Friday, July 12, 2013

భారతీయుల బానిసత్వానికి కారణం గీతా బద్దులా? చేతగాని "బుద్దులా"?


                                                           

  హిందూ మతం అంటే పడనివారు చరిత్రను ఎంత వక్రీకరించారో, వక్రీకరిస్తూ హిందుత్వం మీద విషం గ్రక్కుతున్నారో, విదేశి గన్నయల తత్వపైత్యం తెలియచేస్తుంది. అలాంటి వారి వక్ర బాష్యాలు  ఎలా ఉన్నాయో ఒక ఉదాహరణ చూడాం. అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి అన్నం అంతా పట్టి చూడక్కరలేదు.నాలుగు మెతుకులు పట్టి చూస్తే తెలిసి నట్లే వీరి వక్ర బాష్యాలు ఎలా ఉంటాయో చెప్పటానికి వారు చెప్పిన కొన్ని వ్యాక్యలు విశ్లేషిస్తే చాలు.

 "కృష్ణుడుతనను సర్వాంతర్యామిగా, సర్వశక్తివంతుడుగా చెప్పుకొని అర్జునుడితో పాటు అందరినీ తనకు లొంగిపొమ్మన్నాడు. ప్రపంచ మత సాహిత్యంలో అంత ఆడంబరంగా గొప్పలు చెప్పుకున్న ధోరణి మరి ఎక్కడా కనిపించదు. తన శక్తిని శంకించిన వారినందరినీ ఖండించాడు. అలాంటి తత్త్వం అత్యున్నతమైందని మన నాయకులు పొగిడారు. మనదేశం శతాబ్దాలుగా లొంగిపోయిందంటే ఆశ్చర్యమేమున్నది. ఇరానియాన్లూ, గ్రీకులూ, బాక్టీరియన్లూ, కుషాణులూ, హుణులూ, శాక్యులూ, అరబ్బులూ, తురుష్కులూ, మొగలులూ, ఆఫ్ఘన్లూ, పోర్చుగీస్, ఫ్రెంచి, బ్రిటిషువారికి భారత జాతి లొంగిపోయింది. 1962లో చైనావారి తన్నులకు గురయింది. ఇదంతా లొంగుబాటు తత్త్వ సారాంశమే."(గీతకు తత్త్వం ఉందా?-14--The truth about Gita by  Narla).
 
  పై  బాష్యం  చూస్తే ఎంట వక్రంగా ఉందో అర్దమవుతుంది. భారతీయులందరికి తెలిసిన గీత లో అర్జునుడు యుద్దరంగం లో వైరి పక్షం లో ఉన్న బందువులందరిని చూశి , వీరందరిని సంహరించడం తన వల్ల కాదని వైరాగ్యం తో దుఃఖిస్తుంటే " నీవు నిమిత్త మాత్రుడవు, చంపు నీవెవ్వరూ, చచ్చు వారెవ్వరూ? అన్నీ నేనే,కర్మలను చేయుటయందే నీకు అధికారముంది కాని ఖర్మ పలితం పైన కాదు. నీవు ఖర్మ పలితమునకు కారణం కారాదు, అట్లని ఖర్మలు చేయుట మానరాదు" అని మహోన్నతమైన తత్వం భోదిస్తే, దానితో తనకు కలిగిన వైరాగ్యం నుండి విముక్తుడై, సుడి గాలిలా చెలరేగి యుద్దం చేసి పాండవులకు విజయం చే కూర్చాడు అర్జునుడు.

   మరి పైన తెల్పిన దానిలో ఎక్కడైన శత్రువులకు లొంగి పొమ్మని క్రిష్ణుడు చెప్పినట్లు ఉందా? కాడి వదిలేసిన వాడిని కార్యోన్ముఖుడుని చెయ్యటం బానిసత్వం అవుతుందా? ఏమిటీ పిచ్చి రాతలు!?
సరే మరి ! వీరు విపరీతంగా ఆరాధించే బుద్దుడు ఏమన్నాడో చూద్దాం.

