Wednesday, May 8, 2013

బాబూ! ఒక్క సారి అమ్మా అంటే, అడ్డమైన చాకిరీ చేసి పెడతా!

                                                                                                                                  

                                                                             ఇది పాపం అమ్మ కాని ఒక అమ్మ యొక్క అవేదన! ఆంద్రుల అరాద్య దైవం, మహా నటుడు ఆయన. పాపం ముసలితనంలో సహ దర్మ చారిణి, కాల దర్మం చేస్తే, గంపెడు మంది సంతానం ఉన్నా, చూసే దిక్కులేకపోయింది ఆయనకి. ఆ దశలో ఆయన గారి జీవిత కథ రాయడానికని వచ్చిన స్త్రీ, గత్యంతరం లేని పరిస్తితిలో అంటే ఆరోగ్యం దెబ్బతిని నా అన్న వారు చూసే ప్రాప్తం లేని విపత్కర పరిస్తితిలో, అటు కుటుంబానికి, ఇటు అభిమాన ప్రజల్కు అందరికి చెప్పి, ఆ జీవిత చరిత్ర రాయడానికి వచ్చిన ఆమేను జీవన సహ చరి గా చేసుకున్నాడు. ఇది ఆయన నమ్మి ఆచరించాలనుకున్న హిందూ ధర్మ జీవన విదానానికి వ్యతిరేక మైనా ఆయనకు తప్పని స్తితి.

   సరే ఆయన ద్వితీయ వివాహం చేసుకోవడం కుటుంబ సబ్యులకు ఇష్టం ఉన్నా, లేకపోయినా వారి వారి పర్సనల్ పనుల బిజీలో ఆయన బాద్యతలు చూసే తీరిక ఎవరికి లేక పోవడం వలన కాబోలు కిమ్మన్నకుండా ఉన్నారు. తర్వాత ఇంట్లో సమస్యలు, పార్టీ సమస్యలుగా మారి, అదికార పంపిణీలో బేదాబిప్రాయాలు రావడంతో ఆయన్ని, ఆమెకు వదిలేసి పార్టీని కుటూంబ సబ్యులు హస్తగతం చేసుకున్నారు. ఇంతలో పాపం ఆ పెద్ద మనిషి ఆ మనాదితోనే కాల దర్మం చేసారు. ఆమె పాపం ఒంటరిదైంది.

  ఆమేకు అంతకు ముందు వైవాహిక జీవితం ఉన్నా,తద్వారా కలిగి బాందవ్యలు ఉన్నా, తన ఆరాద్య దైవం యొక్క కుటుంబం అంటేనే మక్కువ ఎక్కువట! వారి నుంచి అమ్మా అనే పిలుపు కోసం నిరంతరం తపిస్తూ ఉన్నట్లుంది!కాని వారెవ్వరూ ఈమె గారిని దగ్గరికి రానివ్వకపోవడంతో, వారంటే పడని రాజకీయ పార్టీల చెంతన చేరి, ఆ కుటూంబ సబ్యుల మీద అవసరమైనప్పుడు తన అక్కసు వెళ్ళ గ్రక్కుతూనే ఉంది. ఇక ఆ కుటూంబం మీద ఎదో రకంగా విమర్శలు చెయ్యలనుకునే రాజకీయ పార్టీలకు ఈమె దేవుడిచ్చిన వరం గా బావిస్తారు.

  పాపం నిన్న ఆ మహా నాయకుడి విగ్రహం బారత పార్లమెంటులో ఆవిష్కరించడానికి ఆ కుటుంబం అంతా అనందం గా వెళ్ళి తమ మద్య ఉన్న, వైషమ్యాలు మరచి(తాత్కాలికం కావచ్చు), ఆనందంగా గడుపుతుంటే, సదరు సహచరికి లోపల ఎలా ఉన్నా పైకి ఇది తనకు ఆనందం కలిగించే విషయమని, కాని తనను కూడ ఒక్క సారి "అమ్మా" అని పిలిచి ఆ కుటుంబంలోకి ఆహ్వానిస్తే, తాను ఒక్కరూపాయి కాని, పదవి కాని తీసుకోకుండా ఆ కుటూంబానికి అడ్డమైన చాకిరీ చెయ్యడానికి సిద్దమని చెప్పి పాపం మీడియా ముందు వాపోయింది ఆ ఇల్లాలు. అంతే కాదండోయి, అదే వారి  తండ్రి గారి ఆత్మ శాంతించే విషయం అని కూడా ఆమే నొక్కి మరీ వక్కానిస్తుంటే,ఏమి అనలేక కుటూంభ సబ్యులు అంతా కాం అయిపోయారు.పాపం ఆ కుటుంబానికి ఆమె ఒక పెద్ద తల నొప్పి కావచ్చు! ఏం చేస్తారు మరి చేసుకున్న వారికి చేసుకున్నంత మహా దేవ అని!తల్లి తండ్రుల   అస్తులకే కాదు ఆశయాలకు కూడా వారసులు కావాలి.అప్పుడే జన్మకు సార్థకత!.ఆశయాల వారసులు ఎప్పుడూ తల్లి తండ్రులను అవశాన దశలో వదలరు.మొత్తనికి ఆ మహా నాయకుడు పోతూ, పోతూ తన పిల్లలు జీవితాంతం గుర్తుంచుకునేలా చెయ్యడానికి ఒక శక్తిని ప్రయోగించి వెళ్ళారు.

   ఏక్కడ ఆయన గారి కుటుంబం వెళ్లునో, అక్కడకు ఆ శక్తి కూడా వెళ్ళి, అన్నగారిని వారికి గుర్తుకు తెస్తూనే ఉంటుంది.జై అన్న గారూ, జై జై అన్నగారూ!      No comments:

Post a Comment