Saturday, May 4, 2013

కొట్టా, పెట్టని రాజు, కోటలొ ఉంటేనేం!పేటలో ఉంటేనేం!?



India Google Map.


china google map

                                                            

  మన కేంద్ర సర్కారు వారి తీరు అచ్చం అలాగే ఉంది. మన ప్రధాన మంత్రి గారు బహు మంచి వారు. ఎంత మంచివారు అంటే నోట్లో వేలుపెడితే కూడా కొరకలేనంతగా!. ఆయన తీరును చూసిన కొందరు, మిన్ను విరిగి మీద పడినా చలించని మనస్తత్వం అంటుంటే, ప్రతిపక్షాల వారేమో అంతకన్నా ఏమి చేస్తాడు "రబ్బర్ స్టాంప్" అధికారం ఉన్నవారు అంటున్నారు.ఈ దేశాన్ని ఏలుతున్న అధికార కాంగ్రెస్ "అధినేత్రి" గారు కూడా మన ఇందిరా గాంది గారి లాగా "డైనమిక్" కాదు కాబట్టి అటు కర్ర విరుగకుండా, ఇటు పాము చావకుండా పాలనా రథం నడిపిస్తున్నట్లుంది. ఇక ఈ మద్యే "కాబోయే దేస్ కీ నేత" అని పిలువబడుతున్న రాహుల్ గారు కూడా అప్పుడప్పుడు వివాద స్పద వ్యాఖ్యలు చేసి,ప్రతి పక్షాల చేత పిల్ల వాడి మాటలు అనిపించుకున్నాక, ఏ పనులు చేస్తే పెద్దవారి పనులు అవుతాయా అని సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుంది. ఇదీ ఇక్కడ మన పాలక పక్షం పరిస్తితి.

  ఇది చూస్తున్న పొరుగుదేశాలకు ఏమి మాయదారి ఆలోచనలు పుడుతున్నాయో కాని, వారికి ఇండియా అంటే ఖాతరు లేనట్లే ఉంది. ఒక పక్కా చైనా మన భూబాగం లోకి కిలోమీటర్ ల వంతున చొచ్చుకుని రావడమే కాక ఇది మా దేశంలో బాగమే అని భుకాయిస్తుంటే,కేంద్ర సర్కార్ చెష్టలుడిగి నామ మాత్ర నిరసనలతో కాలం వెళ్లబుచ్చుతున్నట్లుంది.ఒక్క సారి పైన ఇచ్చిన మన దేశం ఒక్క మాప్, చెనా దేశం వారి మాప్ చూస్తే వారు మన దేశ భూబాగాన్ని తమ భూబాగం గ ఎలా ప్రకటిస్తున్నారో అర్థం అవుతుంది. సాక్షాతు మన రక్షణ మంత్రి,  మన అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తే వారు అబ్యంతరం చెప్పారంటే, పరిస్తితి ఎంత క్లిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు

   ఇంకొక పక్క, ఇండియన్స్ అందరు ఒక్క సారిగా ఉమ్మేస్తే, ఆ ఉమ్ము సునామికే కొట్టుకుపోయే పాకిస్తాన్, ఇరవైయేండ్లు పైనా తప్పుడు సాక్శ్యం, అది కూడా నిందితుడిని హింసించి ఒప్పించిన నేరాంగీకారా ఒప్పుదల వాంగ్మూలం ఆధారంగా, ఉరిశిక్ష వెయ్యడమే కాక, వేసిన క్షమా బిక్ష పిటిషన్ లను కొట్టివేసి, చివరకు ఆ దేశ న్యాయసూత్రాలకు కూడా విరుద్దంగా,క్రూర మత విశ్వాసాలకు అనుకూలంగా కొట్టి చంపారు. చివరకు వారు ఈ దేశ వాసుల మనోబావాలను ఎంతగా గాయపరచారంటే,సరబజిత్ సింగ్ గారి శరీర బాగాలను కూడా కొన్నింటిని తొలగించి, ఇండియాకు పార్థివ దేహాన్ని పంపారంటే, ఈ దేశం పట్ల వారికున్న క్రూర ద్రుక్పదం అర్థ మవుతుంది. ఇది ఖచ్చితంగా మన మత విశ్వాశాలను తివ్రంగా కించ పరిచే చర్యే.

  మరి పైన చెప్పిన పొరుగుదేశాల లెక్కలేని   తనానికి కారణాలు ఏమిటి? మనం ఎంతమంది  ఉన్నాము    అని కాదు, మనలో ఎంత దమ్ము, పౌరుషాలు ఉన్నాయి అనేదే  పాయింట్ .   మన పౌరుషాన్ని ప్రతిబింబించే మన నాయకులు ఇలా దేనికి చలించని తత్వం చూశి మనం మెచ్చుకోవచ్చు గాక, పొరుగువాడు ఇంకొకరకంగా అర్థం చేసుకోబట్టే, ఈ రకమైనా దుష్పరిణామాలు ఏర్పడుతునాయి అని అనుకోవాల్శి వస్తుంది.  కొట్టా, పెట్టని రాజు, కోటలొ ఉంటేనేం!పేటలో ఉంటేనేం! అని ప్రజలు అనుకుంటే మాత్రం రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ వారికి "పీడ కలలు" గా మారుతాయి.             

No comments:

Post a Comment