Saturday, November 24, 2012

యుగాంతం తర్వాత "కల్కి" స్తాపించేది "కమ్యూ’నిజమే" నంటా!


విశ్వం లో ఆవిష్క్రుతమవుతున్న  "అరుణ తార"


 ఈ దేశంలో కమ్మ్యునిస్ట్ లు "సోషలిజం ,ఇదిగో వస్తుంది,.అదిగో వస్తుంది అని ప్రజల్ని ఊరించి,ఊరించి అసలు దాన్నేలా ఈ దేశానికి తేవాలో తెలియక 'నోరెళ్ళ బెట్టి  సిద్దాంత రాద్దాంతాలు  చేస్తుంటే, వీళ్ళ గోల అర్థంకాక, ప్రజలు నెహ్రూ గారి ’శోషలిజానికి" జై అనేశారు. అ దెబ్బతో క్రిందబడిన కమ్మ్యునిస్టులు ఇంతవరకు లెగలేదు.
 ఇక మన రాష్ట్రంలో అయితే, "రామారావు" గారు రెండు రూపాయలకు క్కిలో బియ్యం నకు మించిన సోషలిజం ఉందా ? అనేసరికి అప్పట్టి దాక జుత్టు పీక్ఖున్న చాలా మంది జై "తెలుగు దేశం" అనేశారు. ఇక అక్కడక్కడ మిగిలి పోయిన వారు మళ్లి ఎప్పుడో ఒకప్పుడు "మన ఇజం" రాకపోతుందా అని ఎద్రు చూస్తున్నారు. అటువంటి వారికి ఒక శుభ వార్త! మా కల్కి తేబొతుంది నిజమైన "కమ్మ్యునిజమంటా!

   అదేలాగంటే " కల్కి’ దుష్టులను నిర్మూలించి,"బ్రహ్మజ్ణానులను(బ్రాహ్మనులు కాదు) కాపాడతాడట. ఇక మిగిలేది వారే కాబట్టి వారికి ఈ ప్రాపంచిక సుఖాల మీద అంత యావ ఉండదు కాబట్టి, చాతనైనది చెయ్యడం, కావల్సినంత వరకే తీసుకుంటారు."     మార్క్స్"   చెప్పింది అదే గదా. ఆ విదంగా బారతదేశమే మొట్ట మొదటి "మన కమ్మ్యునిస్ట్"  దేశం అవబోతుందహో.... 

No comments:

Post a Comment