Monday, April 15, 2013

మంత్రిగారికి ఇన్నాళ్లకి మండింది కాబోలు!


                                                                   

  మొన్నటి దాక" మా నాయకుడు, మడమ తిప్పని వాడు,వీరాధి వీరుడు, శూరాధి శూరుడు" అని పొగిడిన మంత్రులే ఈ రోజున ఆయన కొడుకుని "ద్రోహి,ఉరితీసిన పాపం లేదు, తండ్రిని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచాడు" అని సాక్షాతు ఒక రాష్ట్ర మంత్రి జైలులో ఉన్న జగన్ గారిని తిడుతుంటే, తక్కిన మంత్రులు అభినంధించారట!

   పాపం ఇన్నాళ్ళు జగన్ అవినీతి కుంభ కోణాలు గురించి బారత అత్యున్నత నేర పరీశోదక సంస్త చార్జి షీట్ లు ఒక దాని తర్వాత ఒకటి దాఖలు చేస్తున్నా, ఇవ్వన్నీ రోటీన్ వర్క్లో బాగమేలే, ఏ నాటి కైనా జగన్ తమ పార్టీలోకి రాక పోతాడా, ఈ కేసులన్ని అటకెక్కకపోతాయ, అని ఉపేక్ష వహించినట్లుంది పాపం. అమ్దుకే అధికార పార్టీ కి చెందిన మంత్రులెవరూ జగన్ ని ఏమి అనే దైర్యం చెయ్యలేక పోయారు. కాని తీరా మంత్రులను సైతం వదలకుండా సి.బి. ఐ. వారు చార్జ్ షీట్ లో స్తానం కలిపిస్తుండడంతో, ఎప్పుడు ఏమి జరుగుద్దో తెలియక అయోమయంలో పడిపోయారు అమాత్యులు. ఇక ఇలా ఉంటే లాబం లేదని డిఫెన్స్ చర్యలు మొదలు పెట్టినట్లుంది. అందులో బాగమే "ఆనం"గా గారి సంచలన వ్యాఖ్యాలు. దానికి సంబందిత మంత్రుల వత్తాసు. ఏదైనా తమదాక వస్తే గాని తెలియదు మరి.

   సంతకాలు చెయ్యడం వరకే సహచర మంత్రుల పని కాని, జైల్లో సహచర ఖైదీలుగా ఉండమంటే ఏలా? కోట్లేమో వారికి,కటకటాలేమో మాకా? అని సంబడిత మంత్రులు వాపోతున్నరట. అందుకే వెంటనే ఆనం గారి డైలాగులకి జై కొట్టారు కాబోలు. మొత్తానికి సంబదిత మంత్రులు మాత్రం "ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు" అని మౌన గీతం పాడుకుంటుంనట్లుంది!    

No comments:

Post a Comment