Tuesday, April 9, 2013

స్నేహితుడు అని నమ్మితోడుగా "గోవా" వెళితే,"రేప్" చేసి తీసుకొచ్చాడట!


   

  పాపం ఒక అమ్మాయి, హైద్రాబాద్  పోలిస్ స్టేషన్ పరిధిలొ ఉన్న  ఒక దాంట్లో పిర్యాదు చేసింది అంట! సదరు పిర్యాదు సారాంశం ఏమనగా " అయ్యా! పోలీస్ వారూ, నేను నా స్నేహితుడొకడు "గోవా" వరకు వెళ్లి వద్దాం వస్తావా? అని అడుగగా, సరే స్నేహితుడే కదా, పాపం ఎవరూ తోడు లేక, భయమేసి రమ్మంటున్నాడేమో  అని బావించి, తోడుగా గోవా వరకు వెళ్లగా అక్కడ ఆ స్నేహితుడికి, ఏమి మాయ రోగం పుట్టిందో ఏమో, నన్ను  తన లైంగిక కోరిక తీర్చమనగా, నేను నిరాకరించాను. దానికి అతను పాశవికంగా దాడి చేసి నన్ను "రేప్" చేసాడు. కాని నేను నిస్సహాయ స్తితిలో ఉన్నాను కాబట్టి గోవా లో కేసు పెట్ట లేదు. ఇక్కడి కొచ్చి కేసు పెడుతున్నాను. కావున చట్ట పరంగా చర్యలు తీసుకోగలరు".

  పై కేసు గురించి విన్నాకా మనకు సహజంగా ఒక డౌట్ వస్తుంది . స్నేహితులైన స్త్రీ పురుషులు ఇరువురు గోవా లాంటి చోటుకి పోయి అక్కడి చర్చ్ లో ప్రార్థనలు చేసి వస్తారా?.అక్కడి వాతావరణం వారి స్నేహ బందాన్ని భంగపరచకుండా ఉంటుందా? "తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు తాగుతున్నామని" చెపితే నమ్మ శఖ్యంగా ఉంటుందా? గోవా వెళ్ళింది కబుర్లు చెప్పుకుంటానికి అని చెపితే ఎవరైనా  నమ్మి నట్లు నటిస్తారు కాని, చచ్చినా నమ్మరు. "అవకాశం ఇవ్వనేలా? భంగ పడి బాద పడనేలా?.

  ఇక్కడ మగాళ్లు  కూడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు "నిర్భయ" చట్టం చాల కటినంగా ఉంది. ఒక వేలా స్నేహితులు అంగీకారం తెల్పినా సరే, సాక్ష్యాదారం  బలంగా ఉంటే తప్పా, మీరు శిక్ష నుండి తప్పించుకో లేరు. తస్మాత్ జాగ్రత్త!            

1 comment:

  1. బాధితురాలే కి'లేడీ'!: రేప్ చేయకున్నా డబ్బు కోసమే..

    హైదరాబాద్: విహారయాత్ర పేరుతో గోవాకు తీసుకు వెళ్లి తనకు మద్యం తాగించి అత్యాచారం చేశారని రెండు రోజుల క్రితం ఓ యువతి చిలకలగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, సదరు యువతి తప్పుడు ఫిర్యాదు చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తనను విహార యాత్రకు ముగ్గురు యువకులు తీసుకు వెళ్లి అక్కడ అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. అయితే యువతే వారిని గోవాకు విహార యాత్ర పేరుతో తీసుకు వెళ్లినట్లుగా తేలింది. ఇంతకుముందు కూడా ఇలాగే చేసిందని, డబ్బుల కోసమే ఆమె ఇలా చేస్తుందని కొన్ని ఆధారాలు లభించాయట. ఈమె హైదరాబాదు యువతి కాదు. బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఆమె తన పేరు మార్చుకొని హైదరాబాదులో ఆరేళ్లుగా ఉంటోంది. ఓ పోలీసు అధికారి కూతురుగా పరిచయం చేసుకొని పలు ప్రాంతాల్లో నివసించింది. తండ్రితో ఉన్న విభేదాల కారణంగా వేరుగా ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నానని ఆమె చుట్టుపక్కల వారికి చెప్పింది. డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న ఆ యువతి తెలివిగా పలువురిని మోసం చేస్తోందని తేలింది. హోటళ్లు, రెస్టారెంట్లలో యువకులను ఆకర్షించి వారితో స్నేహం చేసిన అనంతరం గోవా వంటి ప్రాంతాలకు విహార యాత్రకు తీసుకు వెళ్లడం, అక్కడ సరదాగా గడపడం చేస్తుండేది. హైదరాబాద్ తిరిగి వచ్చాక అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆమె పథకం. కేసు నమోదు చేస్తానంటే మాత్రం వద్దని డబ్బులు ఇప్పిస్తే సర్దిపెట్టుకుంటానని చెబుతుంటుందట. అభియోగాలు ఎదుర్కొన్న వారు కూడా డబ్బులిచ్చి వదిలించుకోవడంతో అది సద్దుమణిగేది. ఇప్పుడు మాత్రం ఆమె వ్యవహారం బయటకు వచ్చింది. ఐదేళ్లలో పలువురిని ఇలా మోసం చేసి లక్షల్లో డబ్బు కాజేసిందట. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

    ReplyDelete