 . జీవ హింస వద్దన్నాడు.పెండ్లి చేసుకోవద్దన్నడు. మద్యం మాంసం తినవద్దన్నాడు. అలా ప్రక్రుతికి విరుద్దమైన పనులు అన్నీ చెప్పి ప్రజలను రాజులును నీరస వాదులుగా మార్చాడు. మన చరిత్రలో అశోక చక్రవర్తే గొప్ప ఉదాహరణ. అంత గొప్ప వీరుడే బౌద్ద మతం తీసుకున్నాక శాంతి పరుడై పోయాడు. ఎవరి డ్యూటి వారు చెయ్యాలి అనే సూత్రమ్ మరచి, ప్రజల్ని రక్షించాల్సిన రాజులే, సన్యాసులై తత్వాలు చెపుతుంటే, విదేశియులు దండ యాత్రలు చేస్తే ఏమి చెయ్యగలరు? కత్తులు తిప్పాల్సిన చోట తత్వాలు చెపితే శత్రువులు "చెవిలో పువ్వులు" పెట్టుకుని వింటుంటారా? వినరు కదా౧ అందుకే మన చేత కాని బుద్దుల వల్ల మన దేశం విదేసియుల దండ యాత్రలకు గురి అయి బ్రష్టు పట్టి పోయింది.

  విజ్ణులైన వారు ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి తాత్వికంగా  గొప్ప వాడు కావచ్చు.కాని ఆయన బోదించిన తత్వమే మన దేశాన్ని విదేసియుల దండయాత్రలనుండి ఎదుర్కోలేని దద్దమ్మలుగా, స్వదేశియులుని చేస్తే దాని వల్ల మనకు కలిగింది లాభమా? నష్టమా?. బుద్దుడు వ్యక్తిగతంగా  మహాత్ముడు కావచ్చు. కాని ఆయన చెప్పిన విదానం ప్రక్రుతికి విరుద్దం. అది ఒక విపల తత్వమ్ అనడానికి,  గన్ లు పెట్టి కాల్చుకుంటున్న బౌద్దులే ప్రతీకలు.

   హీందూ మతం అంటే అది అన్ని  మతాల వలే  కాదు. ఒక జీవన విదానం. అది అందరి తత్వాలలోని మంచిని గ్రహించింది. హిందూ సముద్రంలో అన్ని నదులు కలుస్తున్నట్లే అన్ని తత్వాలు ఇందులో ఇముడ్చుకుంది.బుద్దుడు చెప్పిన ఆచర్నాత్మక విదానాలను హిందూ మతం కాదనలేదు.అందుకే బుద్దుడును భగవానుడే అంది. పచ్చగడ్డి తినే పశువుకు ఏదో ఒక రకమ్ మేతతో జీవించ గలదు. కాని పశు దశ నుండి మనిషి దశకు ఎదిగిన జీవికి ఎదో ఓ ఒక రకమ్ కాదు. అన్నీ సమపాల్ళలో ఉంటేనే కమ్మని బోజనం. అలాగే హిందూ తత్వం ఏ వయసులో ఆ ముచ్చట అనే ప్రక్రుతి దర్మానుసారంగా " ఆశ్రమ జీవన విదానం" అవలంబించమంది.దానిలోనే త్రి మూర్తులను దర్శించవచ్చు. అది ఎలాగ్ ఈ లింక్ మీదhttp://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html క్లిక్ చేసి చూడండి.      


4 comments:

 1. హిందూ మతాన్ని సంస్కరించే మరొక మనువు లా కనపడుతున్నారు. త్వరగా ఉద్దరించండి.

  ReplyDelete
  Replies
  1. సంస్కరించడానికి నేనెవ్వరూ, సంస్కరింపబడే వారెవ్వరు! టైమ్ సార్ టైమ్! అన్నింటికి కాలపురుషుడే. ఆ కాలపురుషుడే సంకల్పిస్తే, మీరే మార్పుకు నాంది అవుతారేమో భాస్కర్ గారు.

