Sunday, December 2, 2012

" కల్కి" అవతార పురుషుడి తల్లి పేరు తెలిసింది!


 ఇక నుండి వరుస టపాలలో  రాబోయే కల్కి వివరాలు ప్రచురించాటం జరుగుతుంది. మీకు తెలిసినవారు ఎవరయినా నేను చెపుతున్న వివరాలతో వారి బయో డేటా సరిపోతే, వారి వివరాలను,  నాకు ఈ మెయిల్ చెయ్యగలరని మనవి. వివరాలు మొత్తం చెప్పేదాక, ఈ బ్లాగుని అనుసరించగలరని, వీక్షకులకు సవినయంగా మనవి చేస్తూ.....

  మొదటగా కల్కి తల్లి గారు ఎవరని చెప్ప బడిందో తెలుసుకుందాం.కల్కి చరిత్రను గూర్చి మనకున్నది,ముఖ్యమయిన అదారాలు (1), కల్కి పురాణం లేక బాగవతం (2) విష్ణు పురాణం.

 -----కల్కి పురాణంలో ఇతని తల్లి పేరు "సుమతి" అని చెప్పబడింది. సుమతి అంటె "మంచి బుద్ది కలద్ " అని అర్థమట.

----- అదే విష్ణు పురాణంలో "మన్వంతరం"లు గురించి పద్నాలుగు మంది మనువులు గురించి వివరంగా చెప్ప బడి ఉంది. అంతే కాకుండా, ప్రతి మన్వంతరంలో, పరమాత్మ అవతారం పేరు, అయన తల్లి తండ్రుల పేర్లు కూడ వివరంగా చెప్పబడి ఉండటం వలన " కల్కి పురాణాన్ని,విష్ణు పురాణాన్ని కలిపి విశ్లేచడం జరుగుతుంది. రెండితిలో సారూప్యత ఉన్న వాటికి అధిక ప్రాద్యాన్యత ఇవ్వడం జరిగింది. లేకుంటే ఒక పురాణానికి, ఇంకొక దానికి అసలు సంబందం లేకుంటే అంతా గందర గోళమే కదా! అందుకే ఈ పద్దతి.

    విష్ణు పురాణం లో రాబొయే ఎనిమిదవ మన్వంతరం లొ పరమాత్మ(కల్కి) పేరు సార్వబౌమ అంట! అయన తల్లి పేరు "సరస్వతి" అని చెప్ప బడింది.

    కాబట్టి ఇప్పుడు పైన చెప్పబడిన రెండు పేర్లుకు ఏమన్నా సంబందం ఉందా? అంటె సంబందం ఉందనే చెప్పవచ్చు. సరస్వతికి ఉన్న నానా అర్థాలలో "సుమతి" కూడ ఒకటని చెపుతారు.కాబట్టి   "కల్కి’ ఒక్క తల్లి పేరును "సరస్వతి" లేక "సుమతి’ కి సంబందిచిన వివిద నామాలలో ఒకటయి ఉండాలని నా అభిప్రాయం.

 ఇక పొతె తండ్రి పేరు గురించి తరవాటి టపాలో చూద్దాం.     

No comments:

Post a Comment