Saturday, July 13, 2013

చర్యలు, ప్రతిచర్యలు మాత్రమే మానవుడి సబ్జెక్ట్ , అద్బుతాలు, విశ్వాసాలు మాత్రం మాదవుడి సబ్జెక్ట్.



                                                                
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు



 తలచినదే, జరిగినదా దైవమ్ ఎందులకు,

  జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు.

  ఈ పాట వింటున్నప్పుడు ఎంత అనుబవ పూర్వకంగా చెప్పారో అనిపిస్తుంది.అన్నింటికి మానవుడే కర్త అని, అతను తలచుకుంటే అసాద్యమైనది ఏది లేదని అనుకుంటాడు. కాని అనుకోకుండా జరిగే హటాత్పరిణామాలకు బిక్క చచ్చి బేల చూపులు చూస్తుంటాడు. మళ్ళీ అంతలోనే మరచిపోయి తానే సర్వానికి కేంద్రం అని ఊగుతుంటాడు. రాజ్యాలు ఏలాదామని కలలు కన్న వారు ఒక్క కనురెప్ప పాటుకు కాలి బూడిదయ్యరు. అప్పటి దాక వారినే నమ్ముకుని ఎదో సాదిద్దామనుకున్న వారు కట కటాల పాలయ్యారు. ఆర్నెల్లలో అలా జరుగుతుందని ఏ జ్యోతీష్యుడు ఊహించ గలిగాడు.?. అప్పటి దాక "దేవభూమి" గా అలరారుతూ, ఒక రాష్ట్రానికే ప్రదాన ఆదాయ వనరుగా ఉన్న ప్రాంతం ఒక్క రాత్రీలో కనివిని ఎరుగని విలయానికి గురి అయి "మరుభూమీ" మారితే కనీసం చచ్చిన వాల్లెంత మందో లెక్కలేయలేని దీన స్తితిలో ఉన్న మానవుడు ఏమని చెప్పగలుగుతాడు. కనీసం పదిఘంటల ముందు ఇలా జరుగుద్దని ఏ శాస్త్రజ్ణుడు కనిపెట్టగలిగాడు? చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలు నామ రూపాలు లేకుండా పోయినా స్పాట్ కి దగ్గరలో ఉన్న దేవాలయానికి ఏమి జరుగకపోవడం అద్బుతం అనాలా? మానవుడి చర్యలు అనాలా? ఒకలెక్క ప్రకారం మానవుడి చర్యలు , ప్రతి చర్యలు కూడా "దైవసంకల్పంలో బాగమే తప్పా అన్యదా కాదు.

No comments:

Post a Comment