Thursday, June 27, 2013

ఇడుగిడుగో వీడే!ఉత్తరాకాండ్ విలయానికి కారకుడు, వ్రుత్రాసురుడు!.


                                                              

 వీడే!వ్రుత్రాసురుడు




  వీడు పుట్టక ముందు అది నిజంగా దేవ బూమే. ఏదో దైవ దర్శనం చేసుకుని అక్కడి ప్రక్రుతి రమణియతను ఆస్వాదించి, అది తమ చిరకాల మదుర స్మ్రుతిగా దాచుకుందామనే తలంపుతో వెళ్ళే భక్తులు, యాత్రీకులు తప్పా వేరే తలంపే ఉండేది కాదు. కాని రాను రాను రోజులు మారాయి. మనిషి విజ్ణానం అభిరుద్ది చెందాక పుట్టిన "వ్రుత్రాసురుడు"  వీడు. వీడిని వ్రుత్రాసురుడు అని ఎందుకంటున్నాను అంటే  పూర్వం వేద కాలం లో వ్రుత్రాసురుడు అనే రాక్క్షసుడు ఉండే వాడట. వాడు పర్వత ప్రాంతంలోనే ఉండే వాడు. వాడి వల్ల మేఘాలలో నుండి వచ్చే  నీరు బందింపబడి పశువులకు, మనుషులకు లభించేది కాదట. అప్పుడు ప్రజలంతా ఇంద్రుడిని ప్రార్దిస్తే, ఇంద్రుడు తనకు "త్వష్ట" అనే రుషి ఇచ్చిన "వజ్రాయుదం" సహాయం తో "వ్రుత్రాసురుడిని " సంహరించి, బందించి ఉన్న నీటిని విడుదల చేసి, సకల ప్రాణకోటికి అనందం కలిగించాడట!. ఇంద్రుడు అటు వ్రుత్రుడితో పాటు "సర్పం" లా ఉండే అహి అనే రాక్షసుడిని వదించాడని కద!.

  పూర్వ కాలం లో మన పెద్దలు చెప్పిన కద లన్నీ ప్రతీకాత్మ మైనవే. ఆ కాలంలోనే పర్వత ప్రాంతం లో ఉండే నదులను క్రిందకు వెల్లకుండా ఆ ప్రాంత రాజకీయ నాయకులు ఆనఖట్టలు కడితే అట్టి ఆన కట్టలు వల్ల ప్రక్రుతి సమతుల్యత దెబ్బ తినడమే కాక క్రింది ప్రాంతం వారికి నీరు లబించేది కాకపోవచ్చు. అహి అంటే పాము ఆకారం లో ఉండే రాక్షసుడు అన్నారు అంటే అది ఆనకట్ట కావచ్చు. దానిని నిర్మించడానినికి ఉపయోగపడే వ్రుత్రాసురుడు అంటే ఒక పెడ్డ  J.C.B      లాంటి యంత్రం కావచ్చు. కాబట్టి ప్రజలకు మేలు కలగాలంటే పైనున్న నీరును విడుదల చెయ్యడం ఒక్కటే మార్గం కాబట్టి ప్రజల రాజు ఇంద్రుడు తన దగ్గర ఉన్న శక్తివంతమయిన ఆయుడంతో ఆ బయంకర యంత్రం నాశనం చెయ్యడమే కాక ఆనకట్టను తెరిపించి నీటిని క్రిందకు పారించి ఉంటాడు.

 ఇక్క పోతే ప్రస్తుతం వాస్తవంలోకి వస్తే పై  J.C.B    గాడు పుట్టాక, నదులులో ఇసుక చట్ట వ్యతిరేకం  గా లోతుగా త్రవ్వి  పారవేసారు. ఎనిమిది మీటర్లు ఇసుక పొర ఉన్న చోట రెండు మీటర్లు మాత్రమే త్రవ్వాలి. అది రూలు. కాని  కాసులు తీసుకుని కళ్ళు మూసుకున్న అధికారుల అండతో విచక్షణా రహితంగా బూమి పొర తాకేదాక   J.C.B      యంత్రాల సహాయంతో కాంట్రాక్టర్లు ఇసుకను తోడి వేసారు. అలా త్రవ్విన ఇసుకతో దేవ బూమిని కట్టడాలతో వ్యాపార  వాణిజ్య సముదాయలతో నింపివేసారు. ప్రజా వలసకు కారణమయి అక్కడి ప్రక్రుతి వనరుల ద్వంసానిక్ కారణ బూతులయ్యారు. నదీ ఒడ్డునే అక్రమ కట్టడాలు కట్టారు. దీనంతిటికి కారణం  వ్రుత్రా సురుడు అనే  J.C.B   లాంటి   మెచిన్ మాత్రమే.

 ఇంకే ముంది అప్పటి దాక ఇసుకలో ఇంకుతూ నెమ్మదిగా ప్రవహించే వరద ఒక్క సారిగా ఒత్తిడికి లోనై, బీకరంగా మారి వెల్లువై చుట్టు ప్రక్కల ఉన్నవాటిని ద్వంసం చేస్తూ పరుగులు తీస్తుంతే ఆ దాటికి పాపం దేశం నలుమూలల్ నుండి వచ్చిన బక్తులు క్కొట్టుకు పోయారు. ప్రక్రుతిని ద్వంసం  చేసింది యంత్రమే అయిన దానిని స్రుష్టించిన మనిషి శిక్ష అనుబవించాడు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ప్రక్రుతి ద్వంసం ఆపుచేస్తే మంచిది లేదా ఉత్తరాకాండ్ లో జరిగింది బారతావని మొత్తం జరిగి తీరుతుంది.

 ప్రబుత్వం వారు ఇప్పటి కైనా  J.C.B    మెచిన్ లాంటి బారీ యంత్ర వినియోగం పైన నియంత్రణ విదిస్తూ చట్టం చెయ్యడమే కాక దాని అమలుక్కు నడుం బిగించాలి. అక్రమ ఇసుక దందాలను తక్షణమే నీరోదించాలి.అక్రమ కట్టడాలను నిర్దాక్షినంగా కూల్చి వేయాలి. లేకుంటే "ఇంద్రుడు"(పర్యావరణ శక్తి)  రావడం  ఖాయం అన్నింటిని నాశనమ్ చెయ్యడం ఖాయం!.      
                                               

ప్రక్రుతిని ద్వంసం  చేస్తున్న వ్రుత్రాసురుడు  

               

No comments:

Post a Comment