Thursday, May 9, 2013

తిరుమలలో జై కొట్టొచ్చు, సుప్రీంకోర్టులో జై కొట్టాలంటె కుదురుద్దా!?.


                                                                         

                                                                  
  ఒక సారి వై.యస్.ఆర్.పార్టీ అదినేత, శ్రీ జగన్ గారు తన మందీ మార్బలంతో, తిరుమల కొండకు వెళ్ళారు. ఆయన మతరీత్యా హిందూయేతరుడు. కాని ఇతర మతాలకున్న అలౌకిక తత్వం హిందువులకు లేదు కాబట్టి, ఆయన ఆ పవిత్ర గిరి మీద,ఆ దేవదేవుని సన్నిదిలో, తన అనుచరగణంతో  జైజగన్ జై జై జగన్ అనిపిస్తూ, రాజాది రాజు సంచరించినట్లు హల్ చల్ చేశారు. సరే ఆ రోజు అక్కడ ఉన్న అధికారులెవ్వరికి దీని మీద చర్యలు తీసుకునే దమ్ములు లేక పోయినవి.

  ఇక తిర్మలేశ్వరుడు కూడా, అన్ని మతాల బిడ్డలు తన బిడ్డలే కాబట్టి, బిడ్డలు తనను ఖాతరు చెయ్యక పోయిన కోపగించ్కోవడం తండ్రి దర్మం కాదు కాబట్టి,అక్కడ అంతా సాజావుగానే అనిపించ వచ్చు. కాని హిందూసోదరుల మనోబావాలు దెబ్బతింటాయని సదరు నాయకులు తెలిసికోకపోవడం విచారకరం.

  మొన్న సుప్రీం కోర్టులో అదే నాయకుడి బెయిల్ విషయం మీద వాదనలు జరిగాయి. మన రాజ్యాంగం ప్రకారం జై కొట్టే జనం బలం చూసి కాక , ఒక్కరు చెప్పినా, వాదనలు  బట్టె మన కోర్టులు న్యాయా న్యాయ నిర్ణయం చేస్తాయి కాబట్టి, కోర్టులో అనుచరులు జై కొట్ట లేకపోయారు. ఇక న్యాయ వాదులు కూడా, సి. బి.ఐ. వారి మీద అప వాదులు మోపే సరికి, చిర్రెత్తుకొచ్చిన సి. బి.ఐ వారు ఒక ఇంటర్నేషనల్ లెవల్ క్రైమ్ ని సాదరణ క్రైం లాగ పరిమితి గడువులో దర్యాప్తు ముగించాలంటే మానవ మాత్రులైన తమ వల్ల కాదు, ఆయనకు బెయిల్ ఇస్తే దర్యాప్తు కష్టం అనే సరికి అత్యున్నత న్యాయ స్తానం వారు మాత్రం ఏమి చెయ్య గలుగుతారు. అందుకే మరో నాలుగు నెలల గడువు సి.బి.ఐ. వారికి ఇచ్చే సరికి సదరు నాయకుడు, వారి అనుచర గనం జై కొట్టలేక, దిగాలుపడిపోతున్నారు.

  పోని కాంగ్రెస్ వారితో, ఎమైనా చేయి కలిపి సి.బి.ఐ. వారి ఫోర్స్ తగ్గిదామా అని చూస్తే ఆ దేవునికి ఇది కూడా ఇష్టం లేనట్లుంది, సి.బి.ఐ వారికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చేలా చట్టం చెయ్యాలి అని, ఇందుకు జులై నెల దాక,కేంద్ర ప్రబుత్వానికి  సుప్రీం కోర్ట్ గడువు విదించింది. కాబట్టి వాస్తవ పరిస్తితుల మీదే జగన్ ఆదారరపడితే మంచిదేమో, రాజకీయ బలంతో జనం నోళ్ళు తెరిపించి,అధికారుల నోళ్లు నొక్కుదామనుకుంటే కోర్టులు చూస్తూ కూర్చోవు. ఒక వేళా అటువంటి పరిస్తితులే వస్తే భగవంతుడు చూస్తూ ఊరుకోకపోవచ్చు.     

No comments:

Post a Comment