Sunday, June 23, 2013

వెర్రెక్కిన విజ్ణానం ఆనకట్టలు కడితే, చిర్రెత్తిన ప్రక్రుతి, చీల్చి చెండాండింది.

                                                                    
                                                               
  మనిషి. ఆఫ్ట్రాల్ ప్రక్రుతిలో అన్ని జీవరాసులతో పాటు వాడూ ఒకడు. ఈ మద్యనే వాడికి విజ్ణానం అబ్బిందట! అంతే అజ్ణానంగా పొంగిపోయి ముందూ వెనుక కానక ప్రక్రుతినే ద్వంసం  చెయ్యడం మొదలు పెట్టాడు. వాడు ఒక పక్క దేవుళ్ళను, ప్రక్రుతిని కొలుస్తాడు. ఇంకొకపక్క ఆ ప్రక్రుతి ఆజ్ణ నే మీరతాడు. అదేమిటంటే అంతా తన చేతిలోనే ఉందంటాడు. ప్రక్రుతి గమనాన్ని మూడురోజులు ముందు కనిపెట్టలేని వాడు ప్రక్రుతి రహస్యం తెలుసంటాడు. ప్రక్రుతి కూడ సామాన్య మానవుల మాదిరి బల హీనమనుకుంటాడు. అందుకే అది నన్నేమి చేస్తుందిలే అని దీమా ఒలక పోస్తుంటాడు.వాడి పొగరును అప్పుడప్పుడు ప్రలయ విపత్తు రూపంలో అణచివేస్తున్నా బుద్ది తెచ్చుకోడు.

  చార్ దాం అనే ప్రాంతాలు సుందర ఆద్యాత్మిక క్షేత్రాలు. మనిషికి ఈ లౌకిక బాదలను మరచిపోయేలా  అలౌకిక ఆనందం ఇవ్వగల్గిన క్షేత్రాలు. అటువంటి క్షేత్రాలు ఉన్నా కేదార్నాద్, బదరీనాద్, గంగోత్రి, యమునోత్రి, ప్రాంతాలకు బారత దేశం నలుమూలల నుండి వచ్చే లక్షలాది యాత్రీకుల ద్వారా "ఉత్తరాకాండ్" రాష్త్రం కోట్ల ఆదాయం పొందుతుంది. కాని ఆ ఆదాయ వనరులు చాలక అంతులేని అక్రమ పద్దత్తుల్లో, అవినీతికి పాల్పడి, నదీ ఒడ్డు ప్రాంతంలో నిబందనలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చి, గొప్ప తప్పిదం చేసింది. దీని వలన అనేక అంతస్తుల భవనాలు నది ఒడ్డుల మీద ప్రత్యక్షమయ్యాయి. అంతేనా అభిరుడ్డికోసం కరెంట్ అవసరమని ఎక్కడపదితే అక్కడ జల విద్యుత్ ప్రాజెక్ట్ లు కట్టారు. ఈ విదంగా నదుల సహజ గమన్నాన్ని అడ్డగించారు. ఉత్తారాకాండ్ రాష్ట్ర అభిరుద్ది పేరుతో అంతులేని అవినీతికి పాల్పడ్డారని చెపుతున్నారు.

   అసలే గంగమ్మా ! అనుగ్రహమ్ ఉన్నంతసేపు ప్రజలను  తన బిడ్డలవలే కాపాడుతుంది.కన్న  తల్లి అయినా సరే, మామూలుగా స్తన్యమ్ త్రాగే బిడ్డకు ఆనందంగా ఇస్తుంది. అదే దుందుడుకు బిడ్డలు కొరికితే ఒక్క చరుపు చరచి దారిలో పెడుతుంది. అదిగో అటువంటి  చరుపే మొన్న గంగమ్మా తల్లి, ఉత్తరాకాండ్లో చరిచింది. ఇప్పటికైనా పాలకులు దుందుడుకు చేష్టలు మాని పర్యావరణ వేతలు, ఏమి చెపుతున్నారో ఆలకించి ఆ ప్రకారం బుద్దిగా మసలుకోవటం మంచిది. ప్రజలు కూడ  అలా మసలుకునే వారినే ఎన్నుకోవటం మంచిది. అసలు చార్ దాం ప్రాంతాన్ని "పవిత్ర ప్రాంతం" గా ప్రకటించి, రాజకీయ జ్యోక్యం లేకుండా చేయాలి.

  ఉత్తరాకాండ్  రాజకీయ నాయకుల, అధికారుల స్వార్ద ప్రయోజనాలకు  పాపం దేశం లోని  వివిద ప్రాంతాల  భక్తులు ప్రాణాల రూపం లో మూల్యం చెల్లించారు. తక్షణమే వారందరికి ఉత్తరాకాండ్ రాష్ట్ర ప్రబుత్వం, మరియు కేంద్ర ప్రబుత్వాలు మనిషికి పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. తక్షణమే దెబ్బ తిన్న ఆద్యాత్మిక క్షేత్రాలను తిరిగి పూర్వ విదంగా పునరుద్దరించాలి. కనీసం మనుషులుగా ఆ పనైనా చేస్తారని ఆశిద్దాం.  

No comments:

Post a Comment