Wednesday, December 19, 2012

అబ్బా! డీల్లీ కీ "కల్కి" ఖాయమా?

                                                                          
 ఈ రోజు గుజరాత్ ఎన్నికలు పలితాలు చూశే సరికి, దేశ ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్లు ఉంది. బి.జె.పి పార్టీ "నరేందర్ మోడి" నేత్రుత్వం లో కేంద్రంలో  అదికార పగ్గాలు చే పట్టోచ్చు అనే ఆశ ప్రజల్లో రెప రెప లాడుతున్నట్లుంది.ఒక వేళ అదే నిజమయితే నేను చెప్పిన జోస్యం అదే నండి "కల్కి" రేపు వస్తున్నాడు అనేది చాల వరకు కరెక్ట్ అయినట్లే.ఎలాగంటారా అయితే చూడండి మరి!

  నేను ఏమి చెప్పాను నా వెనుతటి టపాలో ? కల్కి అనే పదానికి ఉన్న అర్ఠాల్లో "తామర పువ్వు" ఒకటని చెప్పానా! కావాలంటే ఈ లింక్ http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_8576.html ని క్లిక్ చెయ్యండి.      యస్. చెప్పాను కదా! ఇప్పూదూ గుజరాత్లో బి.జె.పి గెలిచింది అంటె పార్టీ గుర్తు "కమలం" గెలిచింది. కమలం అంటే తామర పువ్వే కదా. అంటే "కల్కి" గెలిచినట్లే కదా!రేపు ఇదే స్పూర్తితో ’డీల్లీ" లో "కల్కి జెండా" ఎగరితే నేను చెప్పిన జోస్యం నిజమయినట్లే కదా. ఈ విదంగా నేను చెప్పినది పాక్షికంగా నైన నిజమయింది అని ఒప్పుకోవాలి మీరు.

  కాక పోతే "వీర బోగ వసంత రాయలు" అనేది  అవతార పురుషుడయిన తెలుగు వీరుడి పేరు. ఈయన ఖచ్చితంగా తెలుగువాడయి ఉండాలి కాబట్టి రేపటి వరకు నాకు చాన్స్ ఉంది కాబట్టి, ఆయన గురించి కూడ నేను చెప్పిన జోస్యం నిజం కావాలని మీరంతా మనస్పూర్తిగ కోరుకోవాలి. రేపు ఈ పాటికి ఆయన గురించి చెప్పేస్తా!(అని నా నమ్మక్కం) 

4 comments:

  1. గత జన్మలో నరేంద్రమోడీ తెలుగువాడు. అవును నిజమే మీరు చెప్పిన తామరపూవూ కరక్టే . హుర్రే నాకు తెలిసిపోయింది వీర భోగ వసంతరాయాలు ఇంకెవరు మన నరేంద్రమోడీనే.. నరేంద్రమోడీ కి తెలుగు నేర్పించడం మన తక్షన కర్తవ్యం..

    ReplyDelete
    Replies
    1. మరీ నరెంద్ర మోడి గారి పూర్వ జన్మ తో ముడి పెడితే తెలుగు ప్రజలు నమ్మక పోవచ్చు. నేను ఎంత లబ లబ లాడినా ఒప్పుకోరనుకుంటా! ఇంకేదయినా అయిడియా ఉంటే చూడండి.

      Delete
  2. మీ లాజిక్ లతో పిచ్చేక్కిస్తున్నారు గా ....

    ReplyDelete
    Replies
    1. మొత్తానికి నేను సూపర్ మాన్, స్పైడర్ మాన్ కాక పోయినా "లాజిక్ మాన్" గా మీ చేత గుర్తించ బడినందుకు మీకు నా అనంత కోటి వందనములు.

      Delete