Thursday, May 16, 2013

ఫిక్సింగ్ మాచ్ లు చూసి పిచ్చెత్తిపోవడమేనా, క్రికెట్ అంటే?

                                                                   


                                                               

  ఒక్క సారి కాదు, ఎన్నిసార్లు చెప్పినా మనకు పట్టిన క్రికెట్ పిచ్చి పోదు కాక పోదు. క్రికెట్ అంటే పిచ్చివాళ్ళ ఆట అని మేదావులు ఎంతమంది చెప్పినా, దాని మత్తులోనుండి బయటపడే పరిస్తితి లేదు. ఈ రోజు డ్రగ్స్ కంటే బయంకరమయిన మత్తు జబ్బు లాగ యువతను పీడిస్తుంది ఈ క్రికెట్ మహమ్మారి.యువత బలహీనతను అటు కంపెనీలు, ఇటు ప్రబుత్వ ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి.కొన్ని కోట్ల రూపాయల వ్యాపారంగా క్రికెట్ ఆటను మార్చిన ఘనత వీరికి దక్కుతుంది.

  క్రికెట్ అనేది డ్రగ్స్ కంటె ఎక్కువ మత్తిచ్చే పిచ్చి కాబట్టే అండర్ వరల్డ్ డాన్స్ కన్ను దీని మీద పడి ఉంటుంది. అందుకే  ఈ ఆట పేరున బెట్టింగ్లు మొదలు అయ్యాయి. ఎలాగు బెట్టింగ్లు పేరిట కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి కాబట్టే, మాచ్ ఫిక్సింగులు మొదలు అయ్యాయి. అందుకు ఆటగాళ్ళ సహకారం కూడ ఉంది కాబట్టి, ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుండవచ్చు. అసలు ఒక ఆటని వ్యసనం లాగా చూసి ఆనందించడం ప్రజల మానసిక దౌర్బల్యానికి గుర్తు గా బావించ వచ్చు. అటువంటి దౌర్బల్య స్తితికి ప్రజల్ని దిగజార్చుతున్న ఈ క్రిడ ను ప్రజలు నిరసించాలి. లేకుంటే చూడటమే తప్పా ఆటలు ఆడలేని అర్బక జాతి తయారవుతుంది.    

1 comment:

  1. అందరినీ ఒకే గాటన కట్టెయ్యలేము. కొంతమంది ప్లేయర్స్ ఫిక్సింగ్ చేసారని ఆట మొత్తాన్ని అనలేము కదా.
    అలాఅయితే లంచాలు తీసుకుంటున్న పోలిస్ వాళ్ళని, గవర్నమెంట్ వాళ్ళని చూసి వ్యవస్థని అన్నట్టవుతుంది.
    కాకుంటే క్రికెట్ మీద అతి అభిమానం తగ్గకపోతే ఇలాంటి పరిణామాలే ఉంటాయి.
    మిగతా ఆటలకి కూడా ఇబ్బందే.

    ReplyDelete