Tuesday, May 21, 2013

నాగరీకులుగ మనకు ఇన్ని యేండ్లు వచ్చినా, అత్యాచార కేసుల్లో "రెండు వేళ్లు" టెస్ట్,సిగ్గు!సిగ్గు!


                                                        
                                                                  

  మొన్న మన సుప్రీం కోర్ట్ వారు ఇచ్చిన తీర్పు, మానవీయ నాగరికతను కాపాడే విదంగా ఉంది.ఒక స్త్రీ అత్యాచారానికి గురి అయిందా లేదా అనడానికి లాబ్ టెస్ట్ ద్వారా నిర్దారిస్తున్నా,స్త్రీ యొక్క పూర్వ లైంగిక అనుబవ నిర్దారణకు పాత పద్దతి అయిన "రెండు వేళ్లు" టెస్ట్,చెయ్యడం అనాగరిక పద్దతి గానే బావించవచ్చు.

   ఇక్కడ "రేప్" అంటే స్త్రీ అంగీకారం లేకుండా పురుషుడు చేసే లైంగిక దాడి.దానికి స్తీ పూర్వానుబవంతో పని లేదు. లైంగిక క్రియ అంగీకారంతో జరిగిందా, లేదా అనేదే పాయింట్. అంతే కాని మె చెడు నడతను డిఫెన్స్ గా నిందితుడు కోరజాలడు అని సుప్రీం కోర్ట్ వారు స్పష్టం చెయ్యడం ముదావహం.

  ఒక వ్యక్తి కి బాగా స్వీట్లు తినే అలవాటు ఉందనుకుందాం. అంత మాత్రం చేత తనకు ఇష్టం లేని వ్యక్తి, బలవంతంగా స్వీట్ను నోట్లో పెడతానంటే కుదురుద్దా?ఆత్మాభిమానం దెబ్బ తినదా!అది కూడా నేరమే కదా. ఈ సూత్రమే లైంగిక దాడికి కూడా వర్తిస్తుంది. కాకపొతే ఆమే వైపు నుండి ప్రేరేపన ఉండి, లైంగిక క్రియ జరిగి,ఆ తర్వాత ఇతర కారణాలు అంటే  సమయంలో ఆమె తరపు వారు చూడడం లాంటివి జరిగినపుడు, కేసులు పెట్టడం జరుగుతుంది. అటువంటి కేసులలో కూడ ఆమే పూర్వానుబవం ప్రసక్తి అవసరం కాదు. మౌకికంగా సాక్షులను విచారించడం ద్వారా విషయ నిర్దారణ చేయవచ్చు. ఏది ఏమైనా సైన్స్ ఇంతగా అబిరుద్ది చెందిన ఈ రోజుల్లో కూడ ఇంకా ఈ అనాగరిక పరీక్షలేమిటి? ఇది పల్లెటూల్లో "శీల పరిక్ష" కోసం "కాల్చిన గడ్డ పార" దూయడం కంటే అనాగరికమయినది. ఇప్పటికయినా సుప్రీం కోర్ట్ వారు  దీని మీద ఒక స్పష్టమయిన తీర్పు ఇవ్వడం సంతోషించదగ్గ విషయం.

   కొంత మంది స్త్రీలు ఇతరుల చెతిలో పాచికలు మారడ వల్ల కాని, బ్లాక్ మెయిల్ కోసం కాని నిర్దోషులైన వారి మీద తప్పుడు కేసులు పెడుతుండడం వల్ల అట్టి నిర్దోషులను కాపాడడానికి ఇటూవంటి టెస్ట్ లను కొన్ని సార్లు కోర్టులు పరిగణనలోకి తీసుకుంటుండ వచ్చు.అయినా ఈ అనాగరిక విదానాన్ని త్యజించి, ఇతర సాక్ష్యాలు (సైంటిఫిక్) పద్దతిలో విషయ నిర్దారణ చేస్తే మంచిది.

కొసమెరుపు:- "మాయా బజార్" సిని మాలో చూపించిన "సత్యపీటం" లని ఎవరైనా కనుకుంటే బాగుండు.వాటిని ప్రతి కోర్టులో ఉపయోగించి తప్పుడు సాక్ష్యాలు చీపే వాళ్ళ ఆటలు కట్టించవచ్చు. మన సైంటిశ్టులు వాటిని కనిపెడతారని ఆశిద్దాం.       

2 comments:

  1. కనిపెట్టినా వాటిని బయటికి వదలరులెండి, వదిల్తే ఎప్పుడో ఒకసారి తాము కూడా ఆ సత్యపీఠాలమీద నిలబడాల్సి వస్తుందని పెద్ద తలకాయలకు తెలుసు.

    ReplyDelete
    Replies
    1. సత్య పీఠం లేకపోయినా సత్యమే చెప్పారు!

      Delete