Saturday, May 18, 2013

ఆమెది విచ్చలవిడి తనం నచ్చితే కాళ్ళు పట్టుకో! అంతేకాని ఆమెనే పట్టుకుంటానంటే ఎలా?

                                                                  ఆమె ఒక మనిషి లాంటి దేవత!. సాక్షాత్తు, సమాజంలో ఎవరి ప్రమేయం లేకుండా దివి నుండి భువికేగిన దేవకన్య(?) ఇంద్రజ!ఆమెకు సమాజంలోని సంప్రదయాలు, కట్టుబాట్లు వర్తించవు గాక! ఆమె తన ఇచ్చ వచ్చిన వారితో విచ్చలవిడిగా సంచరించు మదవతి యగు గాక!అంత మాత్రం చేత ఆమెను చెరపట్టు హక్కు నీకెవరు ఇచ్చారు? ఆమే తన అయిష్టాన్ని వ్యక్తపరిచే హక్కు కల పౌరురాలు. ఆమే ఇష్టానికి భంగం కలిగిస్తే ఎంతటివారైనా శిక్షకు గురికాక తప్పదు.

  ఇలా కాకపోయినా ఇంచుమించు ఇదే అర్థంతో మన చట్టాలున్నట్లు ఇటీవలి బారత అత్యున్నత న్యాయ స్తానం వారు ఇచ్చిన తీర్పు వల్ల మనకు అవగతమవుతుంది.ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, ఒక స్త్రీ విచ్చలవిడి తన్నాన్ని చూస్తే నిజంగా బుద్దున్న వాడెవ్వడూ అటు వంటి స్త్రీ సాంగత్యాన్ని కోరుకోడు.ఒక వేళా వీడూ అటువంటి బుద్దిలేని వెదవైతే, ఆమే విచ్చలవిడి తనం నచ్చితే, ఆమె పొందు కోసం తపిస్తుంటే, కాసులన్నా ఇచ్చి మచ్చిక చేసుకోవాలి,లేదా కాళ్లు పట్టుకుని అయినా కక్కుర్తి తీర్చుకోవాలి. అంతే కాని అబలే కదా, ఎలాగూ అదే బాపతు కదా, అని రేప్ చేస్తావురా మగాడా! ఆమే కారెక్టర్ లూస్ అయితే, ఆమెను కోరుకున్న నీ కారెక్టర్ ఎటువంటిది?కాబట్టి ఒక కారెక్టర్ లెస్ ఫెలో కి మరొకరి కారెక్టర్ ని డిఫ్ ఎన్స్ గా మార్చుకునే వీలు లేదు. ఇది దర్మ సూక్ష్మం.

   కాకపోతే మన సుప్రీం కోర్టువారు ఇంకొక కోణంలో కేసును పరిశిలించి, ఒక విచ్చలవిడి మనస్తత్వం ఉన్న స్త్రీకి ఉండే సచ్చీలత, ఆత్మ గౌరవం గురించి నొక్కి వక్కాణించారు. పాపం అది విన్న మన దేశపు సగటు స్త్రీలకు "స్త్రీ ఔన్నత్యం" అనే పదానికి అర్థం తెలియక బుర్రలు గోకుంటూ ఉంటారు."ఒకరితో కాపురంచేస్తున్నా, వందమందితో విచ్చలవిడిగా తిరిగుతున్నా ఆడది, ఆడదేరా డోంగ్రే" అని ప్రతి మగ వాడు తెలుసుకోవాలి. అనుమతి లేకుంటే మొగుడైనా ముట్టుకుంటే శిక్షించే చట్టమున్న ఈ దేశంలో పరాయి దానిని ఎలా ముట్టుకుంటారు?.కాబట్టి కాసులిచ్చే దమ్మన్నా ఉండాలి, కాళ్ళు పట్టుకునే టెక్నిక్కన్నా తెలిసుండాలి.లేకపోతే ఒక్క రోజు బాగోతానికి మూతి మీసం గొరిగించుకున్నట్లు, కాసేపు కక్కుర్తికి కటకటాలు తప్పవు!
     కాకపోతే సగటు భారతీయ మగవాడి యొక్క విన్నపం ఒకటే. ఒక అద్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పురుషునికంటే స్త్రీయే ఎక్కువ నైతిక విలువలు కలిగి ఉండడంలో సమర్దురాలు . "మగ బుద్ది" అనేది వెదవ బుద్ది అని నానుడి. స్త్రీల యొక్క నైతిక జీవనం మగవాడి బుద్దిని ప్రబావితం చేస్తుంది. ఏ కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా, లైంగిక దాడి చేసేది మగవాడే,బాదితురాలు స్త్రీయె. ప్రక్రుతి పరంగా కూడ ఉన్న ఈ పక్షపాతాన్ని గుర్తుంచుకుని, కనీసం స్త్రీలు అయినా  నైతిక జీవనానికి కట్టుబడితే సమాజం అంతా కట్టుబడినట్లే.

1 comment:

  1. నమస్కారం !

    బెంగుళూరు లో తెలుగు భాషాభిమానులని సమావేశపరచే ప్రయత్నం లో మిమ్మలిని సంప్రదిస్తున్నాను. మరిన్ని వివరాలకి veera.sj@rediffmail.com కి టెస్ట్ మెయిల్ పంపండి.

    ఇట్లు
    -శశి

    ReplyDelete