Tuesday, June 18, 2013

"తెలంగాణా ఉద్యమం " వల్ల లాభపడుతున్న ఆంద్రా విద్యా సంస్తలు!


                                                              
                                                               
  తెలంగాణా వచ్చుడు ఎప్పుడో తెలియకున్నది. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అని ఊదరకొట్టిన అధికారపార్టీ నాయకులు" ఇక ఈ పార్టీ వల్ల కాదురా భయి" అని చెప్పి ఆశతో  కే.సి.ఆర్. పార్టిలో చేరుతున్నరు. ఇక కే.సి.ఆర్. గారైతే తెలంగాణా ఇవ్వకుంటే దంచుడు ఖాయమ్ అని అప్పుడప్పుడు గర్జిస్తున్నరు. తెలంగాణా లో ఉన్న ఓ.యు. విద్యార్దులు తెలంగాణా కోసం" తెగించి పోరాడండి" అని పిలుపులిస్తూ అడపా దడప బళ్లు బందు పెడుతుంటే, మన పోరగాళ్ల చదువులు గిట్లయితే గెట్ల అని తల్లితండ్రులు ఒకటే హైరానా పడుతుండ్రు.

  నేను ఆ మద్య విజయవాడ పోయేందుకని రైలెక్కినా. అది ఆదివారం . బండంతా చాలా రష్ గా ఉండె. ఇదేంట్రా ఆదివారం కూడా ఇంతా రష్ ఉందని ఆలోచిస్తూ పక్క పాసింజర్ని అడిగినా అందరూ ఏడికి పోతున్నరు అని. ఆయన నన్ను పిచ్చోడ్ని చూసినట్లు చూశి అన్నడు.
 ఇవాళ ఆదివారం కాద్ద? అని అన్నడు.

 అయితే ఏంది అన్నా.

  పిల్లలకి" ఔటింగ్ " అన్నడు.

 అంటే ? అన్నా తెల్లముఖం వేసుకుని.

  ఆయన నా వంక జాలిగా చూసి విషయం చెప్పిండు. విజయవాడలో తెలంగాణాకి చెందిన అన్ని ప్రాంతాల  నుండి సుమారు లక్ష మంది పిల్లలు, ఇంటర్ చదువుల కోసం చేరారు. వారిని చూడలంటే నెల కొక సారి వీలును బట్టి, ఆదివారం ఔటింగ్ ఇస్తరు. ఆ రోజున తల్లి తండ్రులు వెళ్లి,తమ పిల్లల్ని బయట తిప్పి వారికి కావల్సినవి కొని ఇచ్చి, సాయంత్రం తిరిగి కాలేజీలో దిగపెట్టి వస్తుంటారట.అందుకని ప్రతి ఆదివారం ఏవో కొన్ని కాలేజిలు ఔటింగ్ ఇస్తాయి కాబట్టి, తెలంగాణ నుండి వచ్చే తల్లితండ్రులతో రైళ్లు రద్దీగా ఉంటాయట!

  అదేమిటి, హైద్రాబాద్ ఇంకా ఇతర పట్టణాల్లో మంచి కాలేజీలు ఉండగా ఇంటర్ కోసం విజయవాడ  రావడం ఏమిటి? అని మరింత అమాయకంగ అడిగిన.

  ఎన్ని మంచి కాలేజిలు ఉన్నా, ఎప్పుడు నడుస్తాయో, ఎప్పుడు బందవుతాయో తెలియని పరిస్తితుల్లో అక్కడ చదివించడం కష్టమనే, ఇల్ల లక్షలు ఖర్చు పెట్టి, ఇక్కడ చదివిస్తున్నం.అనాడు.

  మరి లక్షలు ఖర్చు పెట్టలేని వారి పరిస్తితి ఏమిటి? అని అడిగిన.

 దానికి ఆయన చేతులు పైకెత్తి అంతా ఆ పరమత్మ కెరుక అన్నడు. అంటే తెలంగాణా ఉద్యమం వల్ల, సామాన్య విద్యార్ది నష్టపోతుంటే, ఆంద్రా విద్యా సంస్తల యజమానులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్న మాట. ఔరా! తెలంగాణా రాకూడదూ, అలా అని చెప్పి తెలంగాణ ఉద్యమం ఆగకూడదు. ఇది ఆంద్రా విద్యా సంస్తల యజమానుల బావన!
  తెలంగాణా ఉద్యమమ్ జిందాబాద్! ఆంద్రా విద్యా సంస్తలు జిందాబాద్! 

1 comment:

  1. వాస్తవాలు రాసారు... ఇది గత నాలుగేళ్ళుగా జరుగుతున్నదే.... అక్కడ పిల్లలు ఇక్కడకు రావడం వలన సరి అయిన వసతులు కల్పించడం లో కాలేజీలు కూడా విఫలం అవుతున్నాయి. పిల్లలు ఇరుకు గదులలో మగ్గిపోతున్నారు.

    ReplyDelete