Friday, December 14, 2012

మీ ఇంట్లో "ఎలియన్స్" ఉన్నారేమో చూసారా!?



 నిన్న టి.వి.లో ఒక కథనం ప్రసారమయింది. ఈ మద్య మన "వైజాగ్"లో  ఒక కార్ల షో రూమ్ లో, నలుగురు ఎలియన్స్ అంటే ’ఇతర గ్రహాల నుండి వచ్చిన వారు "  కన పడ్డారట. అయితే వారు మామూలుగా కనపడరట. కెమేరా కంటికి మాత్రమే చిక్కుతారట. ఆ షో రూమ్ లో ఉన్న మాట్ ఒకటి కింద పడితే, అనుమానం వచ్చి, అక్కడున్న వారు సర్క్యూట్ కెమేరాలో పరిశిలిస్తే నలుగురు ఏనిమేషన్ బొమ్మ లాంటి వారు కన పడ్డారట. సదరు ఏలియన్ చిత్రాల్ని కూడ చూపించారు.

  కాబట్టి మిత్రులారా, యుగాంతం రోజు దగ్గర కొచ్చింది, కనుక ఏలియన్ లు మన గ్రహం మీద కొచ్చారా? ’వీర బోగ వసంత రాయలు " గారు మన రాష్ట్రం నుంచి వస్తాడు కాబట్టి ఆయనకి సహాయ పడటానికే ఏలియన్స్ మన రాష్ట్రం లోకి అడుగు పెట్టారా? లేకుంటె ఎప్పుడూ ఇతర దేశాలలో కన పడే ఏలియన్స్ మన రాష్ట్రం లో కన పడట మేమిటి? వారి వల్ల మనకు మేలు జరుగుద్దా? కీడు జరుగుద్దా? ఇదంతా తెలియాలి అంటె మరి కొన్ని రోజులాగక తప్పదనుకుంటా?

 ఈ లోపు మనం ఒక పని చేస్తే పోద్ది. మన ఇండ్ల లో కూడ ఎలియన్స్ ఉండే ఉంతారు కాబాట్టి, ఒక సారి ఇల్లంతా కేమేరా లతో పోటో తీసి పరీక్షిస్తే పోలా! 

2 comments:

  1. బాబ్బాబు అది ఏ షోరూమో చెబితే నేను ఆ ఏలియన్స్ ని దర్శించుకుంటాను. నేను ఉండేది విశాఖపట్నంలోనే

    ReplyDelete
    Replies
    1. సార్ మీది వైజాగ్ అంటున్నారు కాబట్టి ఒక చిన్న ఫావర్ చెయ్యండి. నిన్న సాయంత్రం N.T.V వారు ప్రసారం చేసిన ఎలియన్స్ ప్రోగ్రామ్ ఏ షాపో కనుకున్ని, అక్కడికి వెళ్లి వాస్తవాలు కామెంట్ గా తెలుపగలరు. నేను ఆ శాప్ పేరు గుర్తుంచుకోలేదు. N.T.V గారిని అడిగి తెలుసుకోగలరు. దాంక్ యు.

      Delete