Wednesday, June 19, 2013

కే.సి.ఆర్. మార్క్ తెలంగాణా రాకున్నా, కాంగ్రెస్ మార్క్ "ప్యాకేజి"వస్తుంది!


                                                                  

  వచ్చే ఎన్నికల లోపు తెలంగాణా ఇవ్వగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. బి.జె.పి. వారు ఎన్ని హామీలు గుప్పించిన వారు అధికారం లోకి వచ్చిన తర్వాతే సాద్యం, కాబట్టి ఎన్నికల వరకు  వారు చెయ్యగలిగింది ఏమి లేదు.తెలంగాణా మీద ఏమి తేల్చకుండా ఎన్నికలకు సిద్దపడే దమ్ము అధికార కాంగ్రెస్ కి లేదు.అలా చేస్తే,తెలంగాణాలో ఆ పార్టీ అడ్రెస్ లేకుండా పోయే ప్రమాదముంది. పోని తెలంగాణా డిక్లేర్ చేదామా అంటె ప్రాంతీయ కుంపట్ని ఎగదోసి జాతీయ స్తాయిలో పొగపెట్టుకోవడం పెద్ద తలకాయ నొప్పి.ఇక మిగిలింది తెలంగాణా వాదులను ఊరడింపచెయ్యడానికి ఏదో ఒకటి తక్షణమే చెయ్యాలి కాబట్టి కోర్ కమిటి ఈ విషయంలో హడావుడి చేస్తుంది.

  ప్రస్తుత తరుణంలో "తెలంగాణ"కు బారీ "ప్యాకేజి" ఒకటి ప్రకటించి అది తమ పార్టీకి తెలంగాణా మీద ఉన్న ప్రేమ అని చాటుకోవాలని చూస్తుంది. ఇప్పుడు తెలంగాణా ఇస్తే ఖచ్చితంగా ఆ క్రెడిట్ కే. సి.ఆర్. పార్టికే దక్కుతుంది కాబట్టి అలా కాకుండా ప్యాకేజి ప్రకటిస్తే ఆ క్రెడిట్ తమ పార్టీ కొట్టేయొచ్చు అని పార్టిలోని తెలంగాణా వాదులకు నచ్చచెప్పి పార్టీలోనుండి టి.ఆర్.యస్ కి వలసలను కట్టడి చేస్తుంది. అటు రాష్ట్రం విబజించటం లేదు కాబట్టి సమైక్య వాదులను సంత్రుప్తిపరచినట్లవుతుంది.ఇన్నాళ్ళు చేసిన ఉద్యమాలకు ఏదో ఒక బారీ ప్రతిపలం పొందాం కదా అని తెలంగాణా ప్రజలను బావించేలా చేసి కాంగ్రెస్ వారి ఓట్లు చీలకుండా జాగ్రత్తపడుతుంది. అలా ఒక బారీ ప్యాకేజితో కే.సి.ఆర్.కి ఉన్న అన్ని అవకాశాలను దెబ్బ కొట్టడానికి సమాయత్తమవుతుంది అధికారపార్టీ.పనిలో పనిగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేసి తెలంగాణా వీర వాదులకు కొన్ని పదవులు ఇవ్వవచ్చు. ప్యాకేజిలో కూడా తెలగాణా ప్రాంతానికి ఎన్నికల తర్వాత పార్టి గెలిస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తాననవచ్చు. ఇక ఇంతకు మించి అధికార  కాంగ్రెస్ తెలంగాణా వారికి ఏమి కావాలి?

   ఈ దెబ్బతో కే.సి.ఆర్. మార్క్ తెలంగాణా రాకున్నా, కాంగ్రెస్ మార్క్ ప్యాకేజి రావడం ఖాయం.     

No comments:

Post a Comment