Monday, June 3, 2013

లేచిపోవడంలో ఉన్న మజా! అనుభవించితే తెలియునులే!లలలాం...లలలాం...లలా...

                                                                       


   ఈ రోజు పేపర్లో ఒక మాటర్ చూశా!నగరాల్లో, కలిగిన తల్లితండ్రులు  తమ అమ్మాయిలు కనిపించాడం లేదని పిర్యాదు చేయటం ఈ మద్య ఎక్కువుగా జరుగుతుందట! ఎదైనా అమ్మాయిల విషయంలో జాగర్తగా వ్యవరించాల్సిన అవసరం అటు తల్లి తండ్రులకు, ఇటు పోలిసులకు ఉంది కాబట్టి, సాద్యమైనంత వరకు అమ్మాయిల మిస్సింగ్ కేసులు సీక్రెట్ గానే దర్యాప్తు చేయబడతాయి.

   అమ్మాయిల మిస్సింగ్ ల కేసులలో నూటిక్ తొంబయి వంతులు,ఇష్ట పూర్వకంగా  లేచిపోయిన బాపతేనట! అందులో డెబ్బయి  శాతం కొంకాలం జాలీగా గడిపాక తిరిగి ఇంటికి బుద్దిగా తిరిగి వచ్చి, తల్లితండ్రులు చూశిన వరుల ముందు తలవంచుకుని తాళి కట్టించుకుంటునారట!మిగతావారి సంగతి ఆ దేవుడికే ఎరుక! ఇలా లేచిపోతున్న వారిలో అదిక సాతం విద్యార్ధినులు, ఉపాది కోసం పల్లెటూళ్ల నుండి వచ్చిన వారు అధికంగా ఉన్నారట!మితిమీరిన సెల్పోన్ వినియోగం, సామాజిక వెబ్సైట్లు అంటే పేస్ బుక్ లో ఖాతాలు, చాటింగ్ లు ఇవన్ని లేచిపోవడానికి, లేపుకుపోవడానికి కారణాలవుతునా యని సామాజిక వాదుల పరిశిలనలో తేలిన అంశాలు.

   మన సమాజంలో "డేటింగ్" ని అంగీకరించం. కాని లేచిపోవడాన్ని ఆపలేని దౌర్బాగ్య పరిస్తితిలో ఉన్నాం. పద్దెనిమిదేళ్లు నిండితే,లేచిపోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. హాయిగా అన్ని అనుభవాలు పొందాక "చీ" వీడితో జీవితం వేస్ట్ అనేసి ఇంటికి వచ్చిన పిల్లలను గప్ చుప్గా కాని కట్నం మరింత ఇచ్చయినా కాని "కన్యా దానం(?) " చేసేస్తుంటారు తల్లి తండ్రులు. పాపం వారికి లేపుకు పోయిన వారిమీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం చట్టం ఇవ్వలేదు మరి!కొంత మంది అయితే ఇదంతా వయసు చేసే పొరపాట్లు, విదేశాలలో "డెటింగ్" ఉంది కాబట్టి పిల్లలు తమకు నచ్చిన వరిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది, డర్టీ ఇండియాలో అది లేదు కాబట్టి దాని బదులు "లేచిపోయి" పరీక్షించుకుంటునారు అంటున్నారు. నిజమే మరి! పూర్వ కాలంలో పెండ్లి పెద్దల ఇష్టం కాబట్టి,ఏ టెస్ట్ లు లేకుండానే పెళ్లిలు చేసుకునే వారు. మరి ఇప్పుడు పిల్లల ఇష్టమే కాబట్టి వారు కొంత కాలం ఒకరి నొకరు అర్థం చేసుకోవదూ! అందుకే "లేచిపోవడం" అన్న మాట! అన్న మాటేమిటి, ఉన్నమాటే!

  అటు ప్రభుత్వం వారు కూడ యువతరానికి "డేటింగ్" స్వేచ్చ ఉండాలనే బావిస్తుండవచ్చు! కాకపోతే చాదస్తపు పెద్దలు, ఆ మాటంటే నాన నానా యాగీ చేసి, ప్రబుత్వాలను దించి వేస్తారనే బయంతోనో, లేక ఆ కారణం తో మత వాద పార్టిలు ఎక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకుంటాయో అన్న బయంతో ఇలా ఇండైరెక్ట్ గా " పద్దెనిమీదేళ్ళు" వయో పరిమితి పెట్టి, యువతకు ఆ తర్వాత ఫుల్  స్వేచ్చ నిచ్చింది కాబట్టె, ఈ విదంగా "డేటింగ్" లు బదులు "లేచిపోయింగ్" లు ఎక్కువవుతుండవచ్చు!

   ఇక పోలిస్ వారేమో లేపుకుపోయే వారిని చట్ట ప్రకారం మేమేమి చెయ్యలేము, మీ పిల్లల్ని జాగర్తగా కాపాడుకోవడం మీ బాద్యత అని తల్లితండ్రులకు ఉచిత సలహాలు పడేస్తుంటే, చెసేదేమి లేక పాపం తల్లితండ్రులు తిరిగివచ్చిన తమ బిడ్డల్ని "పరువు హత్యలు" చేసే దుష్ట సాంప్రదాయం మనది కాదుకనుక "కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని" ఎవరి కాళ్ళో పట్టుకుని వారి కాళ్ళు కడిగి, "కన్యా దానం " బదులు "కాంతా దానం" చేసి అటు పరువుని ఇటు పిల్లల్ని కాపాడుకుంటునారు.

  ఓ లేచి పోయే  యువతీ యువకులారా! ఒక్క సారి ఏదయినా ఎంట్రన్స్ టెస్ట్లు జరుగుతున్న సెంటర్ క్ వెళ్ళి చూడండి. లోపల పరీక్ష రాసేది ఒకరైతే,  బయట మీ మీద ప్రేమాభిమానాలతో, మీకేరీర్ కోసం, నాలుగు కళ్ళు ఎంత ఆత్రంగా చూస్తుంటాయో! వారేరా తల్లి తండ్రులు! నిత్యం మీకోసం తపించిన ఆ తల్లితంద్రుల అనుమతి మీ పెండ్లికి అవసరం లేదా? అంత క్రుతజ్ణుల గా ఎలా మారి పోతున్నారు? పాపం తల్లితండ్రులను ఈ దౌర్బాగ్య పరిస్తితి నుండి కాపాడే వారెవ్వరు?      


                                                          

No comments:

Post a Comment