Tuesday, July 16, 2013

తాగే కాడ, ఊగే కాడ, అమ్మాయిలు లేకపొతే ఎంత కష్టం! ఎంత కష్టం!.



                                                              
 అవును మరి ! ఘోరమైన అన్యాయం కదూ  ఇది! ఆన్ని అవకాశాలలో సగ భాగమ్ ఇచ్చిన పడతులకు ’మందు కొట్టే కాడ" "మజాగా ఎగిరే కాడ" ఉండటానికి వీలేదనట మేమిటి? దీని వల్ల అటు  బార్ ఓనర్లు, ఇటు బార్ డాన్సర్ లు కి ఎంత కష్టం? మరి వీరి కష్టాల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇంకెవరూ సాక్షాతు ఆ సుప్రీమ్ కోర్టు వారే పట్టించుకున్నారు! ఆరేండ్ల క్రితం బార్లలో డాన్సులు నిషేదించిన మహారాష్ట్ర ప్రభుత్వం, దానిని సమర్దించిన ముంబాయి హైకోర్టు వారి ఉత్తర్వులను కొట్టి వేస్తూ, బార్లలో స్వేచ్చగా డాన్స్ చేసుకోవచ్చు అని చెప్పారట! చాలా సంతోషం !

  ఇంతకు మునుపే కర్ణాటక హైకోర్టు వారు కన్నడ బార్ యజమానులు వేసిన పిటిషన్ ని విచారించి, బార్లలో లేడి వెఇటర్ లు లేకపోతే వ్యాపారాలు చేసుకోవడం కష్టమవుతుందనో లేక అధి ప్రాదమిక హక్కులకు భంగం అనో బార్ లలో "లేడి వెయిటర్" లని నియమించుకోవడానికి బార్ యజమానులకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్ట్ వారేమో బార్ ల లో డాన్స్ లు వెయ్యడానికి అనుమతిచ్చేశారు. ఇంకేముంది! ఈ మాట  చాలదూ ఆంద్ర ప్రదేష్ లాంటి మద్యం ప్రియులు ఉన్న రాష్ట్రానికి. ఇక అమ్మాయిలు పోస్తుంటే ఫుల్ గా తాగొచ్చు! మూడొస్తే బాగా ఊగొచ్చు! అదేనండి డాన్స్ చేయవచ్చు. అయినా మన పిచ్చి కాని సరి అయిన చట్టాలు చెయ్యకుండా ఏదో జీ.వో. లు పాస్ చేస్తే పౌరుల ప్రాధమిక హక్కుల పరిరక్షణే ద్యేయంగా పని చేసే కోర్టులు వాటిని కొట్టి వెయ్యకుండా ఉంటాయా? కాబట్టి మనం తెలుసుకోవలసింది ఏమీటంటే, తాగడం, ఊగడం లో పాలు పంచుకోవడం  మగవాళ్లకే కాదు ఆడవాళ్ళకి కూడా ప్రాదమిక హక్కుల్లో బాగమే!.
       అంతా బాగానే ఉంది. బార్ ఓనర్ల కష్టాలు, డాన్సర్ల కష్టాలు సరే , మరి సంసారాలు కూలిపోతుంటే చూస్తూ ఏమి చీయ్యలేని పరిస్తితుల్లో ఉన్న సంసారుల కష్టాలు పట్టించుకునేది ఎవరు?

No comments:

Post a Comment