Thursday, December 27, 2012

. "స్తీ వాదం" అంటే రేప్ ని సమర్దించడమా! ?

                                                                    .
 నేను ఇంత కాలం స్త్రీ వాదం అంటే కెవలమ్ స్త్రీలకు వ్యతిరెకంగా సమాజమ్ లో జరుగుతున్న అన్యాయాలకు, స్త్రీలు మాత్రమె స్పందించాలని, స్త్రిలకు తమ ఇష్టం వచ్చిన విదంగా తిరిగే స్వేచ్చ కావాలని డిమాండ్ చేసేవారు అని అనుకున్నాను. కాని ఇందాక ఒక బ్లాగులొ ఒక మిత్రుడు ఒక స్త్రీవాది గురించి చెపుతూ ఆయన (స్త్రీ వాది )డిల్లీ రేప్ ఘటన గురించి చెప్పిన  అభిప్రాయం ఒకటి ఆ బ్లాగులో ఇచ్చాడు. అది చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది అంటే నమ్మండి. అది ఇదే.   
         "సామాజికంగా వెనుకబడిన ఇండియా లాంటి దేశంలో ఒకడితో డేటింగ్ చేసిన అమ్మాయిని ఇంకొకడు పెళ్ళి చేసుకోడని తెలిసి కూడా డేటింగ్‌ని సమర్థించేవాళ్ళు రేప్‌ని మాత్రమే హత్యతో సమానమైన నేరంగా ఎందుకు పరిగణించాలని అనుకుంటున్నారు? కార్మిక వర్గంతో గానీ స్త్రీవాదంతో గానీ సంబంధం లేని & పరువుమర్యాదల కోసం ప్రాకులాడేవాళ్ళ భావజాలంతో మాత్రమే సంబంధం ఉన్న ఈ కేస్ గురించి మార్క్సిస్ట్‌లు సీరియస్‌గా ఆలోచించడం అనవసరం. ఆ అమ్మాయి శరీరం ఆమె ఇష్టం కనుక ఆమె డేటింగ్ చేస్తుందని మీరు అనొచ్చు. ఆ రౌడీగాళ్ళు కూడా తమ బిహేవియర్ తమ ఇష్టం అనుకుని రేప్‌లు చేస్తారు. నీతి అనేది తమకి ఒకలాగ, ఇతరులకి ఇంకొకలాగ వర్తించాలని అంటే దాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు."
       ఆ బ్లాగులోనే నాకు తోచిన సమాదానమ్ రాసి పడేశాను అది ఇది. అఫ్ కోర్స్. ఇది మామూలుగా చెప్పేదే అనుకోండి.
                   
 (1)డేటింగ్ అనైతికం అయితే రేప్ చట్ట వ్యతిరేకం. అనైతికాన్ని సమాజం శిక్షిస్తుంది (అమెకు వేరొకరితో పెళ్లి కాదు అనేది అదే), చట్ట ఉల్లంఘనను చట్టం శిక్షిస్తుంది.

 (2). డేటింగ్ వల్ల బౌతిక దాడి కాని, బావ దాడి(ఇష్టానికి వ్యతిరేకం)  కాని ఉండదు. రేప్ లో రెండూ ఉంటాయి.పాపం బాదితురాలు ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉంది.

 (౩).ఒక వేళా డేటింగ్ చట్ట వ్యతిరేకం చేస్తే, నేరస్తులను చట్టానికి అప్పగించడమే ఇతరుల బాద్యత తపా, వారికి వ్యతిరేకంగా నేరాలు చెసే హక్కు ఎవరికి లేదు.

 (4). స్తీ వాదం అంటే రేప్ ని సమర్దించడమా! లేక రేప్ లు చేయించుకోవడమా? స్త్రీ వాదులకు పరువులు ఉండదా? అంతా ఓపెన్ మైదానమేనా?



  అయితే ఇక్కడ నేను సూటిగా ఒకటే ప్రశ్న ఆ సో కాల్డ్  స్త్రీ వాదికి వేయదల్చుకున్నాను. "మీరు నిజంగా స్త్రీ వాదాన్ని సమర్దించే వాల్లు అయితే, ఇదే మీ ఇంట్లో ఎవరికయినా జరిగితే ఇలాగే స్పందిస్తారా?
           నిజంగా ఆయన చెప్పినట్లు అంటె  డిల్లి కేసులో అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి డేటింగ్ చేసి వస్తుంటే అది గమనించిన దుండగలు అమేను రేప్ చెసి ఉన్నట్లయితే ,ఈ దారుణం "స్తీ వాద ప్రబావమే" అని చెప్పక తప్పదు. "బౌతిక దాడి’ తో సమానంగానే "లైంగిక దాడి" ని చూడాలని స్త్రీ వాదుల అభిప్రాయం కాబోలు. ఎందుకంటే ఈ దాడిని అరికట్టె  పేరుతో సాంప్రదయ వాదులు ఎక్కడ విచ్చల విడి స్వేచ్చను నిరోదించమని ప్రబుత్వాలను డిమాండ్ చేస్తారో అని వీరి బయం.

  స్త్రీ వాదం పేరుతో అమాయకపు, నిర్బాగ్య స్త్రీలను వీదుల్లోకి తీసుకువచ్చి, తమ వ్యాపార సంస్క్రుతికి అనుగుణంగా వాడుకుంటున్న వ్యాపార వర్గాలకు, వారికి ఉపయోగ పడుతున్న ఈ సోకాల్డ్ "స్త్రీ వాదులకు" డిల్లీ లొ  లేచిన నిరసన జ్వాలలు ఏ మాత్రం రుచించటం లేదు. అందుకే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చివరకు రేప్ లను కూడ సమర్దించే స్తాయికి దిగజారారు. ఇదే వీరి నిజ స్వరూపం. మన దేశ సంస్క్రుతిని నాసనమ్ చేసి, మన స్త్రీలను విదేసి వ్యాపార సంస్క్రుతి  కి అనుగుణంగా మార్చడమే "స్త్రీ వాదుల అజెండా". కాబట్టి ఇకనైనా కళ్ళు తెరుద్దాం. మన జాతిని,నీతిని, సంస్క్రుతిని కాపాడుకోవాల్శిన తరుణమ్ ఆసన్నమయింది. లేకుంటే నేడు "అమానత్" (డిల్లి బాదితురాలు) కి పట్టిన గతే ఈ దేశపు స్త్రీలకు పడుతుంది. ఈ దురాగతాలను ఆపుదాం.మనం స్త్రీ వాదులమ్ కాదు సమానత్వ వాదులమని చాటి చెపుదాం.  

No comments:

Post a Comment