   Delete
 2. మీరు రాసినది చాల బాగున్ది. బుద్ధుడి గురించి కృష్ణుడి గురించి కూడా కరెక్ట్ చెప్పారు
  వీటికి మరి కొన్ని జోడించాలని ఉంది
  కృష్ణుడంటే ఒక ఆధారం ఆయనకు నాలుగు భుజాలు ఉన్నాయి కదా అంటే సహయోగి (సహాయం చేసే ) ఆత్మలు
  మరి నలుగురు ఉన్నారు మొత్తం ఐదుగురు వీరు నరుడి నుంచి నారాయణుడిగా ఇంకా నారి నుంచి లక్ష్మి గా
  అయ్యేవారు తపస్సు చేస్తున్నప్పుడు వీరిని బ్రాహ్మలు అన్నారు అందుకే పంచముఖి బ్రహ్మ
  ఈ బ్రాహ్మలు తపస్సు పూర్ణం అయి నప్పుడు విష్ణువు అవుతారు. మరి వీరిని ఆ విధంగా చేసేది ఎవరు? తప్పక
  మనవారు శాస్త్రాల్లో చెప్పిన నిరాకార జ్యోతిర్బిందువు ఈయన జనన మరణ చక్రం లోకి రారు ఆజన్మ అభోక్త
  కాని విదేశీయులల విదేశీయుల్లా ఆకాశం నించే అన్నీ చేసేస్తాడు అని చెప్పడం లేదు ఈయన తప్పక
  మనుష్య శరీరం లో వచ్చి పాత్ర చేస్తున్నారు అది భారత వాసీయులు గురుతు పట్టారు ఎందుకంటె
  పవిత్రత కు విలువ ఇచ్చే భారత దేశం లోనే అయన వస్తారు భగవంతుడి జన్మ స్థలం భారత దేశం
  ఇక్కడ స్త్రీలకు యెంత విలువ ఇస్తారో అంత మరి ఎక్కడా ఇవ్వరు ఇక్కడ విడాకులు తీసుకుని
  భార్య బిడ్డలకు అన్యాయం చెయరు. ఇప్పుడిప్పుడు విదేశీయుల ప్రభావం లోకి వెళ్లి విడాకుల ప్రధ
  వచ్చి పడింది కనుక ఇంతకూ చెప్పేది ఏమంటే పవిత్రత కు విలువ ఇచ్చేది భారత దేశం మాత్రమె
  మరి మన దేశం లోనే భగవంతుడు వస్తారు అని. పంచముఖి బ్రహ్మలో ప్రవేశించి వారిని విష్ణువు గా
  నరుడి(బ్రహ్మ) నుంచి నారాయణుడిగా చేసేవారు అని తెలుసుకో వలసిన విశయమ్ కద.
  గీతలో దేవతలలో ఫలానా నేను మనుష్యులలో ఫలానా నేను పక్షులలో ఫలానా నేను జంతువులలో ఫలానా
  నేను అని చెప్పినది ఎవరు ఆ నిరాకార పరంజ్యోతి అయన పాత్ర అతి విలక్షణం పాత్ర చేస్తూనే చేయరు
  అన్ని అవయవాలు ఉన్నా లేనట్లే ఒక శివ లింగం అందుకే గురుతుగా మనం పూజ చెస్తాము.
  ఎవరిలో వచ్చారో ఆయననే మనం కృష్ణుడు అని రాముడు అని పిలుస్తున్నాము. ఒకే శరీరం లో
  మూడు ఆత్మలు ఒకరు శివుడు ఒకరు రాముడు ఒకరు కృష్ణుడు రాముడికి కృష్ణుడికి జనన మరణాలు
  ఉన్నట్లు చెప్పారు మరి శివుడికి చెప్పలెదు. దీనిని అర్ధం చేసుకోవాలి ఏమంటే శివుడు డైరెక్టర్ వెనుక ఉండి
  నడిపించేవారు ముందు మనకు కనిపించేది రామ కృష్ణ ఆత్మలు వీరే సృష్టికి మాతా పితలు ఇదంతా
  ఆధ్యాత్మిక ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ద్వారా స్వయం పరమ పిత పరమాత్మ చెప్పిన జ్ఞానం
  మీకు సవినయం గా ఏమి మనవి చేసుకున్తున్నానంటే బాగా పరిశీలిస్తారని.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పినది ఆలోచించదగినదే. తప్పకుండా మీరు చెప్పినవి పరిశీలిస్తాను రమ గారు.

   Delete