Wednesday, May 22, 2013

లక్షలు పోసి, డాక్టర్లు అయినోళ్లు, చచ్చినోళ్లకు కాక, బ్రతికున్నవారికి వైద్యం చేస్తారా!?

                                                       

                                                                    

  మన వైద్యులు 50%  మంది ప్రతిబ ఆదారంగా, మిగతా 50% శాతం మంది మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు పోసి మరీ వైద్య పట్టాలు కొనుగోలు చేస్తున్నారు.  ఈ విదంగా లక్షలు ఖర్చుపెట్టిన వారికి, ఆ డబ్బు వడ్డీతో సహా ఎలా గుంజుదామా అనే ఉంటుంది కాని,రోగులు, వారి రోగ నివారణ  పట్ల శ్రద్ద ఎందుకుంటుంది?.

  మొన్న మన రాష్ట్రంలోనే చనిపోయిన వ్యక్తికి చికిత్స పేరుతో వైద్యం చేసినట్లు నటించి వేల రూపాయలు కాజేస్తే, విషయం తెలుసుకున్న మ్రుతుని బందువులు లబో దిబో మంటూ, డాక్టర్ల మీద పోలిస్ కేసు పెట్టారు. నిజంగా వారు చదుకున్న వారేనా? అదీ ఒక పవిత్రమయిన వైద్య వ్రుత్తిలో ఉండి ఆ విదంగా చెయ్యడానికి వారికి సిగ్గు ఎలా అనిపించ లేదో? ఒక వైద్యుని తయారు చెయ్యడానికి ఎవరు ఎంత ఖర్చు పెట్టినా, వైద్య విజ్ణానం ఎవడబ్బ సొత్తు కాదు. అది మహానీయుల కఠోర శ్రమ పలితం. తరతరాలుగా పెంపొంధిచుకుంటూ వస్తున్న సామాజిక సొత్తు. దానిని డబ్బున్న వారికి అమ్మడం నిషిద్దం. అందుకే వెనుకటి కాలంలో గురువులు, మానవత్వం కలిగి, సమాజానికి ఉపయోగపెడతారు అనే వారికే ముఖ్య మైన శాస్త్ర విజ్ణానం బోదించే వారు. మరి ఈనాడు ఒక M.B.B.S   సీటు సుమారు యాబయి లక్షల నుండి కోటి రూపాయల వరకు అమ్ముకుంటున్నారు అంటే తప్పు ఎవరిది? ఇలా సీట్లు కొనుకుని వైద్య శాస్త్రం అభ్యసించిన వారు,చచ్చినోళ్లకు కాక బ్రతికున్నోళ్లకు వైద్యం చేసే ప్రతిభ ఉంటుందా?

   సంవత్సరానికి ఒక సారి అది ఉచితంగానే, తాము నమ్మిన వైద్యం, ఎవరికి హాని లేనటువంటిది అని రుజువు కాబడ్డ "బత్తిన సోదరులు" ఇచ్చే చేప మందు వంటి వాటి గురించి గగ్గోలు పెట్టే విజ్నానులకు ఈ శాస్త్రీయా వైద్యులు చేసే మోసాలు కనపడవా? కనపడకపోవచ్చు మరి!   

2 comments:

  1. వాళ్ళు అంత ఖరుచు పెట్టి చదివి తిరిగి సంపాయించుకొనే సమయంలో ఊరికే మందు ఇస్తామని బత్తిన సోదరులు అంటుంటే కోపం రాదా. అందుకనే తమ అజ్ఞాన వేదిక సైన్యాన్ని వారి మీదకు తోల్తారు. ఇలా ఎగేసుకొని దేశీయ వైద్యం వారిమీద పడిపోయే ఈ అజ్ఞాన వేదికవారి దృష్టి, గాట్టిగా కళ్ళుమూసుకొని ప్రార్ధిస్తే రోగాలు తగ్గించేవారి మీద ఎందుకనో పడదు.

    ReplyDelete
  2. Donation batch is better than reservation batch sir..

    ReplyDelete