ వాదం" పేరుతో హిందువుల పంచమ వేదం  మహ భారతం మీద తన అక్కస్సు నంతా వెళ్ళగ్రక్కాడు ఆ  వ్యాస రచయిత. ముఖ్యంగా యుగపురుషుడు అయిన శ్రీ క్రిష్ణ బగవానుని గురించి కొంత మంది విదేశి గన్నయల పేరు మీద కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు.  మహ భారతం విజ్ణాన గ్రందం ఏమి కాదు విమర్శించడానికి. పై పెచ్చు ఆ వ్యాస రచయితే ఒప్పుకుణ్ణాడు మహా భ్హారతం కాలాంతరంలో ప్రక్షిప్తమయిందని. అటువంటపుడు నిజమేదో , కల్పన ఏదో తెలియని పరిస్తితిలో పని కట్టుకుని పురాణా పాత్రలను, కొన్ని కోట్ల మంది అరాదించే బగవానుడి పట్ల  తనకున్న తన విక్రుత బావాలని విదేశియుల పేరు మీద అంట గట్టి  చూపడం ఎందుకు? ఇది ఖచ్చితంగా హిందూ మత విశ్వాసాలను కించపరచే చర్యే.



 రామాయణ, మహా భారతం లు సీరియల్స్ గా దూరదర్శన్ లో ప్రసారమైనంత కాలం పిన్ డ్రాప్ సైలెన్స్ తో ఒక ఉద్వేగ బావనతో బారతీయులు వీక్షించారు.అది వార్కి ఆ కదల మీద ఉన్న ఆసక్తి కావచ్చు, భక్తి బావన కావచ్చు, ఏదైనా సరే వారికి ఆద్యాత్మిక ఆనందం పంచిన పురాణ కదలు. ఒక్కొక్క విషయం ఒక్కకరికి ఒక్కొక్క విదంగా అర్దం కావచ్చు. వారు తమకు అర్దమయిన విదంగా ప్రచారాలు చేస్తూ ఉండవచ్చు. ఉదాహరణకి "సత్య హరిచంద్ర" చూసిన వారు అద్యాత్మిక వాదైతే సత్యం కోసం పాటు పడిన హరిశ్చంద్రుడిని ఆదర్శం అంటాడు. కాని మేటీరియలిస్ట్ అయితే "పిచ్చోడు కాబట్టే ఇన్ని బాదలు పడ్డాడు, అదే ఒక్క అబద్దం ఆడితే, సర్వ సౌఖ్యాలు పొందేవాడు కదా " అని బావిస్తాడు. అంటే ఒకటే కధను  వారి వారి చిత్తానుసారం అన్వయించుకుని అర్దం చెప్పుకున్నంత మాత్రానా అసలు సత్య హరిచంద్రుడు సత్యం కోసం పాటు పడమనే కదా ప్రభోదించింది. !

 అలాగే శ్రీ క్రిష్ణుడు  అంటే పరిపూర్ణమయిన మానవుడు. భగవంతుడైనా సరే మానవ జన్మ ఎత్తినందుకు మానవుడు చేసే పనులే చేసాడు. బలం లేని చోట యుక్తితో, బలవంతుల సహాయంతో , శత్రువులను జయించటం కుట్రలు, కుయుక్తులు అవుతాయా? కరూణామయుడు భక్తుల మని చెప్పుకుంటూ, మానవుల మీద బాంబులు కురిపించే విదేశీయుల రక్తం కలిగిన వారు క్రిష్ణుని ఒన్నత్యాన్ని ఏమి అర్ధం చేసుకోగలరు. ఎప్పుడో చిన్నపుడు అల్లరి క్రిష్ణయగా గోపికల చీరలెత్తికెల్లిన ఘట్టాలాంటివి ఆదారంగా కొంతమంది భక్తి బావాలను ప్రచారం చేస్తే, దానికి మలిన శ్రుంగార బావాలు అపాధించ్చి, తమలో ఉన్న విక్రుత బావాలను పురాణ పురుషులకు అంట కట్టి విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమనుకోవాలా?

   అయినా మహా భారత గ్రందంలో క్రిష్ణుడు ఎలా వర్ణించబడ్డాడో, సగటు భారతీయుడుకి అవసరమ్ లేదు. ఎప్పుడు మెదడులో ఎడమ బాగ్తం తప్పా, కుడి బాగం పని చెయ్యని గన్నయల ద్రుష్టిలో శ్రీ క్రిష్ణుడు ఎలా ఉన్నడు అనేది ముఖ్యం కాదు. సగటు భారతీయుల ద్రుష్టిలో ఆయన దేవుడు. ఆయన దుష్ట సంహారం చెయ్యడానికి పాండవుల వైపు నిల బడ్డాడు. దుష్ట కౌరవ సభలో కులసతి  బట్టలు నీచులు  ఊడదీస్తుంటే, చీరలు ఇచ్చి కాపాడిన "అన్నయ్య" అతను. ఆయన అలాగే తెలుసు భారతీయులకు. అలాంటి బావాలను రూపు మాపి హిందూ సంస్క్రుతిని దెబ్బతీయాలనే విదేసి మతస్తుల కుట్రలో బాగంగా, వారికి తోద్పడుతున్న వారు , కుహాన రచయితలు, ఇంకొక వేయి జన్మ లెత్తినా శ్రీ క్రిష్ణుడి పట్ల భారతీయుల కున్న భక్తి బావాన్ని చెరుపలేరు.     

No comments:

Post a Comment