Saturday, November 17, 2012

అయ్యలారా! అమ్మలారా! వినండహో! మహమద్ ప్రవక్తే కల్కి అవతారమట!

                                                                   
                                      
 అదండి సంగతి! క్రిష్టియన్లు యేసు ప్రభువే కల్కి అవతార మంటుంటె మేమేమి తక్కువ తిన్నాం, అన్నట్లు ముస్లింలలో కొంతమంది "మహమద్ ప్రవక్తే భూమి మీద జన్మించిన చివరి అవతారం కాబట్టి ’కల్కి ’అంటే ఎవరో కాదు సాక్షాత్తు "మహమద్ ప్రవక్తే" అని బల్ల గుద్ది వాదిస్తున్నారు.దీనిని నిరూపించటానికి కల్కిపురాణం,శ్రిమద్బాగవతం,భవిష్య పురాణాలలో చెప్పిన భవిష్యాలు తమ ప్రవక్త కు సరిగ్గా సరిపోయాయి అని  మురిసి పోతున్నారు . వాటిలో మచ్చుకు కొన్ని:--

కల్కి పుట్టేది  "శంబళ" అనే ప్రాంతం:- శంభళ అంటే "ప్రశాంతమయిన  ప్రాంతం" అని అర్థమటా !. మహమద్ పుట్టిన "దారు సలేం" అన్నా అదే అర్థమట!.

కల్కి తండ్రి పేరు "విష్ణు  యశుడు" అంటే "దైవ సేవకుడు" అని అర్థమట! ప్రవక్త తండ్రి "అబ్దుల్లా" పేరులోని అర్థం కూడ అదేనటా!

కల్కి తల్లి పేరు " సుమతి" అంటే"శాంతి దూత"అటా! ప్రవక్త తల్లి అమీనా అన్నా అదే అర్థమట!

 ఇలా చెప్పుకుంతూ పోతే చాట బారతమ్ అయ్యేటట్లుంది! కాబట్టి సంబందిత లంకె ను ఇస్తున్నాను క్లిక్ చేసి చూడగలరు.

ఏతా వాతా చెప్పేది ఏమిటంటే హిందువుల కన్నా హిందూ బవిష్య పురాణాల మీద ఇతర మతస్తులకే ఎక్కువ నమ్మకం ఉన్నట్లుంది. అందుకే వారు మా ప్రవక్త కల్కి అంటే, మా ప్రవక్త కల్కి అని తెగ ఊదేస్తుంటె, ఈ హిందువులేమో ,ఎప్పుడొ కొన్ని లక్షల యేండ్లకు గాని కల్కి పుట్టడు అని హాయిగా కాలంవెళ్లదీస్తున్నారు.

కాని నేనైతే కల్కి ఈ సంవత్సరం చివరికల్లా వస్తాడని ఎందుకో మహా నమ్మకంగా ఉంది.చూద్దాం ఏమి జరుగుద్దో!     

(http://www.islamicvoice.com/november.97/OURD.HTM)

No comments:

Post a Comment