Tuesday, April 30, 2013

ముఖ్య మంత్రి గారూ, "బంగారు తల్లి"కి లక్షలు కంటే బయట "రక్షణ"ముఖ్యం.

                                                               

                                                                       

  అయ్యా ముఖ్య మంత్రి గారూ, తమరు నిన్న ఆంద్ర ప్రదేశ్ లోని ఆడపిల్లల కోసం "బంగారు తల్లి" అనే పదకాన్ని ప్రవేశ పెట్టి, వారికి ప్రోత్సాహక బహుమానంగా, బిడ్డ పుట్టినది మొదలు 21  వ సంవత్సరములు నిండేవర్కు సుమారు రెండు లక్షల పై చిలుకు ముట్టేట్టట్లు చట్టం చేస్తామనడం అందరికి ఆనందం కలిగించే విషయమే. కాని మీకు తెలుసు ప్రస్తుతం ఆడపిల్లల్ని వేదించే సమస్య "రక్షణ". కామ ప్రకోపిత మ్రుగాళ్ళ నుండి రక్షణ. అది కరువై ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తెలియని అత్యంత దీన పరిస్తితులో ఆడపిల్లలు ఉన్నారు అనేది మీరు కాదనలేని విషయం.

   తల్లి తండ్రులకు చెప్పుకుని రక్షణ పొందలేని స్తితిలో ఈ రాష్ట్రంలో కొంత మంది ఆడపిల్లలు, అది ముఖ్యంగా మీరుండే హైదరాబాద్ లోనే ఉన్నారని, వారు విదేశి "షేకులకు"," వన్ మంత్ వైఫ్" లుగా మారి చివరకు ఏమవుతున్నారో తెలియని పరిస్తిలో ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. ఇది వారి వారి, అమ్మా బాబుల దన్నుతోనే జరుగుతుందని తెలిసి, మీ ఏలుబడిలో ఇటువంటివి కూడా జరుగుతున్నాయా అని ఆశ్యర్యపోతున్నాం.

  ఇకపోతే పసిపిల్ల నుండి, పండు ముదుసలి వరకు వావి వరసలు మరచి, పరమ నీచంగా వారి మీద ఎక్కడబడితే అక్కడ, చివరకు మరుగుదోడ్లలో కూడ "లైంగిక దాడులు జరుపుతున్న "కామ కీచకులు" నుండి రక్షించే వారెవరో తెలియక "ఓరీ బగవంతుడా! మమ్మల్నెందుకు మమ్మల్నెందుకు ఈ గడ్డ మీద ఆడబిద్దగా పుట్టించావు?మేమేమి పాపం చేశాం"అని మూగగా రోదిస్తుంటే అందరికి దిక్కనుకునే ఆ దేవుడు కూడా చేష్టలుడిగి చూస్తున్నాడు.మరి ఇటువంటి ఆక్రందనలు ఆ బగవంతుడి భూరూపమైన(రాజు దేవుడితో సమానం) తమకు వినిపించడం లేదా? పోని ప్రతిపక్షాలకు చెపుదామంటే వారు సీరియస్ గా పాదయాత్రలలో మునిగి పోయారు.వారు అధికారంలోకి వస్తే తప్పా ఏమి చెయ్యలేరట!. ఇక తెలంగాణా వారైతే వీటన్నిటికి మూల కారణం వలస పాలనే కాబట్టి, తెలంగాణా వస్తే తప్పా ఈ కీచక పర్వం ఆగదంటారు.

  మరి ఇటువంటి పరిస్తితులున్నఫుడు తమరు ఆడపిల్లలకు "రక్షణ" ఇచ్చే పదకాలు ప్రవేశ పెట్టకుండా, ఇరవైఒక్క సంవత్సారాల కాల పరిమితితో  "లక్షల" పధకం "బంగారు తల్లి" వల్ల ఒరిగేదేముంది?. మీరిచ్చే ఆ బహుమతిని అందుకోవడానికైనా స్వేచ్చగా ఆడపిల్లలు బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళగలరా? అందుకే ముందు రక్షణ ఇవ్వండి. ఆ తర్వత ఏమిచ్చినా ! వాటిని అందుకోవడనికి "నిర్భయం"గా ముందుకొస్తారు.  అందరికీ సంతోషమే

దీనికి మేము సర్వదా క్రుతజ్ణులమై ఉండగలము. 

                                                                   ఇట్లు
                                                ఆంద్ర ప్రదేశ్   ఆడపిల్లల  శ్రేయోభిలాషులు   
                                                         

No comments:

Post a Comment