Wednesday, July 17, 2013

స్త్రీ తన హ్రుదయాన్ని ఒకరికే ఇస్తుందట నిజమేనా సార్!?


                                                              

                                                               

 అవి నేను పదవ తరగతి చదువుతున్న  రోజులు. ఖమ్మం లోని బస్స్టాండ్ దగ్గర ఉన్న రిక్కా బజార్ హై స్కూలో, కొత్తగూడెం దగ్గర ఉన్న రామ వరమ్లో తొమ్మిదో తరగతి చదివిన నన్ను, పదవతరగతికి ఖమ్మం లో జాయిన్ చేసారు. కారణం అప్పటి దాక రామవరం హైస్కూల్లో లెక్కలు టిచరుగా పని చేస్తున్న మా అన్నయ్య గారు, ఊటుకూరుకు ట్రాన్స్ఫర్ కావడం వల్ల నేను ఒంటరిగా అక్కడ చదవటం వీలు కాక మా నాన్న గారు తీసుకు వచ్చి ఖమ్మం లో పడేశారు.

  నేను చిన్నప్పట్నుండి క్లాసులో చాలా చురుకుగా ఉండేవాడిని.చదువులో మాత్రమే కాక ఇతరత్రా అంటె అంటే ఆటలులో కాదు(నాకు గేమ్స్ ఆడటం  చిన్న్నప్పటినుండే అలవాటు లేదన్నమాట!)  కాని, వ్యాస రచనలు, వక్రుత్వ పోటిలు, సాంస్క్రుతిక కార్యక్రమాలలో హుషారుగా పాల్గుంటుండే వాడిని. సాధారణంగా అల్లరి చేసే అబ్బాయిలు వెనుక బెంచిలో కూర్చుని అల్లరి చేస్తుంటారు. కానీ ఎప్పుడూ ముందు బెంచిలో కూర్చునే సహ విద్యార్దుల మీద, టీచర్ల మీద కామెంట్లతో నవ్విస్తుండే నేనంటే అందరికి అభిమానమే అని చెప్ప వచ్చు. కొత్త గూడెం నుండి వచ్చిన వాడిని అవటం చేత నన్ను అందరూ "కే.టి.డి.యం బయ్యా" అని నిక్ నేమ్ తో పిలిచే వారు.

 ఆ విదంగా నా చదువు సాగిపోతున్న రోజుల్లో , ఒక రోజు మా బయాలజీ సారు క్లాసులో హ్రుదయం(గుండె), గురించి, అది పని చేసే విదం గురించి పాఠం చెప్పారు. పాఠం అంతా అయ్యాక "ఒరే మీలో ఎవరికైనా హ్రుదయం గురించి డౌట్ లు ఉంటే అడగండి అన్నారు. మాలో ఎవ్వరూ ఏమి అడగలేదు. ఎప్పుడైనా విద్యార్ధి అనే వాడు రెండు సమయాలలోనే డౌట్ లు అడగరు . ఒకటి అంతా అర్ధమయినప్పుడు, రెండు ఏమీ అర్దం కానప్పుడు. ఇలా నా ఫ్రెండ్స్ కి ఏమి అర్దం అయిందో నాకు తెలియదు కాని, నాలో మాత్రం వెంటనే ఒక చిలిపి  ప్రశ్న   ఉదయించింది. అంతే! ఠక్కున లేచి చేతులు కట్టుకుని " సార్ స్త్రీ తన హ్రుదయ్యాని ఒకరికే ఇస్తుందట, నిజమేనా సార్!" అని అమాయకంగా ముఖం పెట్టి అదీగాను. అప్పట్టి దాక సైలెంట్ గా ఉన్న క్లాస్ ఒక్క సారీగా గొల్లుమంది. నేనేదో గొప్ప దోఉట్ అడుగుతున్నాని అనుకున్న మా బయాలజీ సార్ ఒక్క క్షణం స్టన్ అయి, తిరిగి మాతో పాటు నవ్వడం మొదలెట్టారు. "రేయి, ఈ డౌట్ కి సమాధానం చెప్పలంటే స్ఫెషల్ క్లాస్ తీసుకోవాలి. కాబట్టి నీవు మాత్రమే ఆ క్లాస్కి వస్తే అప్పుడు చెపుతాను" అన్నారు. ఇంతకి ఆయన తీసుకునే స్పెషల్ క్లాస్(మొట్టికాయల క్లాస్) ఏమిటొ నాకు తెలుసు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం కావాలని సార్ ని  ఎప్పుడూ ఒత్తిడి చెయ్యలేదు .

  అయ్యా అదీ నా పదవ తరగతిలో పదనిసలు. ఎందుకో నా చిన్న నాటి ముచ్చటలు  మీతో షేర్ చేసుకుందామనిపించి ఇలా టపాగా పెట్టడం జరిగింది.

No comments:

Post a Comment